Latest Updates
-
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.!
దొరికిన లోదుస్తుల దొంగ... కోరికలు తీర్చుకోవడానికే ఆ పని చేశాడంట...
వరుసగా అమ్మాయిల లోదుస్తులను దొంగిలిస్తున్న దొరకడంతో 23 వారాల పాటు జైలు శిక్ష వేశారు. ఇంతకీ తను ఆ పని ఎందుకు చేశాడో తెలుసుకోండి.
ఈ విశ్వంలో ఎలాంటి దొంగలైనా తాళం ఇళ్లపై నిఘా పెట్టడం.. ఆ ఇంట్లోని నగదును, నక్లీసులను లేదా ఇతర వస్తువులను ఎత్తుకెళ్లడం అనేది సర్వసాధారణమైన విషయమే.

అయితే ఓ దొంగ మాత్రం విచిత్రంగా అమ్మాయిల లోదుస్తులను దొంగిలించేవాడు. అలా వరుసగా చాలా మంది ఇళ్లలోని అమ్మాయిలకు సంబంధించి బ్రా, ప్యాంటీలను దొంగిలించి తన కోరికలను తీర్చుకునేవాడట..

ఇదిలా ఉండగా ఆ కొంటె దొంగను పోలీసులు మాటు వేసి ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ చిలిపి పని ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించగా అతను కొన్ని విచిత్రమైన సమాధానాలు చెప్పాడంట. ఇంతకీ ఆ చిలిపి దొంగ ఏమి చెప్పాడు.. కేవలం ఆ పని కోసమే దొంగతనం చేశాడా? అసలు ఎక్కడ జరిగిందీ సంఘటన అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ వీక్ నెస్..
సింగపూర్ దేశానికి చెందిన లీ చీ కిన్ అనే 19 ఏళ్ల కుర్రాడికి అందరి కంటే కొంచెం ఎక్కువగా అమ్మాయిల వీక్ నెస్ ఉందంట. అందుకే ఎవ్వరికీ తెలియకుండా అమ్మాయిలు ఉండే హాస్టల్స్ లోకి దూరి.. వారి బ్రాలు, ఇన్నర్ వేర్స్ దొంగిలించేవాడంట..

ఎన్ని దొంగతనాలంటే..
వెరైటీ వీక్ నెస్ ఉండే ఈ దొంగ కేవలం ఒకే ఒక్క సంవత్సరంలోనే 34 ఇళ్లలో దొంగతనాలు చేశాడంట. అందులో 32 బ్రాలు, 42 ఇన్నర్ వేర్స్ దొంగిలించాడంట. అయితే పోలీసులకు మరింత లోతుగా విచారించగా అంతకుముందు సంవత్సరంలో 41 బ్రాలు, 42 ఇన్నర్ వేర్స్ దొంగిలించినట్లు అంగీకరించాడు.

అందుకోసమే చేశాడంట..
అయితే పోలీసులు ఈ పాడు పని ఎందుకు చేయాలనిపించింది. ఎందుకు చేశావు అని ప్రశ్నించగా.. తనకు ఆ వీక్ నెస్ ఉందని, వాటితో కోరికలు తీర్చుకోవడానికే ఆ పనిచేశానని, వాటితో తాను భావప్రాప్తి పొందేవాడినని చెప్పాడు.

నిఘా పెట్టడంతో..
అయితే మొదట్లో పోలీసులు వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదంట. కానీ లోదుస్తుల విషయంలో కేసులు వరుసగా పెరుగుతుండటంతో వారు చాలా సీరియస్ గా తీసుకున్నారంట. అలా నిఘా పటిష్టం చేయడంతో ఓ రోజు లోదుస్తుల దొరికిపోయాడంట. వెంటనే తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సింగపూర్ పోలీసులు తెలిపారు.

ఎంత శిక్షంటే..
ఆ కొంటె దొంగను విచారించిన పోలీసులు తన సమాధానాలు విని ఆశ్చర్యపోయారు. ఇక రూల్స్ ప్రకారం ఇటీవలే కోర్టులో హాజరుపర్చగా అతనికి న్యాయస్థానం 23 వారాల పాటు శిక్ష విధించిందట. చూశారు కదా.. సమాజంలో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో... సో అమ్మాయిలూ బీ కేర్ ఫుల్..



Click it and Unblock the Notifications