For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగాళ్లకు మాత్రమే.. ఇలా చేస్తే మహిళలకు అస్సలు నచ్చదట...! వారి మూడ్ ఆఫ్ అయిపోతుందట..

|

మీ మనసుకు నచ్చిన అమ్మాయిని ఆకట్టుకోవాలంటే.. తన మనసును మీరు గెలవాలంటే.. కేవలం విలువైన బహుమతిలిస్తే సరిపోదండయ్..

కేవలం టెడ్డీ బీర్, రోజ్ ఫ్లవర్స్, వారికిష్టమైన చాక్లెట్లు ఇస్తే వారు మిమ్మల్ని ఇష్టపడరు. అంతకుమించిన పనులన్నో చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనవి మీ అలవాట్లు. ఎందుకంటే మీకు ఇలాంటి ఈ రకమైన హ్యాబిట్స్ ఉంటే అమ్మాయిలు మీకు ఆటోమేటిక్ గా దూరమవుతారు. అందుకు నిదర్శనమే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఘటన. అమెరికాలోని ఓ బాయ్ ఫ్రెండ్ తన ప్రియురాలికి 11 షాకింగ్ రూల్స్ పెట్టాడు. దీంతో తనకు చిర్రెత్తుకొచ్చింది.

అంతే వెంటనే ఆ రూల్స్ స్క్రీన్ షాట్ తీసి వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసింది. దీంతో అది తెగ వైరల్ అయిపోయింది. అంతే వారిద్దరి మధ్య బంధానికీ బీటలు వారాయి. తను బ్రేకప్ చెప్పేసింది.

కాబట్టి మీ రిలేషన్ షిప్ లో కూడా ఇలాంటివేమైనా ఉంటే ఇప్పుడే వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి లేదంటే అంతే సంగతులు. ఇక అసలు విషయానికొస్తే.. చాలా మంది అమ్మాయిలకు ఈజీగా కోపం వచ్చేస్తుంది. అయితే అందుకు గల కారణాలేంటో తెలిస్తే.. వారిని తేలిగ్గానే కూల్ చేయొచ్చంటున్నారు నిపుణులు. ముందుగా వారికి ఎలాంటి విషయాలు నచ్చుతాయి.. మనలో ఎలాంటి విషయాలు నచ్చవు అనే వాటి గురించి తెలుసుకోవాలంట. ఈ సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అలా చేస్తే.. మీకు నచ్చిన అమ్మాయి వయసుతో పని లేకుండా పడిపోతుందట...!

ఓ సర్వే ప్రకారం..

ఓ సర్వే ప్రకారం..

ఆడవారికి ఎందుకు కోపం వస్తుంది? అనే విషయాన్ని కనిపెడితే వారిని ఎలా ఆకట్టుకోవాలో సులభంగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని వందల మంది ఆడవాళ్ల మందిని అభిప్రాయాలు అడిగారట. అందులో చాలా మంది స్త్రీలు తమ ప్రియుడు, భర్త ఇలాంటి పనులు చేస్తే తమకు నచ్చవని చెప్పారట. ఈ సందర్భంగా వారికి నచ్చని విషయాలేంటో చూసేద్దాం.

అలా చేస్తే..

అలా చేస్తే..

సాధారణంగా ఆడవారికి షాపింగ్ చేయడం అంటే మహా ఇష్టం. అయితే వారితో కలిసి షాపింగుకు వెళ్లినప్పుడు వారు ఒక్క చీర సెలెక్ట్ చేయడానికి గంటల కొద్దీ సమయం తీసుకుంటారు. మనం ఎంత నచ్చ.జెప్పినా ఏదో ఒక లోపం చూపించి దాన్ని రిజెక్ట్ చేస్తుంటారు. అయితే పురుషులు మాత్రం ఏదైనా షాపింగ్ చేయాలంటే కేవలం నిమిషాల్లో పని పూర్తి చేస్తారు. క్షణాల్లో సెలెక్ట్ చేసేస్తుంటారు. ఇలా చేస్తే అమ్మాయిలకు అస్సలు నచ్చదట.

క్లీన్ గా ఉండటం..

క్లీన్ గా ఉండటం..

