For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘అప్పుడు నాతో.. ఇప్పుడు తనతో.. ఎంజాయ్ చేస్తున్నాడు... కానీ ’..

|

మనం ఎవరితో అయినా ప్రేమిస్తే.. చచ్చేంత వరకు వారితోనే ఉండాలని కోరుకుంటాం. అయితే అలాంటి బంధం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే నమ్మకమనే బలమైన పునాది అవసరం.

ఏ ఇద్దరు వ్యక్తులు కలసి ఒక్కటిగా జీవించాలన్నా.. ఆనందంగా తమ లైఫ్ గడపాలన్నా నమ్మకమే అనే ఇంధనంగా పనిచేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పార్ట్ నర్ తో పొరపచ్చాలు వస్తుంటాయి. వాటిని అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.

అపార్థం చేసుకుంటేనే అన్నీ సమస్యలు స్టార్టవుతాయి. అలా ఓ అమ్మాయి తన ప్రియుడిని అపార్థం చేసుకుని తనని వదిలేసింది. అయితే తను మాత్రం తన మరో బెస్ట్ ఫ్రెండ్ తో డేటింగ్ మొదలెట్టేశాడట.

ఇది తెలిసిన తాను మోసపోయానని, తన బెస్ట్ ఫ్రెండ్ కూడా మోసపోతుందని చాలా బాధపడుతోంది. అప్పుడు నాతో రిలేషన్ కొనసాగించి.. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ తో డేటింగ్ ఎలా చేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అని ఓ యువతి అడుగుతోంది. ఈ ఆసక్తికరమైన విషయాలేంటో పూర్తిగా తెలుసుకుందాం రండి...

'లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు.. తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకోవాలంట...'

స్కూల్ టైమ్ నుండే..

స్కూల్ టైమ్ నుండే..

‘నా పేరు వాణి(పేరు మార్చాం). నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను, నా క్లాస్ మేట్ తో స్కూల్ టైమ్ నుండే రిలేషన్ షిప్ మెయింటెన్ చేసేదాన్ని. అయితే రెండేళ్ల కిందటే తనతో నాకు కొన్ని మనస్పర్దలు వచ్చి.. బ్రేకప్ చెప్పేశాను. అయితే మేమిద్దరం ఇప్పుడు ఫైనల్ ఇయర్ కు వచ్చేశాం. మేమిద్దరం ఒకే బ్రాంచ్ లో ఉండటంతో రెగ్యులర్ గా చూసుకుంటూ ఉంటాం.

నా బెస్ట్ ఫ్రెండ్ తో..

నా బెస్ట్ ఫ్రెండ్ తో..

అయితే తను ఇటీవల ఓ పెద్ద షాకింగ్ మ్యాటర్ చెప్పాడు. నా బెస్ట్ ఫ్రెండ్ తో డేటింగ్ స్టార్ట్ చేసినట్లు చెప్పాడు. అనుకోకుండా తనతో లవ్ లో పడిపోయాయని చెప్పాడు. దీంతో తను నన్ను మోసం చేశాడని అనిపిస్తోంది. పైగా నా బెస్ట్ ఫ్రెండ్ తోనూ అదే పని చేస్తున్నాడు. ఒకప్పుడు నేను తనతో రిలేషన్ పెట్టుకుంటే.. ఇప్పుడు తనతో ఎలా డేటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి' అని ఓ యువతి తన సమస్యను నిపుణులకు వివరించింది.

అలా చేయడాన్ని..

అలా చేయడాన్ని..

రెండేళ్ల క్రితం తనతో విడిపోయారని మీరే చెబుతున్నారు. అయితే ఇప్పుడు తను మీ బెస్ట్ ఫ్రెండ్ తో అలా చేయడాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వారిద్దరూ మీకు కావాల్సిన వాళ్లే. అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఆ రిలేషన్ లో ఉంటే మీకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. దీని వల్ల ఫ్యూచర్లో మీ ఫ్రెండ్ షిప్ లో ఏవైనా సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.

Zodiac signs: రాశిచక్రాన్ని బట్టి తమ లైఫ్ లో ఇలాంటి భాగస్వామి కావాలని కోరుకుంటారట...!

అర్థం చేసుకునేందుకు..

అర్థం చేసుకునేందుకు..

మీ స్నేహం మధ్యలో ఇలాంటి విషయాల వల్ల గొడవలు జరగొచ్చని ఆందోళన ఉండటం సహజమే. దీంతో మీకు తెలియకుండా కోపం, ఆవేశం వస్తుంటాయని అర్థమవుతోంది. అయితే మీరు ఒక ఫ్రెండ్ గా దీన్ని పాజిటివ్ గా స్వీకరించాలి.

పాస్ట్ ఈజ్ పాస్ట్..

పాస్ట్ ఈజ్ పాస్ట్..

ఎందుకంటే గడిచిపోయిన కాలాన్ని మనం ఎప్పుడూ వెనక్కు తీసుకురాలేం. అప్పుడు ఏదో జరిగిపోయింది. ఇప్పుడు తను లవ్ చేసే వ్యక్తి మీ బెస్ట్ ఫ్రెండే. కాబట్టి మీరు మీ మనసులో మాట తనకి ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. దీని వల్ల మీ మనసు కొంతవరకు తేలికపడొచ్చు.

వారి ప్రేమను అంగీకరించాలి..

వారి ప్రేమను అంగీకరించాలి..

అయితే మీకు కష్టమైన పని ఏంటంటే.. ఇప్పుడు వారి ప్రేమను మీరు అంగీకరించాల్సిందే. ముందుగా దీని గురించి పదే పదే ఆలోచించడం కూడా మానేయాలి. ముందు ముఖ్యమైన పనులపై మీరు శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి.

English summary

My Boyfriend Cheated on Me With My Best Friend. Should I Forgive Them?

Here we are talking about the my boyfriend cheated on me with my best friend. should i gorgive them? Read on