Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చాలా మంది పురుషులు భాగస్వామితో మొదటి కలయికలో చేసే శృంగార తప్పులు
పెళ్లైన మొదటి రాత్రి వేళ చాలా మంది పురుషులు కొన్ని తప్పులు చేస్తుంటారు. చాలా మందికి అవి తప్పులని తర్వాత తెలిసి వస్తుంది. అలాంటి తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. కొన్ని తప్పులు చాలా మంది చేస్తారు. కొందరు అది తప్పని తెలియక చేస్తారు, మరికొందరు తప్పని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో చేస్తుంటారు. సంబంధంలో కూడా తప్పులు జరుగుతుంటాయి. జీవిత భాగస్వామి విషయంలో కొన్ని తప్పులు జరుగుతాయి.

పెళ్లైన మొదటి రాత్రి వేళ చాలా మంది పురుషులు కొన్ని తప్పులు చేస్తుంటారు. చాలా మందికి అవి తప్పులని తర్వాత తెలిసి వస్తుంది. అలాంటి తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

భార్య ఉద్రేకాన్ని అంచనా వేయలేకపోవడం:
పెళ్లికి ముందు చాలా మంది శృంగార వీడియోలు చూస్తుంటారు. పోర్న్ వీడియోలు చాలా ఎక్కువగా చూస్తారు. టీనేజ్‌లో ఈ వీడియోలకు ఆకర్షితులయ్యే వారు చాలా మంది ఉంటారు.
అయితే ఈ వీడియోల్లో ఉండేవే నిజమని చాలా మంది తప్పుగా అనుకుంటారు. పోర్న్‌లో ఉద్రేకాన్ని వ్యక్తం చేయడం విపరీతంగా ఉంటుంది. అచ్చం అలాగే నిజ జీవితంలోనూ ఉంటుందని భావిస్తారు కొందరు వ్యక్తులు. కానీ వాటికి నిజజీవితానికి ఎంతో తేడా ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసి వస్తుంది.
జీవిత భాగస్వామితో మొదటి రాత్రి వేళ భార్య ఉద్రేకాన్ని తప్పుగా అంచనా వేస్తుంటారు.

షేవ్ చేసుకోకపోవడం:
జననేంద్రియాల వద్ద క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యానికి, సాన్నిహిత్యానికి ప్రధానం. వ్యక్తిగత శుభ్రత పాటించడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం ఎవరికీ నచ్చదు. జీవితభాగస్వాములు కూడా వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడాన్ని ఇష్టపడరు.
కాబట్టి జీవిత భాగస్వామితో శృంగారం చేసే ముందు వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారో లేదో చూసుకోవడం మర్చిపోవద్దు.

పని అయ్యాక పక్కన తిరిగి పడుకోవడం:
శృంగారం విషయంలో పురుషులు త్వరగా సంతృప్తి చెందుతారు. కానీ మహిళలు శృంగారంలో సంతృప్తి చెందడానికి ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. శృంగారంలో భావప్రాప్తి చాలా ముఖ్యం. భావప్రాప్తి శృంగారానికి చాలా కీలకం.
భాగస్వామి భావప్రాప్తి అయ్యే వరకు శృంగారం చేయాలని చాలా మంది కోరుకుంటారు. కానీ చాలా మంది పురుషులు అంత సేపు శృంగారం చేయలేరు. అయితే కొన్ని కొన్ని చిట్కాల వల్ల శృంగారంలో సంతృప్తి చెందవచ్చు. ఫోర్ ప్లే, ప్లే, పోస్టు ప్లే అనే దశలను సక్రమంగా పాటిస్తే శృంగారం అద్బుతంగా ఉంటుంది.

ఆల్కహాల్ తాగి మత్తులో చేయడం:
వివాహం ఎన్నో కోరికలతో ముడిపడి ఉంటుంది. పెళ్లి, పెళ్లి తర్వాత జరిగే మొదటి రాత్రికి కోరికలు, ఆశలకు సంబంధం కలిగి ఉంటుంది. కానీ కొంత మంది పరుషులు మద్యం సేవించి మొదటి రాత్రి జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొంటారు.
ఆల్కహాల్ తాగడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుందని తప్పుగా భావిస్తారు. భాగస్వాములు ఇద్దరూ ఏకమై చేయాల్సిన శృంగారాన్ని మద్యం మత్తులో చేయడం వల్ల దానిలోని మాధుర్యం తెలియదు. అలాగే మత్తులో దురుసుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. ఈ ప్రవర్తన వల్ల భాగస్వాముల మధ్య సమస్యలు రావొచ్చు.

ఫోర్‌ప్లే చేయకపోవడం:
పెళ్లి జరిగిన తర్వాత మొదటి రాత్రి ఎన్నో కోరికలతో ఉంటారు భాగస్వాములు. కోరికలతో పాటు కొన్ని భయాలు, ఆందోళన కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో మహిళలను శృంగారానికి ప్రేరేపించడం చాలా ముఖ్యం. ఆ పని చేయకుండా డైరెక్ట్‌గా శృంగారం చేయడం వల్ల సంతృప్తి చెందలేరు.
స్త్రీ పురుషులు ఇద్దరికీ ఫోర్‌ప్లే చాలా ముఖ్యం. ఫోర్ ప్లేతో దంపతులు ఇద్దరిలో శృంగారం కావాలన్న కోరిక మొదలవుతుంది. మొదట మహిళల్లో కోరిక తీసుకురావడం ముఖ్యం. అందుకే ఫోర్‌ప్లే చేయాలని నిపుణులు సూచిస్తుంటారు.



Click it and Unblock the Notifications