For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భార్య, స్నేహితుడు చాటుగా కలుస్తున్నారు... వారిని ఎలా ఆపాలి.. దాని కోసం ఏం చేయాలి...!

|

ఆలుమగల మధ్య అన్యోన్యత ఉంటేనే ఆ కాపురం పది కాలాల పాటు.. ఎలాంటి కలహాలు లేకుండా చక్కగా సాగుతుంది.. వారి దాంపత్య జీవితం అందంగా.. ఆనందంగా ఉంటుంది.

అయితే భార్యభర్తల మధ్య ఎప్పుడైతే రతి క్రీడలో గ్యాప్ పెరుగుతుందో అప్పటి నుండి చాలా సమస్యలు పెరుగుతాయి. ఇద్దరిలో ఎవరు చిన్న తప్పు చేసినా.. భూతద్దంలో పెట్టి చూడటం.. చీటికి మాటికి గొడవ పడటం చాలా కామనై పోతుంది..

అయితే అలా జరగకుండా ఆ గ్యాప్ ను వీలైనంత త్వరగా తగ్గించే ప్రయత్నం చేయాలి. అంతేకానీ మరో విధంగా ప్రయత్నం చేయకూడదు. అయితే వారిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు గానీ.. అన్యోన్య దంపతులుగా ఉన్న వారి మధ్యలో ఓ స్నేహితుడు వచ్చాడు.. అంతేకాదు తను తన కంటే ఎక్కువగా తనతో చాలా క్లోజ్ మూవ్ అవుతున్నాడు.

అయితే అతనికి కూడా పెళ్లి అయ్యింది. తన వివాహానికి సంబంధించి కొన్ని వ్యక్తిగత విషయాలను చెప్పి తన భార్యతో సలహాలు తీసుకుంటున్నాడు. దీనిపై తను అతిగా స్పందించాలని అనుకోలేదు. కానీ వారు అలా మాట్లాడుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నట్లు.. వాళ్లు అలా చేయకుండా ఉంటేనే తనకు ప్రశాంతంగా ఉంటుందని.. వాళ్లు అలా చేయడాన్ని ఎలా ఆపాలో తెలపగలరని ఓ యువకుడు నిపుణులను సలహా అడిగారు.. అందుకు వారు ఏమి సమాధానం ఇచ్చారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అలా కలిశాడు.. పెళ్లై.. పిల్లలూ ఉన్నారన్నాడు.. కానీ నన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు...!అలా కలిశాడు.. పెళ్లై.. పిల్లలూ ఉన్నారన్నాడు.. కానీ నన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు...!

నా భార్యతో చాటుగా..

నా భార్యతో చాటుగా..

సమస్య : ‘నా భార్య నా ఫ్రెండ్స్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ ను తన ఫ్రెండ్స్ మాదిరిగానే ఫీలవుతుంది. అయితే ఇటీవలే నాకు ఓ మ్యాటర్ తెలిసింది. నా ఫ్రెండ్స్ లో ఒకరు నా పార్ట్ నర్ తో కాస్త చనువు ఎక్కువ తీసుకుంటున్నాడని.. నా భార్యతో ఎప్పుడూ చాటుగా మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది.

నా భార్యతోనే సలహాలు..

నా భార్యతోనే సలహాలు..

అంతేకాదు తనకు కూడా ఇప్పటికే పెళ్లి జరిగింది. తన వివాహానికి సంబంధించి కూడా కొన్ని వ్యక్తిగత విషయాలను నా భార్యతో చెప్పి సలహాలు తీసుకుంటున్నాడని తెలిసింది. అయితే దీని గురించి నేను చర్చించాలని అనుకోవడం లేదు. అయితే వారిద్దరూ అలా మాట్లాడుకోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది.

వాళ్లనెలా ఆపాలి?

వాళ్లనెలా ఆపాలి?

వారిద్దరూ కలిసి అలా మాట్లాడుకోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వెంటనే వారిద్దరూ మాటల్ని బంద్ చేయాలంటే నేనేం చేయాలి. వారిద్దరూ చాటుగా మాట్లాడుకోవడాన్ని ఎలా ఆపాలో తెలుపగలరు.

శోభనం గదిలో గులాబీలుంటే... మగవారు రతి క్రీడలో రెచ్చిపోతారంట...!శోభనం గదిలో గులాబీలుంటే... మగవారు రతి క్రీడలో రెచ్చిపోతారంట...!

మీ భార్యకే ఎక్కువ ప్రాధాన్యత..

మీ భార్యకే ఎక్కువ ప్రాధాన్యత..

మీ ఫ్రెండ్ మీ కంటే మీ పార్ట్ నర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మీకు నచ్చడం లేదు. అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా మీ భార్యతో పంచుకోవడం మీకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా మీకే కాదు.. మీ ప్లేసులో ఎవరున్నా అలాగే అనిపిస్తుంది.

అందుకే చాటుగా చెబుతున్నాడేమో..!

అందుకే చాటుగా చెబుతున్నాడేమో..!

మీరు మీ స్నేహితుడి కోణంలో థింక్ చేయండి. అతను తన వ్యక్తిగత విషయాలను ఇతరులతో చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీలవుతున్నాడేమో.. అందుకే తను మిమ్మల్ని, మీ భార్యను మంచి స్నేహితులుగా భావించి ఇలా తన సమస్యలను చెబుతున్నాడేమో. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మీ భార్యతో మాట్లాడండి..

మీ భార్యతో మాట్లాడండి..

ఈ విషయాన్ని మీలో మీరే తలచుకుని.. మీ మనసులో బాధపడాల్సిన అవసరం లేదు. మీ భార్యతో ఈ విషయం గురించి మంచి సమయం చూసుకుని మాట్లాడండి. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. దీని వల్ల ఆమె కూడా మీ ఇబ్బందిని అర్థం చేసుకోవడమే కాదు.. మీకు నచ్చేలా మారొచ్చు కూడా.

మీ ప్రియుడితో శృంగారానికి ముందు ఈ విషయాలను అస్సలు మరువకండి...!మీ ప్రియుడితో శృంగారానికి ముందు ఈ విషయాలను అస్సలు మరువకండి...!

మీకు కూడా తెలిసేలా..

మీకు కూడా తెలిసేలా..

ఆమె మీ అభద్రతను దూరం చేయాలంటే.. వారి మధ్య జరుగుతున్న ముచ్చట్లను మీకు కూడా తెలిసేలా ఉండాలని చెప్పండి. ఒక వేళ మీ ఫ్రెండ్ లో ఏదైనా చెడు ఆలోచనలు ఉంటే.. ఉద్దేశ్యపూర్వకంగా ముచ్చట్లు పెడుతుంటే.. ఆ విషయాన్ని మీ భార్యకు తెలియజేయండి.

మీకు సహకారం రావొచ్చు..

మీకు సహకారం రావొచ్చు..

మీరు చెప్పిన విషయాలను అర్థం చేసుకున్న మీ భార్య.. మీకు సహకరించడం ప్రారంభించవచ్చు. అప్పటి నుండి తనతో ఎంతలో ఉండాలో అంతే హద్దులో ఉండం ప్రారంభించొచ్చు. అప్పుడు మీరు కూడా హాయిగా నిద్రపోవచ్చు.

English summary

My friend confides in my wife! Is this normal behaviour?

Here we talking about my friend confides in my wife! is this normal behaviour? Read on
Story first published: Tuesday, October 13, 2020, 15:18 [IST]