Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
చలికాలంలో రతి క్రీడలో పాల్గొంటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా...
చలికాలమే లవ్ మేకింగ్ ఎందుకని అనువైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
'అబ్బబ్బా తుంటరి గాలి.. అందంగా ఒళ్లో వాలి.. కవ్విస్తే ఏమేం చెయ్యాలి.. ముచ్చట్లు ఆపేయాలి.. దుప్పట్లో దూరేయాలి.. ఆపైన నీకే తెలియాలి' అంటూ ఓ సినీ కవి చలికాలంలో కోరికల గురించి అద్భుతంగా వర్ణించాడు.

గతంలో అంటే అందరూ ఉమ్మడి కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పుడన్నీ ఏ సమయానికీ ఏదీ జరగాలో.. అదే జరిగేది. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ప్రస్తుతం రొమాన్స్ చేసుకునే టైమంతా ఛేంజ్ అయిపోయింది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి ఒళ్లు బద్ధకంగా అనిపిస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకాసేపు నిద్రపోదాం అనుకుంటూ దుప్పటిని చుట్టుకుంటూ ఉంటారు.

అయితే పెళ్లి చేసుకున్న వారు.. జంటగా ఉండే వారు మాత్రం చలికాలంలో కీలుగుర్రంలా రెచ్చిపోతారంట. ఈ సమయం వచ్చినప్పుడు చాలా మంది కపుల్స్ రొమాన్స్ లో రెచ్చిపోతారని నిపుణులు చెబుతున్నారు. దీనిపై కొంతమందిని ఎంపిక చేసి అధ్యయనం కూడా చేశారట. వారి వారి అవకాశాన్ని బట్టి రొమాన్స్ లో పాల్గొనే కాలాన్ని పరిశీలించారట. వీరిలో దాదాపు 80 శాతం మంది ప్రజలు చలికాలానికే ఓటేశారట. వాస్తవానికి, శృంగారంలో పాల్గొనేందుకు చలికాలమే సరైనదని నిపుణులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయట. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎక్కువ ఎంజాయ్..
ఇన్ని రోజులు వేసవి కాలంలో ఉక్కపోత వల్ల ఇబ్బంది పడ్డ తమ బాడీకి చల్లగాలి తగలగానే ఒళ్లంతా గిలి గిలి పెట్టినట్టు అవుతుంది. ఈ సమయంలో పెళ్లి చేసుకున్న వారు మరియు జంటగా ఉండే వారి శరీరాలన్నీ ఎక్కువగా వెచ్చదనాన్ని కోరుకుంటాయి. అందుకే ఈ చలికాలంలో ఎక్కువ ఎంజాయ్ చేసేందుకు శృంగారంలో పాల్గొంటారు.

బాడీలో అది పెరుగుతుంది..
సాధారణంగా వర్షాకాలంలో చాలా మందికి జలుబు చేస్తూ ఉంటుంది. కానీ చలికాలంలో దీని నుండి ఉపశమనం పొందడానికి శృంగారంలో పాల్గొంటే చాలంట. ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదంట. ఈ సమయంలో రతి క్రీడలో పాల్గొంటే జ్వరం, జలుబు వంటి వాటి నుండి బయటపడటమే కాకుండా.. బాడీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట.

తక్కువ వెలుతురు..
చలికాలంలో సూర్యోదయం చాలా ఆలస్యమవుతుంది. అదే సమయంలో సాయంత్రం వేళ కూడా చాలా త్వరగా అస్తమిస్తాడు. ఇక మిగిలిన సమయంలో కూడా ఎండ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ కారణంగా మన బాడీలో డి-విటమిన్ లోపం ఏర్పడొచ్చు. కాబట్టి మనం బద్ధకంగా.. నీరసంగా ఉంటుంటాం.

విహారానికి వెళితే..
చలికాలంలో శృంగారంలో పాల్గొంటే ఎక్కువ మజాను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో భాగస్వామితో కలిసి విహారానికి వెళితే.. మీ బంధం మరింత బలంగా మారుతుంది. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, ప్రేమ పెరుగుతుంది.

పీరియడ్స్ తగ్గొచ్చు..
ఆడవారు పీరియడ్స్ టైమ్ లో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అయితే చలికాలంలో శృంగారంలో పాల్గొనడం వల్ల వారికి ఆ సమస్య తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ విషయం తమ పరిశోధనలో వెల్లడైనట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రెగ్నెన్సీకి కరెక్ట్ టైమ్..
ఈ సమయంలో ప్రెగ్నెన్సీకి కరెక్ట్ టైమ్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేసవికాలంతో కంపేర్ చేస్తే చలికాలంలో మగవారిలో వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రెగ్నెన్సీకి ఈజీగా మారుతుంది.

ఏ సమయమైనా..
ఈ చలికాలంలో శృంగారంలో పాల్గొనేందుకు ఎలాంటి సమయపాలన నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. పైగా ఇప్పుడు కరోనా కాలం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని, రతి క్రీడలో పాల్గొంటే.. చక్కని ఫలితాలొస్తాయని చెబుతున్నారు.

వీకెండ్స్ లో ఎక్కువగా..
అయితే దీనికి సంబంధించి బ్రిటన్లో కొందరిని ఎంపిక చేసి ఈ విషయంపై సర్వే చేయగా.. వారిలో చాలా మంది ఉద్యోగులు వీకెండ్స్ లో ఎక్కువ సమయం రతి క్రీడలో పాల్గొంటున్నారని తెలిపారట.

వింటర్లో రొమాన్స్..
సర్వేలో పాల్గొన్న చాలా మంది ఎండాకాలంతో పోలిస్తే.. చలికాలంలో రొమాన్స్ చేసేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. సో చలికాలంలో జంటలు పడకగదిలో రెచ్చిపోతారన్నమాట.



Click it and Unblock the Notifications
