Latest Updates
-
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
సమంత తొలిచూపులోనే పడిపోయిందట.. కానీ చైతూనే ఆలస్యం చేశాడట...!
అమ్మాయిలు నాగచైతన్య లాంటి అందమైన అబ్బాయి భర్తగా తనకు కావాలి.. అని కోరుకునేలా వారిద్దరి కెమిస్ట్రీ బాగా కలిసిపోతుంది.
మన దేశంలో సెలబ్రెటీల లవ్ స్టోరీలు అంటే ఎవ్వరికైనా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ప్రేమ కథలు ముందుగా రుమార్స్ లేదా గాసిప్స్ నుండి మొదలవుతాయి. మొదట్లో అటు హీరో నుండి గానీ.. ఇటు హీరోయిన్ నుండి ఎలాంటి క్లారిటీ ఉండదు.

కానీ మీడియాలో.. సోషల్ మీడియాలో మాత్రం ఒకటే గాసిప్స్ వస్తుంటాయి. అలాంటి కోవకే చెందినదే చైసామ్ ప్రేమ కథ కూడా. ఈరోజు సమంత పుట్టినరోజు సందర్భంగా చాలా మందికి ఇష్టమైన టాలీవుడ్ పెయిర్ చైసామ్ ప్రేమ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లికి ముందు..
సమంత-నాగచైతన్య జంట ‘ఏ మాయ చేసావే‘ తర్వాత మంచి స్నేహితులుగా మారారట. అప్పటి నుండి ఎప్పుడు పడితే అప్పుడు బయట పార్టీలకు, విహార యాత్రలకు వెళ్లేవారట. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని అప్పటి నుండే గాసిప్స్ మొదలయ్యాయి. ఆ సమయంలో వారిద్దరూ తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పకపోవడంతో చాలా మంది అనుమానాలు నిజమయ్యాయి.

అల్లరి పిల్ల అనుకున్నాడట..
నాగ చైతన్య తన ప్రేమకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాడు. ‘‘మా ఇద్దరి మొదటి సినిమా ఏ మాయ చేశావే. నేను మొదట సినిమా షూటింగులో తనని చూసి చాలా అల్లరి పిల్ల అనుకున్నా. తనంటే నాకు అప్పటి నుండే ఇష్టం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా. నేను అప్పుడు తనను ఒక స్నేహితురాలిగానే చూశాను.

చైతూని చూసినప్పుడే..
సమంత తనను తొలిసారి సినిమా షూటింగులో చూసిందట. ‘‘నిన్ను చూసినప్పుడే లవ్ లో పడిపోయాను. నువ్వే ఆలస్యం చేశావు. నాది ఎనిమిదేళ్ల ప్రేమ‘‘ అంటూ తనను ఆట పట్టిస్తూ ఉంటుందట. అది ఎంతవరకు నిజమన్న సంగతి తనకు కూడా తెలీదంట.

అన్ని విషయాలు పంచుకునేవాళ్లం..
తొలి నుండి మేం స్నేహితులం కాబట్టి అన్ని విషయాలను పంచుకునేవాళ్లం. అలా ఎప్పుడూ స్నేహితుల నుండి ప్రేమికులు మారిపోయామో నాకే తెలీదు. మా పెళ్లికి ముందు ఒక సంవత్సరం పాటు మేమిద్దరం సాధారణంగా కంటే కాస్త ఎక్కువగా కలిసి బయట తిరిగాం. అలా వెళ్లిన సమయంలో ఓ సారి నాకు ఇలా అనిపించింది.

మంచి అమ్మాయి దొరుకుతుందా?
‘ఎలాగో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా కదా. ఇంతకంటే మంచి అమ్మాయి నాకు దొరుకుతుందా?‘ అని సాధారణంగా పెద్దవారు అంటూ ఉంటారు కదా. ‘తెలియని దేవత కంటే తెలిసిన రాక్షసి నయం‘ అని నాకు తెలిసిన రాక్షసి సమంతనే పెళ్లి చేసుకున్నా.

తన అల్లరి పనులన్నీ తెలుసు
పెళ్లికి ముందు, తర్వాత సమంత చేసే చేసిన అల్లరి పనులన్నీ నాకు తెలుసు. కానీ అవన్నీ నాకు నవ్వు తెప్పిస్తుంటాయి. తనపై ఉన్న ప్రేమను మరింత పెంచుతాయి. అందుకే తనంటే రోజు రోజుకీ ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది.

నన్ను నవ్విస్తూ ఉండాలి..
నాకు ఇంట్లో నా భార్య నాకు మద్దతు ఇస్తూ, ఎప్పుడూ తను నవ్వుతూ నన్ను నవ్విస్తూ ఉండాలి. అలా ఉంటే చాలు. పని, డబ్బు మిగిలినవన్నీ సెకండరీ నాకు. అందుకే పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నా. క్లోజ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడం ఇంత ఆనందం ఉంటుందని నాకు ముందుగా తెలీదు.

అవి అర్థమయ్యేవి కావు..
పెళ్లికి ముందు బంధాలు, బంధావ్యాల గురించి నాకు చాలా విషయాలు అర్థమయ్యేవి కావు. అంతకుముందు ఖాళీ సమయం దొరికితే చాలు బయటకు వెళ్లాలనుకునే వాడిని. ఇంట్లో ఉండటం అనేది ముసలోళ్లు చేసేపని అనుకునే వాడిని. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా తనతో ఎక్కువ సమయం గడపాలనిపిస్తోంది. పెళ్లి అయిపోయాక నేను అంతలా మారిపోయాను.

తక్కువ మందినే పిలిచాం..
మా పెళ్లికి మాతో బాగా సన్నిహితంగా ఉన్నవారే హాజరవ్వాలని అనుకున్నాం. అందుకే అతి కొద్ది మందిని మాత్రమే పిలిచి మరీ పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు మా ప్రేమను చాటుకునేలా మేం ఇద్దరం మోర్స్ కోడ్ లో మా పెళ్లి తేదీని టాటూ కూడా వేయించుకున్నాం. ఆ పని కూడా మా పెళ్లిరోజే చేశాం‘ అంటూ తమ ప్రేమ, పెళ్లి జీవితం గురించి వివరించాడు నాగచైతన్య.

ఇప్పటికీ తోడున్నాడు..
అయితే సమంత తమ ప్రేమ గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘తెలుగులో తొలి సినిమా నుండి ఇప్పటివరకూ నా జర్నీలో చైతూ తోడున్నాడు. నాగురించి నాకే తెలియని రోజులవి. నేను చాలా వీక్ అనుకునే రోజులవి. అప్పట్లోనే నా గురించి తెలుసుకుని..నన్ను అర్థం చేసుకుని.. నా శక్తిని తెలుసుకుని నేటికీ నాకు తోడుగా ఉన్నాడు. అందుకే తనంటే మొదటి నుండి నాకు ఎంతగానో ఇష్టం.




Click it and Unblock the Notifications
