Latest Updates
-
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం!
Ratan Tata :రతన్ టాటా ప్రేమలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలుసా? అందుకే ఆయన పెళ్లి చేసుకోలేదా?
రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండేందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రతన్ టాటా అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఈ లోకంలో ఉండే ఎందరికో తనంటే ఎవరో బాగా తెలుసు. ఎందరో బిజినెస్ మెన్లకు ఆయన రోల్ మోడల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారతదేశం అంటే ఎనలేని దేశభక్తి.. నిరాడంబరతకు మారు పేరు.. జంతువులంటే చచ్చేంత ప్రేమ.. ఒత్తిడిని అవలీలగా అధిగమించడం.. క్లిష్ట సమయాల్లో 'కీ'లక పాత్ర పోషించడం వంటి పాత్రలు పోషించడం వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకే దక్కుతుంది. అయితే తన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. తను ఇప్పటికీ బ్యాచ్ లర్ గానే అందరికీ సుపరిచితుడు.

ఇంత పెద్ద బిజినెస్ మెన్ అయినా కూడా తను ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. తనెప్పుడూ ప్రేమలో పడలేదా? అమ్మాయిలతో కనీసం మాట్లాడేవాడా కాదా అనే సందేహాలు మనలో చాలా మందికే వస్తుంటాయి. అలాంటి వాటన్నింటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

నాలుగుసార్లు..
రతన్ టాటా కూడా యవ్వనంలో కూడా మనలో ఒకరిలాగానే ప్రేమలో పడ్డాడు. అది కూడా ఏకంగా నాలుగుసార్లు ప్రేమలో పడ్డాడట. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రతన్ టాటా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ టాపిక్స్ చెప్పాడు.

పరిస్థితుల ప్రభావం వల్ల..
తన జీవితంలో నాలుగు సార్లు ప్రేమలో పడినప్పటికీ, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పెళ్లి చేసుకోలేకపోయానని, అయితే ఒక విధంగా పెళ్లి చేసుకోకపోవడం వల్లే మంచిదైందని చెప్పారు. ఒకవేళ వివాహం చేసుకుని ఉంటే తన పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేదని చెప్పారు.

అమెరికన్ అమ్మాయిని..
రతన్ టాటా అమెరికాలో నివసించే సమయంలో ఓ అమెరికన్ అమ్మాయిని ప్రేమించినట్లు చెప్పారు. ఆ సందర్భంలో తనను వివాహం చేసుకోవాలని అనుకున్నట్టు.. కానీ తర్వాత తాను ఇండియాకు రావడంతో, ఆమె అక్కడే ఉండిపోవడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం ఆ అమ్మాయి మరొకరిని వివాహం చేసుకుందని చెప్పారు.

తన చిన్నప్పుడే..
రతన్ టాటా చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో బామ్మ దగ్గరే పెరిగాడు. అలాంటి ఆమెను చివరి రోజుల్లో చూసుకునేందుకు ఎవరూ లేరని అందుకే టాటా పెళ్లి చేసుకోలేదు. తనను ఉన్నతస్థాయికి తీసుకొచ్చిన బామ్మ కోసం రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట.

విద్యార్థిగా ఇబ్బందులు..
మా అమ్మ నాన్నలు విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత తోటి విద్యార్థుల నుండి ఇబ్బందులను ఎదుర్కొన్నా. అప్పట్లో విడిపోవడం అంటే ఇప్పటిమాదిరిగా అంత సులభమైన విషయం కాదు. అందుకే స్కూల్లో మమ్మల్ని ర్యాగింగ్ చేసేవాళ్లు. అలాంటి సమయంలో మా బామ్మ నాకు ఎంతో అండగా నిలిచింది.

బామ్మ సహాయంతో..
మా నాన్నతో కూడా నాకు విభేదాలు వచ్చాయి. నేను వయోలిన్ వాయించడం నేర్చుకుంటానంటే.. నాన్న పియానో నేర్చుకోవాలని పట్టుబట్టారు. నేను అమెరికాలో చదువుతానంటే.. లండన్లో చదవాలని, నేను ఆర్కిటెక్ట్ అవుతానంటే.. ఇంజనీర్ కావాలని పట్టుబట్టారు. అయితే అప్పుడు బామ్మ సహాయంతో నేను ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయ్యాను. అయితే ఈ విషయం మా నాన్నను నిరాశకు గురి చేసింది.

సొంత నిర్ణయాలు..
ఆ తర్వాత నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాను. బామ్మ చెప్పినట్టు సున్నితంగా మాట్లాడుతూనే.. నాకు కావాల్సిన వాటిని సాధించుకునేవాడిని. దీనంతటికీ బామ్మ ఇచ్చిన ధైర్యమే కారణం.

యుద్ధం వల్ల..
1962లో ఇండియా-చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో నేను ఇండియాకు వచ్చాను. తను కూడా నాతో వస్తుందని భావించాను. కానీ తను రాలేదు. దీని కారణంగా మా ప్రేమ బంధానికి బీటలు వారాయని చెప్పుకొచ్చారు రతన్ టాటా.



Click it and Unblock the Notifications