Latest Updates
-
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ!
మీ భాగస్వామిని ముద్దుల్లో ముంచెత్తే ముందు ఈ విషయాలను మరవొద్దు సుమా...!
మీ భాగస్వామిని ముద్దులో ముంచెత్తే ముందు ఈ నియమాలను పాటించండి. మీ రొమాన్స్ ను ఎంజాయ్ చేయండి.
ఈ విశ్వంలో ఎవరైనా సరే.. ఎలాంటి బంధమైన సరే.. ఎదుటివారికి తమ ప్రేమను వెల్లడించేందుకు ముద్దు అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మీ భాగస్వామిపై మీకు ప్రేమ ఉందని తెలిపేందుకు ఈ ముద్దు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది.

అంతేకాదు మన జీవితంలో వారు ఎంతగా అవసరమో తెలిపేందుకు ముద్దు అనేది ఏకైక మార్గం అనడంలో అతిశయోక్తి కాదేమో. అయితే ఇది కేవలం ఫీలింగ్స్ గురించో లేక వాటి వ్యక్తీకరణ గురించో కాదు.. ఇలా కిస్ చేయడంలో మానసికంగా, శారీరకంగా ఎన్నో లాభాలున్నాయి.

ఇలా ముద్దులు పెట్టడం వల్ల మీ బంధం మరింత బలపడటమే కాదు.. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని కూడా పెంచుతుంది. అయితే ఇప్పటివరకూ ఎవరినీ ముద్దు పెట్టుకోని వారైనా లేదా కొత్తగా పెళ్లి చేసుకుని పడకగదిలో రొమాన్స్ కోసం వేచి చూసే వారి కోసం కొన్ని రకాల ముద్దులు మూడ్ ను పెంచుతాయి.
అయితే మీరు మీ భాగస్వామిని ముద్దు పెట్టే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ముద్దు పెట్టుకునే సమయంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదు అనే విషయాలను తెలుసుకోవాలి.

చేతలను బట్టి..
మీ భాగస్వామి లేదా మీకు ఎంతదగ్గరి వారైనా సరే.. మీరు ముద్దు పెట్టే ముందు కచ్చితంగా వారి అనుమతి తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎదుటివారు అన్ని సందర్భాల్లో నోటితోనే సరే అని చెప్పాలని రూలేం లేదు. వారి చేతలను బట్టి కూడా వారిని ముద్దు పెట్టుకోవడం ఇష్టమే అని తెలుసుకోవాలి. అలా కాకుండా మీరంటే వారికి ప్రేమ లేదా ఇష్టమే కదా అని పదేపదే ముద్దు పెట్టేందుకు ముందడుగు వేయడం మంచిది కాదు..

ముద్దు పెట్టే ముందు..
మాములు టైమ్ లో మన నోటి నుండి దుర్వాసన అనేది సాధారణంగానే వస్తూ ఉంటుంది. అలాంటిది మీరు కిస్ చేసే సమయంలో కూడా ఇలాంటి వాసన వస్తే ఇంకా అసహ్యంగా ఉంటుంది. అందుకే ముద్దు పెట్టుకోవడానికి ముందు మీ నోటి నుండి ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోండి. నాణ్యమైన బ్రష్, మౌత్ వాష్ ఇలాంటి వాటిని ఏవైనా ఉపయోగించి వాసనను అరికట్టండి. అంతేకాదు ముద్దు పెట్టడానికి ముందు ఎలాంటి వాసన వచ్చే ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది.

అది ఓకే కానీ..
మీరు మీ నోటి వెంట వాసన రాకుండా ఉండేందుకు మీరు చూయింగ్ గమ్ లేదా మింట్ వేసుకోవడం మంచిదే కానీ ముద్దు పెట్టడానికి ముందు దాన్ని ఊసేయడం బెటర్. లేదంటే మీ నోట్లో ఉన్న ఈ గమ్ వల్ల మీరు కిస్ చేసే సమయంలో చిరాకు తెప్పిస్తాయి.

వాటిపై శ్రద్ధ పెట్టండి..
మీరు ముద్దు పెట్టుకునే ముందు మీ పెదాలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే పగిలిన పెదాలు లేదా పెదాల పొర చిరగడం లేదా రక్తం కారడం వంటివి జరిగితే ముద్దు పెట్టకండి. కాబట్టి మీ పెదాలపై ఎక్కువ కేర్ తీసుకోండి. ఎప్పటికప్పుడు మీ పెదాలను ఎక్స్ ఫోలియేట్ చేసుకుంటూ బామ్ రుద్దుకుంటూ వాటిని అందంగా ఉండేలా చూసుకోండి. దీంతో అవతలి వారికి మీ పెదాలను చూడగానే ముద్దివ్వాలన్న కోరిక పుడుతుంది.

