For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Promise Day 2022: ప్రామీస్ డే రోజున ఈ విషయాలను అస్సలు మరచిపోకండి...

ప్రామీస్ డేను ఎందుకు జరుపుకుంటారు.. దానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా.

|

వాలెంటైన్స్ వీక్ లో ఐదోరోజును ప్రామీస్ డేగా జరుపుకుంటారు. ఈరోజు ప్రేమికులకు అత్యంత ప్రత్యేకమైన రోజులలో ఒకటి. ఫిబ్రవరి 11వ తేదీ ప్రామీస్ చేయడానికి అంకితం ఇవ్వబడింది.

Promise Day 2021 Date, Ideas, Importance, Why to Celebrate

రోజ్ డే, చాక్లెట్ డే, ప్రపోజ్ డే, టెడ్డీ డే తర్వాత ప్రామీస్ డేకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే హ్యాపీ, హెల్దీ రిలేషన్ షిప్ కు ప్రామీస్ లు చాలా ముఖ్యమైనవి.

Promise Day 2021 Date, Ideas, Importance, Why to Celebrate

మనలో చాలా మంది చిన్ననాటి నుండే ప్రతి చిన్న విషయానికి ప్రామీస్ చేయడం మనలో అనేక మందికి ఉన్న అలవాటు కొందరికి ప్రామీస్ ఒక మాటగా మిగిలితే.. మరికొందరు తమ ప్రామీస్ ను నిలబెట్టుకోవడానికి ఎంతదూరమైనా.. ఎంతవరకైనా.. ఎవ్వరిదగ్గరికైనా ధైర్యంగా దూసుకెళ్తుంటారు. అయితే స్వార్థం, ద్రోహం, వంటి వాటిని పక్కనబెట్టి నిజాయితీ, నిబద్ధతతో ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్లు మాత్రం అరుదుగా ఉంటారు.

Promise Day 2021 Date, Ideas, Importance, Why to Celebrate

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ప్రామీస్ డేను ఎందుకు జరుపుకుంటారు.. ఈరోజుకు ఉన్న ప్రాధాన్యత మరియు ప్రత్యేకతలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Promise Day 2022 : ప్రామీస్ డే రోజున కొన్ని ప్రత్యేక వాగ్దానాలు చేయండి.. మీ ప్రేయసి మనసు దోచేయండి...Promise Day 2022 : ప్రామీస్ డే రోజున కొన్ని ప్రత్యేక వాగ్దానాలు చేయండి.. మీ ప్రేయసి మనసు దోచేయండి...

కీ రోల్..

కీ రోల్..

ప్రేమ, పెళ్లి అనేది నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన రిలేషన్. ఇందులో ప్రామీస్ అనేది రిలేషన్ ను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 11వ తేదీన ప్రామీస్ డేను జరుపుకుంటారు.

ఎంతలా ప్రేమిస్తున్నామో..

ఎంతలా ప్రేమిస్తున్నామో..

ఈ ప్రత్యేకమైన రోజున తమ పార్ట్ నర్ ఎంతలా ప్రేమిస్తున్నామో, వారితో తమకు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో తెలిపేలా ఆ ప్రామీస్ లు ఉంటాయి. ఈ ప్రామీస్ లలో ప్రేమపట్ల వారికి ఉన్న నిజాయితీ, నిబద్ధత తెలుస్తుంది. దీని వల్ల ప్రేమికుల మధ్య బంధం మరింత బలంగా మారుతుంది.

ప్రామీస్ డే అంటే..

ప్రామీస్ డే అంటే..

ప్రామీస్ డే అంటే మీ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకుంటానని ఒకరికి ఒకరు వాగ్దానం చేసుకోవడం. ఈరోజున ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చుకున్న మాటలను కూడా గుర్తు చేసుకుంటారు.

Valentine Day :న్యూమరాలజీ ప్రకారం, ఈ ఏడాది వాలెంటైన్స్ డే ఎంత రొమాంటిక్ గా ఉంటుందో తెలుసుకోవచ్చు...!Valentine Day :న్యూమరాలజీ ప్రకారం, ఈ ఏడాది వాలెంటైన్స్ డే ఎంత రొమాంటిక్ గా ఉంటుందో తెలుసుకోవచ్చు...!

మనసులోని మాటను..

మనసులోని మాటను..

ఈ ప్రామీస్ డే రోజున మీ బంధాన్ని కొత్త వాగ్దానాలతో మరింత పటిష్టం చేసుకోండి. కరోనా తర్వాత ఈ ఏడాది మీకు ఇష్టమైన వారితో మీ మనసులో మాటను వాగ్దానంగా తెలియజేయండి.

ఎలాంటి వాగ్దానాలంటే..

ఎలాంటి వాగ్దానాలంటే..

వాలెంటైన్ వీక్ లో ప్రామీస్ డేరోజున ఇలాంటి ప్రామీస్ చేయండి. వీలైనంత సమయం వారితోనే గడుపుతామని.. సంతోషంలో అయినా.. బాధలో అయినా వారిని ఒంటరిగా వదిలి వెళ్లనని, అబద్ధం చెప్పనని.. వ్యసనాలను వదిలేస్తానని, కుటుంబ బాధ్యతలు తీసుకుంటానన్న వాగ్దానాలు వారిని ఆలోచింపజేస్తాయి.

ఇదే మంచి సందర్భం..

ఇదే మంచి సందర్భం..

మీ భాగస్వామికి ప్రేమ, నవ్వు, సంరక్షణతో కూడిన జీవితాన్ని వాగ్దానం చేయడానికి విశ్వవ్యాప్తంగా ప్రజలు ప్రామీస్ డేను జరుపుకుంటారు. మీ భాగస్వామి పట్ల మీకున్న ప్రేమను, ఆప్యాయతను వ్యక్తపరచడానికి, ఎల్లప్పుడూ మీరు వారికి అండగా ఉంటారన్న నమ్మకం ఇవ్వడానికి ఇదే మంచి సందర్భంగా అని వారికి తెలియజేయండి. అయితే మీరు ఎలాంటి వాగ్దానం చేసినా.. అందులో నిజాయితీ ఉండాలని మాత్రం మరచిపోకండి...

FAQ's
  • వాలెంటైన్ వీక్ లో ప్రామీస్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రేమ, పెళ్లి అనేది నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన రిలేషన్. ఇందులో ప్రామీస్ అనేది రిలేషన్ ను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 11వ తేదీన ప్రామీస్ డేను జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున తమ పార్ట్ నర్ ఎంతలా ప్రేమిస్తున్నామో, వారితో తమకు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో తెలిపేలా ఆ ప్రామీస్ లు ఉంటాయి. ఈ ప్రామీస్ లలో ప్రేమపట్ల వారికి ఉన్న నిజాయితీ, నిబద్ధత తెలుస్తుంది. దీని వల్ల ప్రేమికుల మధ్య బంధం మరింత బలంగా మారుతుంది.

English summary

Promise Day Date, Ideas, Importance, Why to Celebrate

Here we are talking about the promise day 2021 date, ideas, importance, why to celebrate. Read on.
Desktop Bottom Promotion