Latest Updates
-
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ కలవాల్సిన అవకాశం వస్తే... ఆ బంధం బలంగా ఉంటుందా?
ఏదో ఒక సందర్భంలో అపార్థం చేసుకునే అవకాశాలు రావచ్చు. అయితే అలా గొడవ పడి విడిపోయిన వారితో మరోసారి ప్రేమ తలుపు తెరిచి స్వాగతం పలికితే ఎలా ఉంటుంది?
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ముగిసింది... ఈరోజున ఎన్నో కొత్త జంటలకు ప్రేమ అనేది కొత్త తలుపులు తీసి ఆహ్వానించి ఉంటుంది. ఈ అనుభూతిని ఎంతో మంది అనుభవించి ఆనందంగా ఫీలయ్యింటారు. అయితే ప్రస్తుత జనరేషన్ లో మాత్రం ప్రేమలో చాలా సులభంగా పడుతున్నారు.

కానీ చిన్న చిన్న గొడవలకు మనస్పర్దలు పెంచుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో గొడవ పడి విడిపోవడం కూడా మనం చూసే ఉంటాం. అయితే అలాంటి ఇంకా ఎప్పటికీ కలవరని అనుకోకూడదు. అలాంటి వారే తిరిగి మళ్లీ ప్రేమలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఎంతటి గాఢమైన రిలేషన్ షిప్ అయినా.. ఏదో ఒక సందర్భంలో అపార్థం చేసుకునే అవకాశాలు రావచ్చు. అయితే అలా గొడవ పడి విడిపోయిన వారితో మరోసారి ప్రేమ తలుపు తెరిచి స్వాగతం పలికితే ఎలా ఉంటుంది? ఒక్కసారి బ్రేకప్ అయ్యాక.. మరోసారి తిరిగి అదే వ్యక్తితో ప్రేమలో పడిన కథల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం... ప్రేమ వంటి అద్భుతమైన మాయలో ఎలాంటి మాయాజాలం ఉందో తెలుసుకుందాం...

ప్రేమకు మరో అవకాశం..
ఎందరో జంటల్లాగా గొడవ పడి విడిపోకుండా... మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఒకరినొకరు గౌరవంగా తప్పుకున్నాం. ఈ కోవలో సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అయితే అదే ఫ్రెండ్ షిప్ తో వారు అప్పుడప్పుడు టచ్ లో కూడా ఉంటున్నారు.

అంతా మాయే...
మాయ అంతా మాయ... పుట్టుక అనేది ఒక మాయ.. మరణం అనేది కూడా ఒక మాయ.. ఈ రెండింటి నడుమ జరిగే కథ కూడా మాయే.. అయితే ఈ అద్భుతమైన మాయలో ప్రేమ అనే మాయ చాలా కీలకమైంది.

విడిపోయిన వారు కనిపిస్తే...
తమ బ్రేకప్ గురించి ఓ యువకుడు ఇలా చెప్పాడు. మేము విడిపోయిన రెండేళ్లకు నాకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తనతో జీవితాన్ని ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నాను. అయితే ఆమె జీవితంలోకి మరో అబ్బాయి వచ్చాడు. అయినా మేం ఇద్దరం కలవాలని అనుకున్నాం.

మా ఇంట్లోనే ఉండమన్నా..
అయితే స్నేహపూర్వకంగానే ఉంటుందని అనిపించింది. అందుకే వెళ్లాను. కానీ ఆమెతో కలిసి మాట్లాడగానే నా మనసు మారిపోయింది. తను ఇదివరకటిలా లేదు అనిపించింది. ఎన్నో విషయాలను కలిసి చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం. అయితే తను ఇక్కడికి ఓ పని మీద వచ్చానని.. హోటల్ లో దిగాలని చెప్పారు. కానీ నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా ఇంట్లోనే ఉండమని చెప్పేశాను.

గతంలో విషయాలన్నీ..
తను మా ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి గతంలో మా మధ్య జరిగిన విషయాలన్నీ గుర్తుకు వచ్చేవి. మేం మొదటిసారిగా హైదరాబాద్ లో కలిసిన రోజు... తను నన్ను వాళ్ల అమ్మకు పరిచయం చేసిన రోజు.. ఇద్దరం కలిసి ఒకే హోటల్ లో కలిసి తిన్న రోజులన్నీ గుర్తుకు వచ్చాయి.

మా బంధం గురించి..
తను బయటకు వెళ్లడానికి ముందు రోజు రాత్రి భోజనం చేసే సమయానికి కలిశాక.. మళ్లీ ఎన్నో విషయాలను పంచుకున్నాం.. మరోసారి మా బంధం గురించి ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అదే విషయం తనని అడిగాను. తను కూడా ఆ విషయమే ఆలోచిస్తున్నాను అని చెప్పారు.

మళ్లీ కలవాలని...
అయితే మేము ఇప్పుడు మళ్లీ మా బంధాన్ని కొనసాగించాలంటే మునుపటి కన్నా ఇప్పుడు మేము ఇంకా ఎక్కువ కష్టపడాలని మాకు తెలుసు. అందుకు మేము ఇద్దరం సిద్ధంగా ఉన్నాం. అందుకే మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ సంఘటన జరిగి రెండేళ్లు అయ్యింది. అయినా మా బంధం మళ్లీ సాఫీగా సాగిపోతుందని ఆశిస్తున్నాం. కాబట్టి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.



Click it and Unblock the Notifications