For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన దేశంలో పెద్దలు చేసే పెళ్లి కంటే.. ప్రేమ పెళ్లిళ్లే సక్సెస్ అయ్యేందుకు గల ప్రధాన కారణాలివే...!

భారతదేశంలో ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ అయ్యేందుకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

పెళ్లి.. అనే రెండక్షరాలు అంటే ఇద్దరు వ్యక్తులను కలపడమే కాదు.. రెండు కుటుంబాలను కలుపుతుంది. అయితే ప్రేమ అనే రెండక్షరాలు ఇద్దరు వ్యక్తుల మనసులను కూడా కలుపుతుంది. ఇదిలా ఉండగా... మన దేశంలో ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు పెరిగిపోతున్నాయి.

Reasons Why Love Marriage in India is Successful in Telugu

ప్రేమ వివాహం చేసుకుని తమ జీవిత భాగస్వామితో జీవితాంతం హాయిగా గడిపేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కూడా ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఈ సందర్భంగా చాలా మంది పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుందామా.. ప్రేమ వివాహం చేసుకుందామా అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

Reasons Why Love Marriage in India is Successful in Telugu

ఎందుకంటే లైఫ్ లాంగ్ మనతో కలిసి నడిచే భాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో ఇలాంటి గందరగోళం ఉండటం చాలా సహజమే. అయితే వీటిలో దేని బెనిఫిట్స్ దానికే ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్లి ద్వారా మన గురించి వారు.. వారి గురించి మనం పూర్తిగా తెలుసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం దొరుకుతుంది. ఇలాంటి ప్రయోజనాలెన్నో ప్రేమ పెళ్లిలో ఉన్నాయని చాలా మంది ప్రేమికులు చెబుతున్నారు. అందుకే మన దేశంలో ప్రేమ పెళ్లిళ్ల సక్సెస్ రేటు పెరిగిపోతోంది. అంతేకాదు ఇవి ఎందుకు సక్సెస్ అవుతున్నాయనేందుకు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

స్త్రీ, పురుషులిద్దరూ పెళ్లికి ముందే ఈ విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతురాట...!స్త్రీ, పురుషులిద్దరూ పెళ్లికి ముందే ఈ విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతురాట...!

ప్రేమ పెళ్లిలో..

ప్రేమ పెళ్లిలో..

లవ్ మ్యారేజ్ చేసుకునే వారిలో ఒకరి గురించి మరొకరికి ముందుగానే చాలా విషయాలు తెలుస్తాయి. తన భాగస్వామి గురించి భయం, ఇంతకుముందు ఉన్న బంధాలతో పాటు ఇతర విషయాల గురించి బాగా తెలిసిపోతాయట. అంతేకాదు పార్ట్నర్ బలాలు, బలహీనతలను కూడా తెలుసుకోవచ్చు. లవ్ మ్యారేజ్ లో తన భాగస్వామిలో ఏవైనా లోపాల గురించి తెలుసుకుని.. వాటిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే.. ఆ జర్నీ చాలా బాగుంటుందట.

నిర్ణయాల విషయంలో..

నిర్ణయాల విషయంలో..

ప్రేమ పెళ్లి చేసుకుంటే.. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాల విషయంలో తామిద్దమే ఆలోచించొచ్చు. ఇతరుల జోక్యం ఉండదు. ముఖ్యంగా మూడో వ్యక్తి తమ మధ్యలో తలదూర్చే అవకాశమే ఉండదు.. అవసరం కూడా లేదు.. ఎందుకంటే తమ జీవితానికి సంబంధించి తామే అన్ని కష్టనష్టాలను షేర్ చేసుకుంటామంటున్నారు కొందరు ప్రేమికులు. అందుకే తమ జీవితం గురించి ఇతరుల నిర్ణయంతో ఏ మాత్రం అవసరం లేదంటున్నారు.

సరదాగా గడపొచ్చు..

సరదాగా గడపొచ్చు..

తాము ప్రేమించిన వ్యక్తితో తమ జీవితాన్ని సాఫీగా.. సరదాగా గడిపేందుకు తమకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందట. ముఖ్యంగా తమ ప్రేమ కాస్త.. పరిణయం దాకా వెళ్తే.. ఆ క్షణంలో తమ మనసులో ఏదో సాధించామనే సంతోషం పెరిగిపోతుందట. తాము తమ జీవితంలో మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఫీలవుతారట. అంతకంటే ఉత్తమమైన క్షణం ఉండదని భావిస్తారట.

భాగస్వామిని అలా చూసినప్పుడు.. ప్రతి మగాడిలో కలిగే ఫీలింగ్స్ ఏంటో తెలుసా..భాగస్వామిని అలా చూసినప్పుడు.. ప్రతి మగాడిలో కలిగే ఫీలింగ్స్ ఏంటో తెలుసా..

త్వరగా సర్దుకుపోవచ్చు..

త్వరగా సర్దుకుపోవచ్చు..

లవ్ మ్యారేజ్ చేసుకుంటే.. పెళ్లికి ముందే ఒకరి గురించి మరొకరికి దాదాపు అన్ని విషయాలు తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పార్ట్నర్ ఏమంటే ఇష్టం.. ఏమంటే ఇష్టం ఉండదో తెలిసి ఉంటుంది. కాబట్టి వాటికి అనుగుణంగా త్వరగా సర్దుకుపోవచ్చట. అదే పెద్దలు సెట్ చేసిన పెళ్లిలో ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. అంతేకాదు ఒకరికొకరు సర్దుకుపోవడానికి కూడా కొంత టైమ్ పడుతుంది. ఈలోపే గొడవలు కూడా జరగొచ్చు.

ఒకటే సంప్రదాయం..

ఒకటే సంప్రదాయం..

పెద్దలు చేసే పెళ్లిళ్లలో.. మతం, కులం, జాతి, ఆస్తి, అంతస్తు.. ఆర్థిక పరమైన విషయాలతో ఇంకా కుటుంబ చరిత్ర ఇంకా ఎన్నో విషయాల గురించి ఆరా తీస్తారు. అంతేకాదు ఒకే సంప్రదాయం ఉండే వారితో వివాహం జరిపిస్తారు. అదే ప్రేమ పెళ్లి అయితే కులం, మతం, సంప్రదాయం గురించి పెద్దగా పట్టింపులనేవే ఉండవు. ప్రతిదీ కొంచెం కొత్తగా ఉంటుంది. దీంతో తాము కొత్త వాటిని తెలుసుకోవచ్చని భావిస్తారట.

ఎల్లవేళలా ప్రోత్సాహం..

ఎల్లవేళలా ప్రోత్సాహం..

ప్రేమ పెళ్లి చేసుకుంటే.. ఎలాంటి ఆంక్షలు అనేవి ఉండవు. తమ లక్ష్యాలు, భవిష్యత్తు గురించి తమ భాగస్వామికి బాగా తెలుసు కాబట్టి తాము చేసే పనిలో ఉన్నత స్థాయికి ఎదగాలని.. తమను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారని భావిస్తారు. అన్నింటికంటే ఆనందించే విషయం ఏంటంటే ఇద్దరం కలసి రెస్పాన్సిబిలిటీలను షేర్ చేసుకోవడం. కొన్నిసార్లు గొడవలు జరిగినా.. ఆ బంధంలో మరింత ప్రేమ పెరుగుతుందట. ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం చాలా అద్భుతంగా అనిపిస్తుందట.

English summary

Reasons Why Love Marriage in India is Successful in Telugu

Here are the reasons why love marriage in India is successful in Telugu. Have a look
Story first published:Monday, December 6, 2021, 17:17 [IST]
Desktop Bottom Promotion