For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wife and Husband Problems:భార్యలు కలయిక పట్ల ఆసక్తి చూపకపోవడానికి కారణాలేంటో తెలుసా...

మీ పార్ట్నర్ ఆ కార్యంలో పాల్గొనేందుకు ఎందుకని ఆసక్తి చూపరో.. అందుకు గల కారణాలేంటో.. తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

ఈ లోకంలో ప్రతి ఒక్క మగాడు ఎంత ప్రయత్నించినా మహిళ మనసు లోతును మాత్రం తెలుసుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవ్వరికీ తెలియదు.

Reasons Why Your Partner Avoid Romance in Telugu

ఇక ప్రేమలో ఉన్నప్పుడు.. భార్యభర్తలుగా ఉన్నప్పుడు.. వారి ప్రవర్తన పీక్ స్టేజ్ కి చేరుతుందనడంలో అతిశయోక్తి లేదు. చిన్న చిన్న విషయాలకే అలకబూనటం.. భర్తను దగ్గరకు రానివ్వకపోవడం.. వంటివి చేస్తూ మగాళ్లను తెగ ఇబ్బంది పెడుతుంటారు.

Reasons Why Your Partner Avoid Romance in Telugu

ముఖ్యంగా అబ్బాయిలు ఆ కార్యంలో పాల్గొనేందుకు ఎంత ప్రయత్నించినా.. ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా.. ఎంత చొరవ చూపినా.. వారు కలయిక విషయంలో అస్సలు ఆసక్తి చూపరు. దీనిపై చాలా మంది భర్తలు నిపుణులను కలిసి ఫిర్యాదు చేస్తూ ఉంటారు.

Reasons Why Your Partner Avoid Romance in Telugu

అయితే మహిళలు తమ భాగస్వామితో పడకగదిలో రతి క్రీడ పట్ల ఆసక్తి చూపకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని వారు నేరుగా చెప్పకుండా.. పరోక్షంగా చెబుతారంట.. ఈ సందర్భంగా తమ భాగస్వాములను మహిళలు ఎందుకని ఆ కార్యానికి దూరంగా పెడతారు? అందుకు గల కారణాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కపుల్స్ ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారా? అయితే ఇలా ట్రై చేయండి...కపుల్స్ ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారా? అయితే ఇలా ట్రై చేయండి...

భావోద్వేగ బంధం..

భావోద్వేగ బంధం..

భార్యభర్తలైనా.. ప్రియుడు, ప్రియురాలైనా.. వారి మధ్య బంధం బలపడాలంటే సాన్నిహిత్య సంబంధం బలంగా ఉండాలి. అప్పుడే వారి మధ్య భావోద్వేగ బంధం బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి భావోద్వేగ బంధం ఆలుమగలు, ప్రేమికుల మధ్య ఉండదో వారు ఆ కార్యం పట్ల పెద్దగా ఇంట్రస్ట్ చూపించరట. కాబట్టి మీరెప్పుడైనా కలయికలో పాల్గొనాలంటే.. ముందు మీ పార్ట్నర్ సాన్నిహిత్యం పెంచుకోండి. ముందు తను మీ గురించి ఏమనుకుంటోంది.. తనకు ఆ కార్యం పట్ల ఏమైనా ఆందోళన, సమస్యలున్నాయా అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయట.

నమ్మకం పోయినప్పుడు..

నమ్మకం పోయినప్పుడు..

మనలో చాలా మంది మహిళలు భర్తను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తమ భర్తను ఆయురారోగ్యాలు బాగుండాలని ఎన్నో వ్రతాలు, పూజలు చేస్తుంటారు. అలాంటి భర్త తమను ఏదైనా విషయంలో మోసం చేసినప్పుడు వారు అస్సలు తట్టుకోలేరు. మీరు వారి నమ్మకాన్ని వమ్ము చేశారని భావిస్తారు. అంతే ఒక్కసారిగా వారిపై కోపం పెంచుకుని వారిని దూరంగా పెట్టేస్తారు. అయితే మీరు ఆ తప్పును సరిదిద్దుకుంటే.. వారు మీకు మళ్లీ కలిసేందుకు ఒక అవకాశం ఇస్తారు.

