For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా భార్య పెళ్లికి ముందే తన బాయ్ ఫ్రెండ్స్ తో బాగా క్లోజ్ గా ఉండేదట.. కానీ పెళ్లి తర్వాత’

|

'నాకు పెళ్లి ఫిక్స్ అయిన కొద్ది రోజులకే.. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. మా చుట్టాలంతా నాకు మంచి జోడి దొరికింది.. నేను చాలా లక్కీ అని అంటూ ఉండేవారు.

నా పెళ్లైన కొత్తలో అంతా తన అందం గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు. ఇది విను నేను చాలా పొంగిపోయేవాడిని. అంత అందమైన ఆమె నాకు భార్యగా రావడం నాకు నిజంగా లక్కీగా అనిపించేది.

తనని చూసి నేను చాలా మురిసిపోయేవాడిని. తనని బైక్ పై ఎక్కించుకుని బయటకు వెళ్తుంటే.. అందరూ సినిమా హీరోయిన్ ని తీసుకుని బైక్ పై తీసుకెళ్తున్నావు అంటుంటే నేను నేల మీద ఉండకుండా.. ఆకాశంలో విహరించినంత హాయిగా అనిపించేది.

తను కూడా నాతో ఎన్ని సన్నిహితంగా ఉండేది. మేమిద్దరం కొన్ని నిక్ నేమ్స్ తో కూడా పిలుచుకునేవాళ్లం. మాకు పెళ్లైన రెండు మూడేళ్ల వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా గడిపేవాళ్లం.

'నా ప్రియురాలు ఎక్కువగా అవే చూస్తోంది.. కోరికలను కంట్రోల్ చేసుకోవడానికేనా...''నా ప్రియురాలు ఎక్కువగా అవే చూస్తోంది.. కోరికలను కంట్రోల్ చేసుకోవడానికేనా...'

జలసీగా ఫీలయ్యేవారు..

జలసీగా ఫీలయ్యేవారు..

నాకు ఏమి కావాలన్న కాదు.. లేదనకుండా చేసి పెట్టేది.. క్షణాలలో అన్ని తయారు చేసేది. అందరూ మా జంటను చూసి జలసీగా ఫీలయ్యేవారు. ఎందుకంటే మా ఇద్దరి ఈడు, జోడు అంతలా కుదిరింది మరి. అయితే తను ఏమయిందో ఏమో తెలియదు కానీ.. తనలో అకస్మాత్తుగా చాలా మార్పు వచ్చింది.

తనే సర్వస్వంగా..

తనే సర్వస్వంగా..

పెళ్లి చేసుకున్న నాటి నుండి నేను తనే సర్వస్వంగా భావించాను. పెళ్లికి ముందు నేను ఏ ఒక్కరితోనూ సంబంధం అనేదే పెట్టుకోలేదు. నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేరు. కానీ తను మాత్రం పెళ్లికి ముందే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో అలాంటి సంబంధం కొనసాగించిందని తెలుసుకున్నాను.

నిద్రలేని రాత్రులు..

నిద్రలేని రాత్రులు..

ఈ విషయం నాకు తెలియడంతో.. తనపై ఉన్న ప్రేమంతా తగ్గిపోయినట్టు అనిపించింది. అప్పటి నుండి తను కూడా నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో అప్పటి నుండి చాలా రోజులు నేను నిద్ర లేని రాత్రులు గడిపాను. ఆ పరిస్థితిలో నేను ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఏమి చేయాలి. నేను విడాకులు తీసుకోవాల్సిందేనా?' అని ఓ పెళ్లైన వ్యక్తి తన గోడు నిపుణుల వద్ద వెలిబుచ్చాడు.

‘పెళ్లికి ముందే ఆ తప్పు చేసిందట.. కానీ ఇప్పుడు కూడా...'‘పెళ్లికి ముందే ఆ తప్పు చేసిందట.. కానీ ఇప్పుడు కూడా...'

గతాన్ని మార్చలేం..

గతాన్ని మార్చలేం..

ఇందుకు స్పందించిన నిపుణులు తన ప్రశ్నకు సమాధానం ఈ విధంగా ఇచ్చారు. మనం ఎంత ప్రయత్నించినా గతాన్ని మార్చడం అనేది అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే మనం గతాన్ని కొంచెం కూడా మార్చలేం.

