Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
సర్వే! పెళ్లికాని ప్రసాదుల గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసా...
మూడు పదుల వయసు దాటినా పెళ్లి జరగకపోతే లోకం ఎలా ఆడిపోసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మందికి విక్టరీ వెంకటేష్ నటించిన 'మల్లీశ్వరి' సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో వెంకటేష్ పెళ్లి కోసం ఎంతలా పరితపించి పోతుంటాడో మనందరికీ తెలిసిందే.

వయసు 30 దాటి తాను ముదురు బెండకాయలా మారిపోతున్నాని తెగ ఆవేదన చెందుతూ ఉంటాడు. కానీ ప్రస్తుత తరం యువతలో చాలా మంది పురుషులు తమ జీవితంలో సెటిల్ అవ్వాలనే కోరికతో పెళ్లి అనే ముఖ్యమైన ఘట్టం గురించి క్రమంగా మరిచిపోతున్నారు.

తమ వయసు మూడు పదులు దాటినా కూడా కొత్త వ్యక్తితో కలిసి జీవితాన్ని పంచుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే పెద్దలు మాత్రం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులోనే జరగాలని చెబుతుంటారు.

కానీ ఇప్పటి జనరేషన్ వారు ఈ మాటలను అస్సలు పట్టించుకోవట్లేదు. వారి మాటలు లెక్క చేయకపోవడంతో మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లి కాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు. మరి ఇలాంటి వారి గురించి సమాజం ఏమనుకుంటుంది.. వీరిని లోకం ఎలా ఆడిపోసుకుంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

భవిష్యత్తులో సమస్యలు..
ప్రస్తుత సమాజంలో ఆడవారైనా.. మగవారైనా మూడు పదుల వయసు దాటేలోపు సెటిల్ అవ్వాలని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. అలా గనుక జరగకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. అవి సహజమైనవి కావచ్చు. లేదా ఇతర సమస్యలు కూడా కావొచ్చు.

ఓ సర్వేలో..
ఇదిలా ఉండగా.. మూడు పదుల వయసు దాటిన వారి గురించి జనాలు ఏమనుకుంటున్నారు, అలాగే మీ తోటివారు ఏమని అనుకుంటున్నారనే విషయంపై ఓ ప్రైవేట్ సంస్థ సర్వే చేయగా, అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి.

బాధ్యత లేదని..
మూడు పదుల వయసు దాటిన వారు వారు వారిలాగానే ఉన్నా.. ఈ లోకం వారిని బాధ్యత లేని వారిగా పరిగణిస్తుందట లేదా అతను ఇంకా మెచ్యూర్ కాలేదనో అనుకుంటారట. అంతేకాదు.. పెళ్లి కాకుండా ఎవరైనా అమ్మాయిని కామన్ గా చూసినా కూడా వారి గురించి తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు.. వారి గురించి ఏవేవో విషయాలు గుసగుసలాడుకుంటారట.

డబ్బు లేదని..
సింగిల్ గా ఉండే సమయంలో పార్టీలకు, పబ్బులకు లేదా ఇత కార్యక్రమాలకు ఉన్న డబ్బంతా ఖర్చు చేసింటారనీ.. అందుకే పెళ్లికి ఇప్పుడు కావాల్సినంత డబ్బు లేక ఒంటరిగా మిగిలిపోయారని అనుకుంటారట. అందుకే మీరు ఎవ్వరితో కలవడానికి ఇష్టపడరని చెప్పుకుంటారట.

విచిత్రమైన విషయమేమిటంటే..
బ్రహ్మచారులుగా ఉండే వారికి కొన్ని విచిత్రమైన విషయాలు నచ్చుతాయట. అందులో ఒకటి కొందరికి అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా నచ్చుతారట. అందుకే మీకు పెళ్లి కావడం లేదని భావిస్తారట. దీంతో మిమ్మల్ని ‘గే' అని లేదా మీలో ఏదైనా లోపం ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తారట.

సీక్రెట్ లవ్..
మూడు పదుల వయసు దాటిన తర్వాత కూడా మీరు పెళ్లి చేసుకోకపోతే.. మీరు ఎవరితో అయినా సీక్రెట్ లవ్ లో ఉన్నారేమోనని, మీరు ఏదైనా కంపెనీలో లేదా ఆఫీసులో పని చేసే చోట ఎవరితో అయినా ఏదైనా రిలేషన్ లో ఉన్నారని, లేదా మీకు సరైన అమ్మాయి దొరకడం లేదని భావిస్తూ ఉంటారట.



Click it and Unblock the Notifications
