Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
ఆడవారికి శృంగారంలో ఆసక్తి తగ్గేందుకు గల కారణాలు తెలుసా...
మహిళలకు శృంగారంపై ఆసక్తి తగ్గేందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలే ప్రస్తుతం కరోనా కాలం.. అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కాలం.. ఇదే సమయంలో లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ.. పెళ్లి చేసుకున్న వారికి శృంగారం పట్ల చాలా భయం వేస్తోందట..

ముఖ్యంగా మగవారు తమ భాగస్వాములను ఆ కార్యంలో బాగా సుఖపెట్టాలని ఆశిస్తుంటే.. కొందరు వారికి సహకరించకుండా ఉంటారు. వారిలో చాలా మందికి శృంగారం పట్ల అవగాహన లేకపోవడంతో.. వారి లైంగికంగా ఎలా పాల్గొనాలన్న విషయంలో భయపడుతూ ఉంటారు.

దీంతో చాలా మంది మహిళలకు శృంగారంపై ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. మనం ఇక్కడ గమనించాల్సని ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పురుషుల మాదిరిగా స్త్రీలు వెంటనే ఉద్వేగానికి చేరుకోలేరు.

ఎందుకంటే వారికి పురుషుల కంటే భిన్నమైన లిబిడో ఉంటుంది. కాబట్టి వారు ఆలస్యంగా ఉద్వేగానికి చేరుకుంటారు. అయితే ఇదొక్కటే కారణం కాదు..

వారికి ఇతర రకాల ఒత్తిడి కూడా ఉంటుంది. దీని వెనుక భాగస్వామి పట్ల తక్కువగా ఆసక్తిగా ఉండటం లేదా ఇతర కారణాలు అనేకంగా ఉండొచ్చు. అలాంటి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

చెడు ప్రభావం..
ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో స్త్రీలకు ఇతర బాధ్యతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో వీరిపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో వారికి శృంగారంపై ఆసక్తి అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతోంది. ఈ కారణాంగానే వారికి శృంగార కోరికలు తగ్గిపోతున్నాయి.

ప్రతి రోజూ శృంగారం..
భాగస్వాములతో ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా ఆ కార్యంపై ఆసక్తిని కోల్పోతారు. అయితే భాగస్వామికి ఆసక్తి ఉంటే మాత్రం వారు కలయికను తిరస్కరించలేరు. అయిష్టంగానే శృంగారంలో పాల్గొటారు. అలాంటి సమయంలో మగవారు తమ భాగస్వామి మానసిక స్థితిని అర్థం చేసుకుని, కొంత విరామం ఇవ్వాలి. వారికి విశ్రాంతి ఇవ్వాలి.

పరస్పర విభేదాలు..
శృంగారం పట్ల ఆసక్తి తగ్గడానికి ప్రధానమైన కారణం మరొకటి. భాగస్వామితో పరస్పరం పోట్లాడుకోవడం.. ప్రతి రోజూ గొడవ పడటం వంటివి చేస్తే.. మహిళలు ఆ కార్యానికి అస్సలు ఒప్పుకోరు. దీని వల్ల వారికి శృంగారంపై ఆసక్తి అనేది తగ్గిపోతుంది.

పిల్లల ఆలోచన..
ఒక మహిళ తన భాగస్వామితో సంబంధాన్ని కలిగి ఉంటే, ఆమె కేవలం శృంగారం గురించే కాదు.. వారి పిల్లలు, అత్తమామలు ఇతర వాటి గురించి ఆలోచన ఎప్పుడైతే చేస్తుందో.. అప్పుడు కూడా వారికి కలయికపై ఆసక్తి తగ్గిపోతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల వారికి శృంగారంపై ఆసక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది.

డెలివరీ తర్వాత..
ప్రతి ఒక్క మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత తల్లి కావాలని కలలు కంటుంది. ఈ నేపథ్యంలోనే శృంగారంపై ఆసక్తి పెంచుకుంటుంది. హార్మోన్లలో మార్పు వల్లే ఇదంతా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఆమెకు డెలివరీ అవుతుందో.. తన మనసంతా ఎక్కువగా పిల్లల చుట్టూ తిరుగుతుంది. వారి అవసరాలు, ఆనందం మరియు సంరక్షణకు తల్లిగా ప్రాధాన్యత ఇస్తుంది. అలాంటి సమయంలో శృంగారంపై ఏ అమ్మాయి ఆసక్తి చూపదు.

నిద్రలేమి..
మహిళల్లో శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడానికి మరో కారణం ఏంటంటే సరైన నిద్ర లేకపోవడం. ఒకరోజు బాగా అలసిపోవడం.. ఆ సమయంలో నిద్రపోదామంటే.. తన భాగస్వామిలో కోరిక కలగడం.. ఆ సమయంలో అయిష్టంగా పాల్గొనడం.. ఇలాంటి కారణం వల్ల మహిళలకు శృంగారం పట్ల ఆసక్తి అనేది తగ్గుతుంది.



Click it and Unblock the Notifications
