For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీలో ఇలాంటి లక్షణాలుంటే.. మీ ప్రేమ జీవితాంతం సాఫీగా సాగిపోతుంది...

|

రొమాన్స్ అనేది కేవలం రెండు శరీరాలను ఒక్కటి చేయడమే కాదు.. అది ఇద్దరు మనుషుల మధ్య ఉండే మనసులతో పెనవేసుకుపోయే బంధానికి ఓ సాక్ష్యం.

ఓ వ్యక్తి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ.. ఈ లోకంలో ఉండే ప్రేమ మొత్తాన్ని తన కౌగిలిలో బంధించి మీకు అందిస్తున్నారంటే.. అంత కంటే మించినది మరొకటి ఉండదు. సాధారణంగా ఏ జంట కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలన్నా.. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఒకటే ముఖ్యం కాదు.. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది.

ఇలాంటి బంధం కలకాలం ఆనందంగా ఉండాలంటే.. మీరు తరచుగా కొన్ని పనులు చేయాలి.. కొన్ని చమత్కారమైన అలవాట్లను అలవర్చుకోవాలి. అందులో రొమాన్స్ కూడా ఒకటి. అయితే రొమాన్స్ తర్వాత మీ భాగస్వామిని ప్రశంసిస్తూ కొన్ని పనులు చేయడం వల్ల మీకు ప్రతిరోజూ ప్రత్యేకంగా మారుతుంది. ఈ సందర్భంగా మీరు చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అబ్బాయిలతో 'ఆ కార్యం'లో ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!

భాగస్వామికి ప్రశంసలు..

భాగస్వామికి ప్రశంసలు..

‘నువ్వు నా పక్కనుండటం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.. నువ్వు నా జీవితంలో వచ్చినప్పటి నుండి నా లైఫ్ మొత్తం హ్యాపీగా మారిపోయింది. నేను ఏం చేస్తే ఆనందంగా ఉంటానో.. నీకు పూర్తిగా తెలుసు' ఇలాంటి పొగడ్తలకు పడని వారు ఎవరుంటారు చెప్పండి. కాబట్టి మీ భాగస్వామితో మీ బంధం బలంగా మారడానికి ఇలాంటి మాటలను వాడండి.

సరదాగా ఆటపట్టించండం..

సరదాగా ఆటపట్టించండం..

జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ పర్సనాలిటీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, సరదాగా ఆటపట్టించుకుంటూ ఉండే జంటలు ఎల్లప్పుడూ వారి సంబంధంలో చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడటానికి ఇదొక గొప్ప మార్గం కూడా. అయితే మీరు మీ భాగస్వామిని ఎక్కువగా అలా చేయడం మంచిది కాదు. కేవలం కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చేయాలి.

‘నా మరదలిని మరచిపోలేకపోతున్నా.. తన మీదే ద్యాసంతా.. కానీ నా భార్య...'

ఇద్దరూ ఒకేసారి..

ఇద్దరూ ఒకేసారి..

మీరిద్దరూ రొమాన్స్ చేసే సమయంలో ఒకేసారి పడకగదిలోకి ప్రవేశించాలి. అదే సమయంలో ‘ఈరోజు నీ కళ్లు ఎంతో అందంగా ఉన్నాయి. అక్కడ చూస్తూ రోజంతా ఉండిపోవచ్చు. నువ్వు ఎలా ఇంత సెక్సీగా తయారయ్యావ్? నాకు కూడా ఆ రహస్యమేంటో చెప్పవా? నువ్వు నన్ను అలా చూడకు.. అలా చేస్తే నా గుండె గట్టిగా కొట్టుకుంటుంది. నువ్వు ఇన్ని విషయాలు ఎలా నేర్చుకున్నావు.. ఎక్కడ నేర్చుకున్నావు' అనే మాటలు మీ ఇద్దరి మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుంది.

కలిసే పనులు చేయాలి..

కలిసే పనులు చేయాలి..

మీ భాగస్వామితో కలిసి పనులను చేయడం మీ రిలేషన్ షిప్ కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంటి పనులలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య రొమాన్స్ చేసుకోవడానికి మార్గం సులభమవుతుంది. ఇలాంటి అలవాట్ల వల్ల మీ సంబంధంలో స్నేహం పెరుగుతుంది. ఇలాంటి స్నేహపూర్వక సంబంధంతో మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది.

భాగస్వామిని ఊహించుకుంటూ..

భాగస్వామిని ఊహించుకుంటూ..

ఎవరైతే జంటలు తమ భాగస్వామి గురించి అనునిత్యం ఊహించుకుంటూ ఉంటారో.. వారి గురించి అద్భుతమైన మాటలు ఎవరైతే చెబుతారో.. అలాంటి వారి బంధం జీవితాంతం ఆనందంగా సాగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు, మీ ఇద్దరి మధ్య లైంగిక మరియు లైంగికేతర సంబంధాలను పెంపొందిచే కార్యకలాపాలలో పాల్గొనడానికి కూడా మీరు చాలా ఎక్కువ ఆసక్తి చూపుతారు.

English summary

Relationship Habits That Can Predict If You Will Stay Together

Here we are talking about the relationship habits that can predict if you will stay together. Read on,