For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రహస్యాలను మీ పార్ట్ నర్ తో ఎప్పటికీ షేర్ చేసుకోవద్దు...

|

ఆలుమగలు లేదా ప్రేమికుల మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలని చాలా మంది భావిస్తారు. కొందరైతే దంపతులిద్దరీ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదని, ప్రతి విషయాన్నీ షేర్ చేసుకోవాలని చెబుతూ ఉంటారు.

ఇలాంటి మాటలు నమ్మి మీరు మీ భాగస్వామి వద్ద ప్రతి విషయాన్ని షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఇలాంటి రహస్యాల వల్ల మీ కాపురంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా మీకు అనుకూలంగా మీ పార్ట్ నర్ మిమ్మల్ని నెగిటివ్ గా చూసే అవకాశం ఉంది. వారికి మీ గురించి పూర్తిగా తెలిసినప్పటికీ, కొన్ని విషయాలను మాత్రం సీక్రెట్ గానే ఉంచాలి.

కొందరు తమ భాగస్వాముల గతాన్ని తెలుసుకునేందుకు వారి రహస్యాలను చెబుతున్నట్టు నటిస్తారు. నాకు ఇలాంటి పాస్ట్ ఉంది. నీ లైఫ్ లో ఎలా ఉంది అని.. మనం ఓపెన్ గా ఉందాం అని చెప్పగానే.. చాలా మంది తమ సీక్రెట్లను చెప్పేస్తుంటారు. అయితే అవి ఆ సమయంలో మంచిగా అనిపించినా ఫ్యూచర్లో అవి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

ఎందుకంటే ఆ సీక్రెట్లలో ఏదైనా విషయంలో వారికి పట్టు దొరికితే వారు దాన్ని అలుసుగా తీసుకుని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అంతేకాదు అవి అనుమానాలకు కూడా దారి తీస్తాయి. భార్యభర్తలు లేదా సహజీవనం చేసే జంటల మధ్య కొన్ని సీక్రెట్లు మనస్పర్దలకు దారి తీస్తాయి. అందుకే కొన్ని రహస్యాలను మీ భాగస్వామితో ఎప్పటికీ షేర్ చేసుకోవద్దు. ఇంతకీ ఆ రహస్యాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

True Love : అనుకోకుండా లిఫ్టులో కలిశా.. నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా.. ఆ వెంటనే తను నా చెయ్యి పట్టుకుని...!

మీ ఎక్స్ తో కాంటాక్టులో..

మీ ఎక్స్ తో కాంటాక్టులో..

మనలో కొంత మంది వివాహం జరిగిన తర్వాత కూడా తమ ఎక్స్ లతో కాంటాక్ట్ లో ఉంటారు. పెళ్లి జరిగి పిల్లలు పుట్టినప్పటికీ, తమ ఎక్స్ తో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తుంటారు. ‘Friends with Benefits' తరహా స్నేహాన్ని కొనసాగిస్తారు. అయితే ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో మీ పార్ట్ నర్ కు తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ మాజీ లవర్స్ తో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నా కూడా.. మీ పార్ట్ నర్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారితో మీరు ఈ విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

ఎగతాళి చేయకండి..

ఎగతాళి చేయకండి..

ఈ లోకంలో ఏ మనిషి పరిపూర్ణం కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం అనేది కచ్చితంగా ఉంటుంది. దాని గురించి మాట్లాడటానికి ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి మీరు కూడా మీ భాగస్వామి ఫేస్, బాడీ గురించి ఎలాంటి ఎగతాళి చేయకండి. దాని వల్ల వారు చాలా బాధపడతారు. మరికొందరు దీన్ని కోపం లేదా ఇతర రూపాల్లో చూపుతారు. అలాంటి విషయాలను తమలోనే దాచుకుని, మీ పార్ట్ నర్ క్రమేనా మీకు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు మీ మీద అప్పటివరకు ఉన్న మంచి అభిప్రాయాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే బయటి వ్యక్తులకు నచ్చినా, నచ్చకపోయినా.. మన భాగస్వామికి నచ్చితే చాలాని చాలా మంది అనుకుంటారు. అదే లిస్టులో మీరు కూడా ఉంటారనే విషయాన్ని మరచిపోవద్దు.

