For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేదం ప్రకారం, ఎన్నిరోజులకొకసారి సెక్స్ లో పాల్గొంటే ఉత్తమ ఫలితాలొస్తాయో తెలుసా...

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, సెక్స్ లో ఎప్పుడెప్పుడు పాల్గొనాలి.. ఏ కాలంలో ఎంతసేపు పాల్గొనాలో తెలుసుకునేందుకు ఇక్కడ ఓ లుక్కుయండి.

|

మనలో చాలా మంది కపుల్స్ శృంగారంలో పాల్గొంటున్నప్పటికీ.. కేవలం కొందరు మాత్రమే ఆ కార్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. కొందరేమో తమ శృంగార జీవితాన్ని ఆస్వాదించేందుకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటారు.

Sexual Wellness Tips According to Ayurveda in Telugu

మరికొందరు హోమ్ రెమెడీస్ ను ఫాలో అవుతూ తమ రొమాంటిక్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తే సెక్స్ జీవితాన్ని ఎంతో ఆనందంగా మార్చుకోవచ్చట.

Sexual Wellness Tips According to Ayurveda in Telugu

ఈ సందర్భంగా ఎన్నిరోజులకొకసారి సెక్స్ లో పాల్గొనాలి.. ఏ కాలంలో శృంగారానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది.. మీ భాగస్వామిలో మూడ్ తెప్పించేందుకు ఏ సమయం ఉత్తమంగా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

First time sex Tips:తొలిసారి శృంగారంలో సక్సెస్ సాధించాలంటే... ఇలా ట్రై చేయండి...First time sex Tips:తొలిసారి శృంగారంలో సక్సెస్ సాధించాలంటే... ఇలా ట్రై చేయండి...

ఎప్పటికీ అలసిపోకుండా..

ఎప్పటికీ అలసిపోకుండా..

ఆడవారైనా, మగవారైనా ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు గుర్రానికి ఉన్నంత సామర్థ్యం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గుర్రం ఎప్పటికీ అలసిపోదు. రాత్రంతా నిలబడే ఉంటుంది. ఎక్కువ సమయం గుర్రం కూర్చొని ఉండదు. అందుకే శక్తికి సంకేతంగా గుర్రాన్ని సంభోదిస్తారు. సంస్కృతంలో గుర్రాన్ని వాజీ అంటారు. వాజీకరణం ప్రకారం.. ఒక పురుషుడు ఒకేసారి పది మంది స్త్రీలతో సెక్స్ లో పాల్గొనేందుకు అవకాశం పొందుతాడట. అంతేకాదు ఒకేసారి వంద మంది స్త్రీలతో సెక్స్ ఎలా చేయాలనే సూత్రాలను కూడా చెప్పారట. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే.. తాము శక్తివంతంగా ఉన్నామని, స్త్రీలను ఎన్నిసార్లైనా సుఖపెట్టగలమని చెబుతారట. అయితే అందుకోసం శరీరాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విధానాలు కూడా చెబుతారట.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం,

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం,

మన బాడీలో ఏడు ముఖ్యమైన కణజాలాలు లేదా ధాతువులు ఉంటాయి. వీటిలో ఒకటి రస ధాతువు. రసా లేదా సీరం లేదా రసం (రక్తంలోని తెల్లటి భాగం). ఈ రసాలలో శుక్రధాతు అని పిలువబడే లైంగిక ద్రవాలు వస్తాయి. అవి ఏర్పడే ప్రక్రియ దాదాపు ఒక నెలరోజుల పాటు ఉంటుంది. శుక్ర ధాతు అనేది రసానికి చాలా శుద్ధి చేయబడిన రూపం. లైంగిక ద్రవాలు లేదా శుక్రధాతు కాబట్టి మన బాడీ నుండి చాలా ప్రయత్నాల ఉత్పత్తులు మరియు ఈ ద్రవాల నుండి ఓజాస్ అని పిలువబడే రసానికి మరింత గాఢమైన రూపం వస్తుంది. ఈ ఓజాస్ జీవితానికి ఆధారం మరియు చాలా శక్తివంతమైనది.

అవి పెరుగుతాయట..

అవి పెరుగుతాయట..

సాధారణంగా రోజూ సెక్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటే.. చురుకుగా ఉంటారు.. క్రియెటివిటీ పెరుగుతుంది.. రోజంతా ఉత్సాహంగా ఉంటారని, శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. అనారోగ్య బారిన పడరని ఆధునిక వైద్యులు చెబుతుంటారు. అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, మీ లైంగిక శక్తిని ప్రభావితం చేసుకోవాలంటే ‘అపానా వాయు' రెగ్యులర్ గా ప్రయత్నించాలి. మన బాడీలో ఉండే ఐదు పవనాలలో ఒకదాన్ని ‘అపానా వాయు' సూచిస్తుంది. ఇది రుతుస్రావం, పునరుత్పత్తి మరియు భావప్రాప్తిని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ వాయు చలనం ఆరోగ్యవంతంగా ఉంటే.. మీరు ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదిస్తారు.

