Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
‘నా బావ.. తనతో అలా చెబుతోంటే.. అసహ్యంగా అనిపిస్తోంది...’
మా మామయ్య ఫ్యామిలీ విషయాలన్నీ వారితో షేర్ చేసుకుంటున్నారు. దాన్ని ఎలా ఆపాలి.
ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో చూపించిన సీన్లు ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అపార్ట్ మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయి.. చాలా మంది పని మనిషులపై ఆధారపడుతున్నారు.

అయితే కొందరు యజమానులు పని మనుషులతో ఏయే వ్యవహారాలు నడుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో తన బావ పనిమనిషితో తమ పర్సనల్ విషయాలన్నింటినీ, తమ పనిమనిషితో షేర్ చేసుకుంటున్నాడట.

అలా ఒకటి కాదు.. రెండుసార్లు చాలాసార్లు ఆమె చెవిన పడ్డాయట. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైందట. ఇది తనకు చాలా అసహ్యంగా అనిపిస్తోందని.. ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని నిపుణులను సంప్రదించింది.

ఈ నేపథ్యంలో ఆ మహిళ సమస్య సాల్వ్ అయిందా? ఆమె సమస్యను నిపుణులు పరిష్కరించరా? తనకు, తన బావకు మధ్య పనిమనిషి ఇంటర్ ఫియర్ తగ్గిందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అందరితో ఆప్యాయంగా..
‘నా బావకు అందరితో కలివిడిగా ఉండటం చిన్నప్పటి నుండే అలవాటు.. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడటం.. జోకులేయడం వంటివి చేస్తూ ఉండేవాడు. ఇందులో ఎలాంటి తప్పు లేదు.

పర్సనల్ విషయాలను..
అయితే తమ మధ్య జరిగే కొన్ని పర్సనల్ విషయాలను పనిమనిషితో కూడా షేర్ చేసుకుంటున్నాడు. అందులోనూ మా ఇద్దరి మధ్య జరిగిన సున్నితమైన విషయాలను.. చిన్న చిన్న గొడవలను కూడా ఆమెకు చెబుతున్నాడు.

నాకు నచ్చడం లేదు..
ఇలాంటి విషయాలను షేర్ చేసుకోవడాన్ని నేను కళ్లారా చూశాను. ఇది చూసి నేను తట్టుకోలేకపోయాను. అయితే తను ఈ విషయాలన్నంటినీ ఇప్పుడే కాదు.. చాలా రోజుల నుండి షేర్ చేసుకుంటున్నాడని తెలిసింది. ఇలా చేయడం నాకు ఏ మాత్రం నచ్చలేదు.

అసహ్యంగా ఉంటుంది..
మా ఇంట్లో నాకు ఎంత జీతం వస్తుంది.. తనకు ఎంత జీతం వస్తుంది.. తాము ఇంతవరకు ఎన్నిసార్లు తగాదా పడ్డాం.. తమ కుటుంబంలోని ఆస్తి తగాదాలు ఇలా అన్నింటినీ చెప్పేస్తున్నాడు. తను ఆ విషయాలన్నీ ఇతరులతో షేర్ చేసుకుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది.

కోపం వస్తోంది..
అది విన్న వారు తమ గురించి ఏమనుకుంటారు.. తమను చిన్నచూపు చూస్తారేమో అనే భయమేస్తోంది.. కాబట్టి తను పనిమనిషితో అలాంటి విషయాలను షేర్ చేసుకోకుండా ఉండటానికి నేను ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వగలరు' అని ఓ మహిళ తన గోడు వెల్లబోసుకుంది.

అత్తా-కోడలి మధ్య..
సాధారణంగా మన దేశంలో ఏ కుటుంబంలో అయినా అత్తా-కోడలి మధ్య గొడవలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరికి వారు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తమ కుటుంబ విషయాలను పనిమనిషితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం సీన్ కొంత రివర్స్ గా కనిపిస్తోంది.

కొన్ని సమస్యలే..
అయితే మీ బావ ఇలాంటి విషయాలన్నింటినీ మీ పనిమనిషితో షేర్ చేసుకుంటున్నాడంటే.. మీ కుటుంబ వాతావరణంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు అర్థమవుతోంది. ఇలాంటి సమయంలో మీరు కోపం లేదా నిరుత్సాహం వంటివి వ్యక్తం చేయకూడదు.

సమస్య పెద్దదిగా..
ఇలాంటి సమయంలో మీరు అలా చేస్తే మీ సమస్య మరింత పెద్దగా మారే అవకాశం ఉంది. కాబట్టి తను మిమ్మల్ని.. మీరు తనని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందు మీ ఇద్దరి మధ్య సరైన సంభాషణ సాగేలా ప్రయత్నించండి.

మీ బావతో మాట్లాడండి..
మీకు ఎలాంటి విషయాలు ఇబ్బందిగా అనిపిస్తున్నాయో.. మీకు అసహ్యంగా అనిపించే వాటి గురించి మీ బావతో మంచి టైమ్ చూసుకుని మాట్లాడండి. మీ ప్రాబ్లమ్ ను తెలియజేయండి. దాని వల్ల ఎలాంటి ప్రభావాలుంటాయో సున్నితంగా వివరించండి.

ఇతరులకు చెబితే..
మీ మధ్య జరిగే విషయాలు.. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ను ఇతరులతో పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడొచ్చనే విషయాలను మీరు తనకు నెమ్మదిగా చెప్పేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం తనతో ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications