For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మ్యారేజ్ లైఫ్ లో సోషల్ మీడియా వల్ల వచ్చే నష్టాలేంటో తెలుసా...

|

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మనందరి దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్ర పోయేంత వరకూ ఏదో ఒక సందర్భంలో మనం సోషల్ మీడియాతో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తున్నాం.

కొందరైతే సోషల్ మీడియాలోనే 24 గంటలు గడిపేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియానే తమ సోల్ మేట్ అని చెప్పేస్తున్నారు. అయితే ఇది మన సంబంధాలను శాసించే స్థాయికి వెళ్లిందని పలు అధ్యయనాలలో తేలింది.

అంతేకాదు.. దీని వల్ల వివాహం మరియు బంధాలలో చాలా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందట. దీని దెబ్బకు కొందరు తమ వివాహ జీవితం నుండి విడిపోయి విడాకులు కూడా తీసుకున్నారు.

ఈ సందర్భంగా వివాహం చేసుకున్న జంటలు మరియు రిలేషన్ షిప్ లో ఉన్న వారిపై సోషల్ మీడియా వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'నా భర్తంటే ఇష్టమే.. కానీ క్షణికావేశంలో అలా చేసేశా... చివరికి ఏం జరిగిందంటే...'

అమ్మాయిలపైనే ఎక్కువ..

అమ్మాయిలపైనే ఎక్కువ..

సోషల్ మీడియా వల్ల మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా అందరిపైనా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలే దీని వల్ల ఎక్కువ నష్టపోయారని ఓ సర్వేలో తేలింది.

టైమ్ ఇవ్వట్లేదు..

టైమ్ ఇవ్వట్లేదు..

ఒకప్పుడు చాలా మంది టివిలలో వచ్చే సీరియళ్లు, ఇష్టమైన షోలను చూసేవాళ్లు. వాటి గురించి మాట్లాడుకోవడం లేదా అందులో కామెడీని చూస్తూ కలిసి నవ్వుకునేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది. చాలా మంది ఇప్పుడు ఇన్ స్టా లేదా ఎఫ్ బి ఇతర సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికరంగా స్క్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఫోన్లలోనే గంటలకొద్దీ సమయాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వాటి తమ పార్ట్ నర్ తో కలిగే ఆనందాన్ని మిస్సవుతున్నారు.

ఆత్మగౌరవ సమస్యలు..

ఆత్మగౌరవ సమస్యలు..

సోషల్ మీడియాను అతిగా వాడటం వల్ల భాగస్వామి పట్ల విశ్వాసం మరియు గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పరిపూర్ణమైన వివాహ జీవితంలో అనవసరంగా సమస్యలు వస్తున్నాయి. దీని వల్ల చాలా మంది జంటలు తమ రిలేషన్లో ప్రతి ఒక్క దానిని సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చి చూడటం జరుగుతోంది. దీని వల్ల వివాహ సంబంధాలలో సులభంగా సమస్యలు వస్తున్నాయి.

పడకగదిలో ఇవి పెట్టుకుంటే.. పార్ట్ నర్ తో ప్రతిరోజూ పండగే...!

ఆసూయ పడటం..

ఆసూయ పడటం..

ఈ లోకంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సందర్భంలో ఆసూయ అనేది బయటపడుతూ ఉంటుంది. ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక ప్రతికూల భావోద్వేగం. ఇది ఒక వ్యక్తిని అనేక వైరుధ్య మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. అయితే సోషల్ మీడియాను విపరీతంగా వాడే జంటలు ఆన్ లైనులో స్నేహితులు మరియు వారి కార్యాచరణపై ఆసూయ మరియు ఇతర సమస్యలను ఎదుర్కొంటారు. వీరు తమ భాగస్వామితో కాకుండా సోషల్ మీడియాతో సంబంధం ఉండే వారితో ఎక్కువగా ఇతర కార్యకలాపాలు చేస్తుంటారు. దీని వల్ల వివాహ జీవితంపై ఆటోమేటిక్ గా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది.

అనుమానాలు..

అనుమానాలు..

మీరు అనునిత్యం సోషల్ మీడియాను అంటి పెట్టుకుని ఉండటం.. ప్రతి ఒక్క పోస్టుకు కామెంట్ చేయడం.. అందరికీ రిప్లై ఇవ్వడం వంటివి చేయడం వల్ల మీ భాగస్వామి మీపై అనుమానాలు పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య వర్చువల్ వరల్డ్ లేదా సోషల్ మీడియాలో ప్రజలు మోసం చేసే అవకాశాలు మరియు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఎక్కువ ఎమోషన్స్..

ఎక్కువ ఎమోషన్స్..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్ గా వస్తూ ఉంటుంది. అయితే అందులో అన్నీ వాస్తవాలే ఉంటాయనుకుంటే పొరపాటే.. ఏదైనా వైరల్ అయిన టాపిక్ మీద ఎక్కువగా ఎమోషన్ అవ్వడం, వాటి గురించి కామెంట్స్ చేయడం.. స్నేహితులతో చాటింగ్ చేయడం వల్ల ప్రయోజనాల కన్నా ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇతరులకు ఎక్కువగా..

ఇతరులకు ఎక్కువగా..

కొందరు జంటలు తమ కంటే ఇతరులకు ఎక్కువగా లైకులు, కామెంట్లు, లైక్స్ వచ్చాయంటూ నిరాశ పడుతూ ఉంటారు. అందులోనూ నెగిటివ్ కామెంట్ల వస్తే తెగ బాధపడిపోతారు. పాజిటివ్ కామెంట్లు వస్తే పొంగిపోతూ ఉంటారు. వీటి ద్యాసలో పడి తమ జీవిత భాగస్వామి పట్ల సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అంతేకాదు అక్కడ వచ్చే నెగిటివ్ కామెంట్స్ పై పార్ట్ నర్ పై కోపం చూపడంతో.. తమ వివాహ జీవితంలో నేరుగా సమస్యలకు స్వాగతం పలుకుతున్నారు.

English summary

Negatvie effects of social media on marriage and relationship in Telugu

Here we are talking about the negative effects of social media on marriage and relationships. Read on.
Story first published: Tuesday, March 23, 2021, 15:36 [IST]