కంపేర్ చేయడం..

కంపేర్ చేయడం..

ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. అయితే జంటలు ప్రతి విషయాన్ని ఇతరులతో పోల్చి చూసుకోవడం.. అక్కడితో ఆగకుండా ఆ విషయాలను భాగస్వామితో చెబితే.. మీ రిలేషన్ షిప్ లో ఇబ్బందులు రావచ్చు. దీని వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థం పెరగొచ్చు.

మగాళ్లు ఎంత అందంగా ఉన్నా.. అలా ఉంటే ‘ఆ' కార్యం కష్టమంటున్న అమ్మాయిలు...!

‘ఆ’ రహస్యాలు చెప్పకండి..

‘ఆ’ రహస్యాలు చెప్పకండి..

ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ యవ్వనంలోకి వచ్చాక రొమాన్స్ చేయాలని ఆశలు, కోరికలు కచ్చితంగా పెరుగుతాయి. అందుకే చాలా మంది ఆ వీడియోలు, సినిమాలను ఎక్కువగా చూసి, స్వయంగా అనుభూతి పొందుతూ ఉంటారు. అయితే అలాంటి విషయాలను తమ పార్ట్ నర్ తో ఎప్పటికీ బయటకు చెప్పకూడదు. ఇలాంటి వాటిని చాలా సీక్రెట్ గా ఉంచాలి. ఎందుకంటే ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం కాబట్టి. ఒకవేళ మీ ఫోనులో లేదా సిస్టమ్ లో దానికి సంబంధించిన ఏదైనా హిస్టరీ ఉంటే కూడా వెంటనే డిలీట్ చేయడం మంచిది.

రొమాన్స్ విషయంలో..

రొమాన్స్ విషయంలో..

మీ భాగస్వామి మీరు కోరుకున్న విధంగా రొమాన్స్ లో పాల్గొనలేకపోవచ్చు. అయితే, దీనిపై మీరు పదే పదే విమర్శ చేస్తూ, వారిని ఇబ్బందికి గురి చేయకండి. ఎందుకంటే మీరు అలాగే చేస్తే, వారి అహం దెబ్బతింటుంది. ఒకవేళ మీరు మీ రొమాన్స్ అనుభవాలను ఉదాహరణగా చూపించి ఏదైనా టిప్స్ చెప్పేందుకు ప్రయత్నిస్తే, మీరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. కాబట్టి.. వీలైనంత వరకు ఇద్దరికి నచ్చిన విధంగానే రొమాన్స్ చేయండి. ఈ విషయంలో ఎలాంటి విమర్శలు.. హేళన చేసుకుంటే మీ బెడ్ రూమ్ రొమాన్స్ ఎండ్ కార్డు పడ్డట్టే.

అలా మాట్లాడకండి..

అలా మాట్లాడకండి..

పెళ్లయిన జంటల్లో సాధారణంగా గొడవలన్నీ అత్తింటి వారి నుండే వస్తాయి. ముఖ్యంగా కొందరు భర్తలు ఎక్కువగా భార్యల బంధువులను విమర్శిస్తుంటారు. వారు అలా విమర్శించడానికి అక్కడి ప్రతికూల పరిస్థితులు కూడా కారణం కావచ్చు. ఏది ఏమైనా.. తల్లిదండ్రులను ఎవరైనా విమర్శిస్తే ఎవరూ సహించలేరు. కాబట్టి.. మీ భాగస్వామి కుటుంబీకులను గౌరవించండి. ‘మీ తల్లిదండ్రులంటే నాకు అస్సలు ఇష్టం లేదు' అని మాటను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకండి.

English summary

Secrets You Should Never Tell Your Partner in Telugu

Here are these secrets you should never tell your partner in Telugu. Take a look
Story first published: Friday, February 5, 2021, 13:50 [IST]