సాధారణంగా పురుషుల్లో కొంత మందికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా క్లీన్ గా ఉండటంపై పెద్దగా ఫోకస్ పెట్టరు. ముఖ్యంగా పెళ్లయిన పురుషులు మరీ లేజీగా ఉంటారు. ఇలా ఉంటే మహిళలకు చాలా కోపం వస్తుందట. అలాగే కష్టపడి పని చేసే వారిని, ఇంటిని శుభ్రంగా ఉంచే స్త్రీలను అప్పుడప్పుడు పొగడటం వంటివి చేయాలట. అలా చేయకుండా ఉంటే వారికి కోపం నశాలానికి అంటుతుందట. ఇంకొందరు మగాళ్లు తాము తుడుచుకున్న టవాళ్లను, వదిలేసిన బట్టల్ని, సాక్సులు, తాగిన నీళ్లు ఇంట్లో శుభ్రం చేసిన ప్రదేశంలో పడేస్తే కూడా ఆడవారికి అస్సలు నచ్చదట.

Viral Story:తనతో పెళ్లి కావాలంటే.. ఈ షాకింగ్ రూల్స్ కు ఓకే చెప్పాలన్న కుర్రాడెవరో తెలుసా...

వారి మాటలను పట్టించుకోకపోతే..

వారి మాటలను పట్టించుకోకపోతే..

సాధారణంగా చాలా మంది పురుషుల్లో ఇలాంటి అలవాటు ఉంటుంది. ఎవరైతే పెళ్లి చేసుకుని ఉంటారో.. అలాంటి వారు తమ భాగస్వామి చెప్పే మాటలను పెద్దగా పట్టించుకోరట. ఖాళీ సమయం దొరికితే చాలు స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి చూడటం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలో అమ్మాయిలు మగాళ్లతో సరదాగా గడపాలని ఆలోచిస్తారట. అలాగే ఎన్నెన్నో కబుర్లు మీతో చెప్పుకోవాలని ఆశిస్తారట. అయితే మీరు అలాంటి విషయాలను పట్టించుకోకపోతే వారికి పిచ్చి కోపం వచ్చేస్తుందట.

హెల్త్ కండీషన్స్..

హెల్త్ కండీషన్స్..

సాధారణంగా పెళ్లైన కొత్తలో కొందరు మహిళలకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాంటి సమయంలో మీరు అలాంటి విషయాలను లైట్ గా తీసుకుంటే.. వారికి మీపై అసహ్యం వేస్తుందట. అదే మీరు వారి ఆరోగ్యం గురించి కొంచెం కేర్ చూపిస్తే చాలు.. ఆయన్ను తన మనసులో పెట్టుకుని ఆరాధిస్తారట. పైకి మాత్రం అదేమీ లేదన్నట్టు నటిస్తారట.

స్నేహితుల విషయంలో..

స్నేహితుల విషయంలో..

సాధారణంగా పురుషులకు ఫ్రెండ్స్ విషయంలో ఎలాంటి షరతులు ఉండవు. ఎలాంటి హద్దులు, పరిమితులు ఉండవు. సామాన్యుడి నుండి సెలబ్రిటీల దాకా అందరితోనూ స్నేహం చేసేస్తారు. అయితే ఇలాంటి విషయాలు ఆడవారికి అస్సలు నచ్చవట. మీరు ఎవరితో పడితే వారితో ఫ్రెండ్ షిప్ చేస్తే.. వారు తట్టుకోలేరట. వారి నుండి మీరు చెడిపోతున్నారని భావిస్తారట. ఇక పెళ్లైన తర్వాత ఇవి మరింతగా పెరుగుతాయట.

ఎక్కువగా నిద్రిస్తే..

ఎక్కువగా నిద్రిస్తే..

ఎవరైతే మగవారు ఎక్కువగా నిద్రపోతారో.. అలాంటి వారిని ఆడవాళ్లు అస్సలు ఇష్టపడరట. ఎందుకంటే తమ భాగస్వామితో ఏవైనా విషయాలను ఆనందంగా షేర్ చేసుకునే సమయంలో వారు సడన్ గా నిద్రలోకి జారుకుంటే.. వారికి చాలా కోపం వస్తుందట. ముఖ్యంగా ఆ కార్యం తర్వాత చాలా మంది నిద్రమత్తులోకి వెళ్లిపోతారు. అయితే అలా చేయకుండా తమ పార్ట్నర్ తో కొన్ని కబుర్లు చెబితే వారు మగాళ్లను తమ మనసులో పెట్టుకుని పూజిస్తారట. కానీ భార్య గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఓ పక్కకు తిరిగి పడుకునే వారంటే ఆడవారికి తెగ చిరాకు వస్తుందట.

చూశారు కదా.. మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీ పార్ట్నర్ తో ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా గడపండి.

English summary

Men's Habits That Are Turn Offs For Women

Here are the men's habits that are turn offs for women. Take a look
Story first published: Wednesday, September 22, 2021, 17:04 [IST]