Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఈ సమయాల్లో శృంగారంతో బంధం చీలికలు.. శారీరకంగా దూరంగా, మానసికంగా దగ్గరగా ఉండాలి
శృంగారం ఎంతో మధురమైనదైనా కొన్ని సమయాల్లో శృంగారానికి దూరంగా ఉండాలని చెబుతారు వైద్యులు. అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొనవద్దని సూచిస్తున్నారు. ఎలాంటి సమయంలో శృంగారంలో పాల్గొనవద్దో ఇప్పుడు చూద్దాం.
శృంగారం ఇద్దరు భాగస్వాముల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇద్దరు దంపతుల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటే అంత బాగా శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. శృంగారం మధురమైన అనుభూతి. ఒకవైపు శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఎన్నో ఆరోగ్య, మానసిక ప్రయోజనాలు పొందవచ్చు. ఒత్తిడి దూరం అవుతుంది, సాన్నిహత్యం పెరుగుతుంది, దంపతుల మధ్య దూరం తగ్గుతుంది, ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శృంగారం అంటే శారీరకంగా మాత్రమే ఒకటైపోవడం కాదు మానసికంగా కూడా పెనవేసుకుపోయినప్పుడే అసలైన శృంగారం అనిపించుకుంటుంది.

శృంగారం ఎంతో మధురమైనదైనా కొన్ని సమయాల్లో శృంగారానికి దూరంగా ఉండాలని చెబుతారు వైద్యులు. అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొనవద్దని సూచిస్తున్నారు. ఎలాంటి సమయంలో శృంగారంలో పాల్గొనవద్దో ఇప్పుడు చూద్దాం.

గొడవను ఆపడానికి
దాంపత్య బంధంలో గొడవలు సాధారణం. ప్రతి ఇంట్లోనూ కలహాలు ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో యాంత్రిక శృంగారం మంచిది కాదని సూచిస్తున్నారని వైద్యులు. గొడవ సద్దుమణిగి శృంగారంలో పాల్గొనడం మంచిదే కానీ సంఘర్షణను నివారించడానికి శృంగారం చేయడం మంచిది కాదు.
ఇలాంటి సమయంలో శృంగారం చేయడం వల్ల అది యాంత్రికంగా ఉంటుంది. శృంగారం అనేది మనస్ఫూర్తిగా అనుభూతి చెందాల్సిన కార్యం. దానిని యాంత్రికంగా మారిస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఎదుటివారి సమ్మతి లేకుండా చేసే పనిలో ఒకరు తృప్తి పొందుతారు కావొచ్చు. కానీ శృంగారం అంటే ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఒక్కటైపోవడం.

మత్తులో ఉన్నప్పుడు
కొన్ని జంటలు ఇద్దరు కలిసి మద్యం సేవించి శృంగారం చేయాలనుకోవచ్చు. అది వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకరు ఆల్కహాల్ తాగి మరొకరి మీద పడిపోవడం వల్ల శృంగారం అంటే చికాకు మొదలవుతుంది.
మందు తాగి లేదా డ్రగ్స్, గంజాయి లాంటివి తీసుకుని ఆ మత్తులో పార్ట్‌నర్‌తో శృంగారం చేస్తే అది వారికి సంతృప్తిని అందించదు.

UTIల నుండి కోలుకుంటున్నప్పుడు
యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేదా దాని నుండి కోలుకుంటున్న సమయంలో శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. యాంటీ బయాటిక్స్ పూర్తి చేసి కనీసం రెండు వారాల పాటు రోగ లక్షణ రహితంగా ఉండే వరకు శృంగారం చేయకపోవడం మంచిది.
లేకపోతే UTI మరింత ముదిరే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో శృంగారం చేయడం వల్ల నొప్పి, అసౌకర్యం ఉంటుంది.

గర్భధారణ సమయంలో..
సాధారణంగా గర్భధారణ సమయంలో కూడా శృంగారం చేసుకోవచ్చు. గర్భంలోని పిండం అమ్నియోటిక్ శాక్, గర్భాశయాన్ని అడ్డుకునే మ్యూకస్ ప్లగ్ ద్వారా రక్షించబడుతుంది. అందుకే గర్భధారణ సమయంలో శృంగారం చేసుకోవచ్చు. అయితే కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఉండాలి.
అయితే గర్భధారణ సమయంలో శృంగారం చేసుకోవడానికి అన్ని ఓకేనా లేదా అనే వైద్యులను సంప్రదించడం మంచిది.

బలవంతం వద్దే వద్దు..
ఒత్తిడితో, బలవంతంతో చేసే శృంగారం శృంగారమే కాదు. ఇద్దరూ ఇష్టపడే శృంగారం మొదలు పెట్టాలి. ఒకరి బలవంతం ద్వారా చేసే శృంగారంలో ఒకరి తృప్తి మాత్రమే ఉంటుంది.
శృంగారంలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉండాలి. ఒకరి కోరికలను మరొకరు తీరుస్తూ ముందుకు సాగాలి. అప్పుడే అది ఆరోగ్యకరమైన శృంగారం అవుతుంది.



Click it and Unblock the Notifications