మూడ్ రావాలంటే...
మీరు ఎదుటి వారికి కిస్ చేసే సమయంలో మూడ్ రావాలంటే వారిని మీ చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ముఖ్యంగా మీ చేతులను ఎదుటి వారి తలలో ఉంచి నిమరడం వల్ల మీకు మరింత మూడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కాస్త పొట్టిగా ఉండి తలలో చేయి పెట్టడం కుదరకపోతే.. భుజాలపై లేదా నడుముపై చేతులు ఉంచి అవతలి మనిషిని బంధిస్తే సరిపోతుంది.

సరైన ప్రదేశం..
మీరు మీ భాగస్వామిని కిస్ చేసేందుకు ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే లా కిస్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు కిస్ పెడుతున్నప్పుడు మీరు సరైన ప్రదేశంలో ఉన్నారా? మీ చుట్టూ వాతావరణంతో పాటు మీ మూడ్ కాస్త రొమాంటిక్ గా ఉండేలా చూసుకోవాలి.

జలుబు ఉన్నప్పుడు..
మీకు జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం వంటివి చేయకండి. దీని వల్ల తర్వాత ఇబ్బందులు తలెత్తుతాయి.

ఆనందంగా ముద్దుల్లో..
మీరు ముద్దు పెట్టడం అనేది మీ పార్ట్ నర్ కు ఇష్టమో కాదో అనేది వారి రియాక్షన్ ను బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి వారు సంతోషంగా మూలుగుతూ ఉంటే.. అప్పుడు మీరు మీ భాగస్వామిని ముద్దుల్లో ముంచెయ్యండి...

వీటిని అస్సలు వాడకండి..
మాములుగా సినిమాల్లో కిస్ చేసే సమయంలో కొంతమంది పళ్లతో కొరకడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది చూడటానికి రొమాంటిక్ గా అనిపించినా.. నొప్పి సహించేవారికి అది తగ్గే వరకూ తిరిగి ముద్దు పెట్టుకోవాలనే ఆలోచనే రాదు. అందుకే మీరు కిస్ చేసే సమయంలో మీ పళ్లను అస్సలు వాడకండి.

గాఢమైన ముద్దు వద్దు..
చాలా మంది తమ భాగస్వామి ఓకే చెప్పేసిందని ఓ తెగ మీద పడిపోతుంటారు. గాఢంగా ముద్దులు పెడుతుంటారు. కానీ ప్రారంభంలో ఇది సరైంది కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉందని మీరు గుర్తుంచుకోవాలి. ముందుగా నెమ్మదిగా ప్రారంభించి తర్వాత గాఢంగా కిస్ చేయాలి తప్ప ఒకేసారి మీద పడిపోకూడదు.

అవి ఫాలో అవ్వండి..
మీరు మీ భాగస్వామిని ముద్దు పెట్టే ముందు వారి ఇష్టాలను ఫాలో అవ్వండి. అలాంటివి తెలుసుకున్నప్పుడే మీరు మరింత ఎంజాయ్ చేస్తారు.

అవొక్కటే కాదు..
చాలా ముద్దంటే కేవలం పెదాల వరకే అనుకుంటారు. అయితే మీ భాగస్వామిలో మీకు నచ్చిన ప్రాంతంలో కిస్ చేయొచ్చు. ముఖ్యంగా వారి మెడ, చెవులు, చెంపలు ఇలా మీకిష్టమైన ప్లేసుల్లో కిస్ చేయాలి. దీని వల్ల మీ ఇద్దరికీ మంచి మజా వస్తుంది.

తప్పుగా అనుకోకండి.
ఈ విశ్వంలో ఎవరికైనా ఏ పని అయినా తొలిసారి వచ్చేయదు. అలాగే మీరు ముద్దు పెట్టడంలో కూడా తొలిసారే ఎక్స్ పర్ట్ కాలేరు. కాబట్టి మీ భాగస్వామి ముద్దు ఇలా వద్దు అని, మరోలా కావాలని అడిగితే, అలానే ప్రయత్నించండి. తప్పుగా మాత్రం అనుకోవద్దు..



Click it and Unblock the Notifications