Love Horoscope:ఫిబ్రవరిలో ఈ రాశుల వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుదట...!Love Horoscope:ఫిబ్రవరిలో ఈ రాశుల వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుదట...!

శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలంటే..

శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలంటే..

ఆయుర్వేదం ప్రకారం, సెక్స్ ను ఎప్పుడు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనకు శీతాకాలం, ఎండకాలం, వర్షాకాలం అని మూడు రకాల సీజన్లు ఉంటాయి. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ చాలా త్వరగా అలసిపోతూ ఉంటారు. కేవలం ఒక గంట లేదా రెండు గంటలు పని చేసిన వెంటనే అలసిపోతూ ఉంటారు. దీంతో తమ అలసటను తీర్చుకోవడానికి ఏదో ఒక జ్యూస్ లేదా నీళ్లను తాగేందుకు తాపత్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే శక్తిని సంపాదించుకోవడానికి. వేసవి కాలంలో మనుషుల శక్తి త్వరగా తగ్గిపోతుంది. అందుకే శాస్త్రం ప్రకారం, ఎండాకాలంలో 15 రోజులకొకసారి సెక్స్ లో పాల్గొనాలి.

ఈ కాలంలో ప్రతిరోజూ..

ఈ కాలంలో ప్రతిరోజూ..

వర్షా కాలంలో పిత్తం పెరిగి ఉంటుంది. అసిడిటీ పెరిగి ఉంటుంది. పంటల్లో గానీ.. కూరగాయాల్లో, ఆహార పదార్థాలలో యాసిడ్ పెరిగి ఉంటుంది. ఆ సమయంలో కూడా ఎక్కువగా ఆ కార్యంలో పాల్గొనాలి. అయితే అదంతా వారానికొకసారి పాల్గొంటే మంచిది. అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, హేమంత రుతువు, శిశిర రుతువులలో మాత్రం ప్రతిరోజూ సెక్స్ చేయొచ్చట. దీన్ని బట్టి మనం వాతావరణ పరిస్థితులు.. శరీర సామర్థ్యం తదితర పరిస్థితులను పరిశీలించాలి. అప్పుడే మీరు కోరుకున్న ఆనందాన్ని పొందొచ్చు.

ఎక్కువ సమయం శృంగారంలో..

ఎక్కువ సమయం శృంగారంలో..

భావప్రాప్తి వల్ల మన బాడీపై కలిగే ప్రయోజనాలతో పాటు ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, ఆక్సిటోసిన్ ఉత్పత్తి మరియు మన భాగస్వాములతో అనుబంధాన్ని పెంపొందించడం నుండి శృంగారం అన్ని అద్భుతాలను చేస్తుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం, ఉద్వేగం వల్ల బాడీకి కొంత హానికరంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే శృంగారం మన బాడీలో వాత దోషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మనపై క్షీణించే ప్రభావానికి దారి తీస్తుంది. ఇదిలా ఉండగా.. చాలా మంది శృంగారాన్ని ఆస్వాదించడానికి సాయంకాలం సంధ్యా సమయంలో, రాత్రి వేళలో పాల్గొనేందుకు అనువైనదిగా భావిస్తారు. అయితే ఆయుర్వేదం ప్రకారం, ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనేందుకు శీతాకాలం మరియు వసంత కాలం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది.

FAQ's
  • ఆయుర్వేదం ప్రకారం ఎన్నిరోజులకొకసారి పాల్గొనాలి?

    ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, ఎండాకాలంలో 15 రోజులకొకసారి సెక్స్ లో పాల్గొనాలి. వర్షా కాలంలో పిత్తం పెరిగి ఉంటుంది. అసిడిటీ పెరిగి ఉంటుంది. పంటల్లో గానీ.. కూరగాయాల్లో, ఆహార పదార్థాలలో యాసిడ్ పెరిగి ఉంటుంది. ఇలాంటి కాలంలో ఎక్కువ సెక్స్ చేయొచ్చు. వర్షాకాలంలో వారానికొకసారి సెక్స్ లో పాల్గొనాలి. అయితే హేమంత రుతువు, శిశిర రుతువులలో మాత్రం ప్రతిరోజూ సెక్స్ చేయొచ్చట. దీన్ని బట్టి మనం వాతావరణ పరిస్థితులు.. శరీర సామర్థ్యం తదితర పరిస్థితులను అబ్జర్వ్ చేయాలి.

English summary

Sexual Wellness Tips According to Ayurveda in Telugu

Here are the sexual wellness tips according to ayurveda in Telugu. Take a look
Story first published:Monday, January 31, 2022, 14:44 [IST]
Desktop Bottom Promotion