అవి డిసైడ్ చేయలేం..

అవి డిసైడ్ చేయలేం..

ఎవరో చెప్పిన మాటలను నమ్మి మీరు మీ సంబంధాల విషయంలో అనుమానాలు పెంచుకోవడం సరికాదు. ప్రయోగాలు చేయడం అంతకన్నా మంచిది కాదు. ఇతరుల మాటల ఆధారంగా మీరు అన్నీ డిసైడ్ చేయలేరు.

అవగాహన లేనప్పుడే..

అవగాహన లేనప్పుడే..

ఎవరో చెప్పిన మాటలను విని ఒక వ్యక్తి గురించి మనం ఎలాంటి విషయాన్నైనా నిర్వచించకూడదు. ముఖ్యంగా రిలేషన్ లో ఉన్నప్పుడు విభేదాలు రావడం అనేది సహజం. మీ ఇద్దరి మధ్య కొన్ని విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయి.

బంధువులే ఏమైనా..

బంధువులే ఏమైనా..

మీరే అంటున్నారు.. మీ జంటను చూసి బంధువులు.. ఇరుగుపొరుగు వారు చాలా అసూయపడుతున్నారని, కాబట్టి వారే అసత్య ప్రచారాలు, పుకార్లు పుట్టించారమో అని విషయాన్ని మీరు కచ్చితంగా నిర్ధారించుకోవాలి.

ఈ రాశుల వారు గట్టిగా కౌగిలించుకుంటారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!ఈ రాశుల వారు గట్టిగా కౌగిలించుకుంటారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

ఇప్పుడే ఎందుకొచ్చింది..

ఇప్పుడే ఎందుకొచ్చింది..

పెళ్లికి ముందు మీకు ఎవరితోనూ సంబంధం లేదన్నారు. మీకు కనీసం గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరన్నారు. అయితే మీ భార్య మాత్రం పెళ్లికి ముందు మాత్రం చురుకైన లైంగిక జీవితం కలిగి ఉందని మీకు ఇటీవలే తెలిసిందంటున్నారు. అయితే వివాహ సమయంలో మీకు ఆ విషయం తెలియదా.. మీరు ఏ విషయం కనుక్కోకుండా గుడ్డిగా పెళ్లి చేసుకున్నారా?

ఓపెన్ మైండెడ్..

ఓపెన్ మైండెడ్..

అప్పుడు తను చాలా అందంగా.. ఓపెన్ మైండెడ్ గా ఉండటంతో మీరే మీ బంధువులను, కుటుంబసభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు కదా.. అప్పుడు తను చాలా గొప్పదని మీరే చెప్పారు. అంతలోనే ఆమె చెడ్డగా ఎలా మారిపోయిందనేది మీరే ఆలోచించుకోవాలి.

మీ చుట్టూ ఉండేవారు..

మీ చుట్టూ ఉండేవారు..

మీ జంటను చూసి అందరూ అసూయపడుతున్నారంటే.. మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. అందుకే మీరంటే గిట్టనివారే ఇలాంటి లేనిపోని చాడీలు చెప్పి ఉండొచ్చు.

మీ భార్యనే అడగండి..

మీ భార్యనే అడగండి..

మీకు ఇప్పటికీ ఆమెపై ఏదైనా అనుమానం ఉంటే.. నేరుగా మీరేమీ మనసులో పెట్టుకోకుండా నేరుగా మీ భార్యనే అడగండి. మీ సందేహాలకు సమాధానం రాబట్టండి. నేను విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నానని, నీ గురించి ఇలా తెలిసిందని చెప్పండి.

మోసం చేయడం లేదు..

మోసం చేయడం లేదు..

నేను నిన్ను మోసం చేయడం లేదు. మనం సంబంధం నుండి మాత్రమే విడిపోదామని చెప్పండి. అప్పుడు తన రియాక్షన్ ఏంటో చూడండి. అప్పటికీ మీకు అసౌకర్యంగా అనిపిస్తే, మీరు మీ భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకోండి. ఎందుకంటే మార్చలేని గతం గురించి ఆలోచిస్తే టైం వేస్ట్ తప్ప ఎలాంటి ఫలితం ఉండదు.

English summary

My wife had many boyfriends before marriage

Here we talking about my wife had many boyfriends before marriage. Read on.