అలసిపోవడం వల్ల..

అలసిపోవడం వల్ల..

కొందరు భార్యలు ఇంటి పనీ.. ఉద్యోగంలో చేసే పనీ.. ఇతర పనుల కారణంగా పూర్తిగా అలసిపోతూ ఉంటారు. దీని వల్ల వారికి ఆ కార్యంలో పాల్గొనేందుకు ఏ మాత్రం సమయం దొరకదు. ఒకవేళ సమయం దొరికినా.. వారి బాడీ ఆ కార్యానికి సహకరించదు. దీంతో వారు కలయికలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అలాంటి సమయంలో మీ భాగస్వామి చేసే పనుల్లో మీరు కొంచెం సహాయం చేయాలి. మీ వంతు ప్రోత్సాహం తనకు ఇస్తే.. తను కూడా మీ కోసం ఆ కార్యంలో పాల్గొనేందుకు సిద్ధమవుతారు.

మీ భాగస్వామిలో ఈ లక్షణాలుంటే.. మీ వివాహ జీవితానికి ముగింపు పలకాల్సిందే...!మీ భాగస్వామిలో ఈ లక్షణాలుంటే.. మీ వివాహ జీవితానికి ముగింపు పలకాల్సిందే...!

వయసు ప్రభావం..

వయసు ప్రభావం..

చాలా మంది మహిళలకు వయసు పెరగడం.. పిల్లలు పుట్టడం వల్ల ఆ కార్యంపై క్రమంగా ఆసక్తి తగ్గిపోతుందని భావిస్తారు. అయితే వయసు పెరిగే కొద్దీ వారీ బాడీలో కలిగే మార్పులు.. వారి ప్రవర్తనలో వచ్చే మార్పుల వల్ల ఆ కార్యంపై ప్రభావం పడుతుందట. దీని వల్ల పిల్లల ముందు రొమాన్స్ చేయడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కారణంగా కూడా కొందరు మహిళలు భర్తతో కలయికకు పెద్దగా ఆసక్తి చూపరు.

కుటుంబ సమస్యలు..

కుటుంబ సమస్యలు..

మన భారతదేశంలో పెళ్లి.. దాని తర్వాత ఉండే కట్టుబాట్లు, సంప్రదాయాల గురించి మనందరికీ తెలిసిందే. అందులోనూ పెళ్లయ్యాక అత్తారింట్లో అందరూ కొత్త. అలా కొత్త కుటుంబ సభ్యుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైనా కూడా దాని తొలి ప్రభావం భర్తపైనే పడుతుందట. అది కూడా పడకగదిలో ఆ కార్యంలోనే అంట. కాబట్టి ఇలాంటి సమస్యలను ముందుగానే గుర్తించి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇష్టం లేకపోవడం..

ఇష్టం లేకపోవడం..

కొందరికి పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లంటే ఇష్టముండదు. తాము ప్రేమించిన వ్యక్తిని కాదని.. పెద్దలు బలవంతపు పెళ్లి చేసినప్పుడు.. కట్టుకున్న భర్తతో కలయికకు పెద్దగా ఇష్టం చూపరు. అలాంటి వారిని మీరు నెమ్మదిగా దారిలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రేమలో విఫలమైనవారు.. అంత ఈజీగా బయటికి రాలేరు. కాబట్టి మీరు కొంత సమయం పాటు వేచి ఉంటే పరిస్థితులు చక్కబడొచ్చు. అంతేగానీ మీరు ఆ కార్యం గురించి బలవంతం చేస్తే.. మొదటికే మోసం జరగొచ్చు.

English summary

Reasons Why Your Partner Avoid Romance in Telugu

Here are the reasons why your partner avoid romance in Telugu. Take a look
Story first published:Tuesday, August 24, 2021, 16:51 [IST]
Desktop Bottom Promotion