For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నేను కన్యను కాదని.. నాకు కాబోయే భర్తకు చెప్పొచ్చా..’

|

ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క అమ్మాయికి పెళ్లి గురించి మనసులో ఎన్నో ఊహాలు, ప్రశ్నలు, ఫ్యాంటసీలు ఉంటాయి. ఎందుకంటే వివాహం అనే ఘట్టంతోనే తన జీవితం మలుపు తిరుగుతుంది.

తన వయసులో వచ్చినప్పటి నుండి కొత్త వ్యక్తితో కలిసి కొత్త జీవితం ప్రారంభించేది కూడా పెళ్లి తర్వాతే. అయితే పెళ్లి కాబోతోందనే ఉత్సాహం తనలో ఉన్నప్పటికీ, తనకు ఎన్నో సందేహాలు.. వాటికి సమాధానాలు తెలుసుకోవాలని భావిస్తుంది.

ఒకవేళ వర్జినిటీ గురించి అడిగితే ఏమైనా అనుకుంటారేమో అని భయపడుతుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఓ అమ్మాయికి పెద్దలు ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు. ఇద్దరికి ఒకరికొకరు బాగా నచ్చారు. అయితే ఆ అమ్మాయి పెళ్లికి ముందే ఇంకో వ్యక్తిని ప్రేమించింది.

కానీ తనతో బ్రేకప్ అయ్యింది. అయితే తను ప్రేమలో ఉన్నప్పుడు.. అతనితో శారీరకంగా కూడా కలిసింది. ఇదే విషయాన్ని కాబోయే భర్తకు కూడా చెప్పాలనుకుంటోందట. అయితే ఇలా చేయడం కరెక్టోనా.. ఇంతకీ తను ఆ విషయం చెప్పిందా.. అది చెప్పాక కాబోయే భర్త ఎలా స్పందించాడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పడకగదిలో ఆ పని చేయాలంటే భయమేస్తోందా... అయితే ఇలా ట్రై చేయండి...

బ్రేకప్ తర్వాత తొలిసారి..

బ్రేకప్ తర్వాత తొలిసారి..

హాయ్ ‘నా పేరు తేజస్విని(పేరు మార్చాం.). నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాను. మా పేరేంట్స్ ఈ మధ్య ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు. తను నాకు బాగా నచ్చాడు. నేను కూడా తనకు బాగా నచ్చాను. అందుకే మా ఇద్దరికీ మ్యాచ్ ఫిక్స్ చేశారు మా పేరేంట్స్.

పెళ్లికి ముందు ప్రేమ..

పెళ్లికి ముందు ప్రేమ..

అయితే నేను తనతో మ్యాచ్ ఫిక్స్ కావడానికి ముందే ఓ వ్యక్తితో ప్రేమలో ఉండేదాన్ని. ముందుగా ఫోన్లో అనుకోకుండా పరిచయమైన తనను అతి తక్కువ సార్లు నేరుగా కలిశాను. కానీ ప్రతిరోజూ ఫోన్లో గంటల కొద్దీ గడిపేవాళ్లం. దీంతో మా ఇద్దరి మధ్య అతి తక్కువ కాలంలోనే చాలా క్లోజయ్యాం.

ఎవ్వరూ లేకపోవడంతో..

ఎవ్వరూ లేకపోవడంతో..

ఓ రోజు మా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో.. నేను తనని ఇంటికి పిలిపించాను. తను అప్పుడు మా ఇంటికి రావడంతో నేను తనతో శారీరకంగా కలిశాను. తనతో అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఆ తర్వాత మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కొన్ని కారణాల వల్ల మేమిద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం.

‘నా భర్త చేసేది నచ్చట్లేదు.. తనకు దూరంగా వెళ్దామనుకుంటున్నా... కానీ'

తనకు చెప్పొచ్చా..

తనకు చెప్పొచ్చా..

అయితే పెళ్లికి ముందే నేను నా కన్యత్వాన్ని కోల్పోయాననే విషయాన్ని నాకు కాబోయే భర్తకు చెప్పొచ్చా లేదా అనే ఆందోళన నన్ను తెగ వెంటాడుతోంది. చెబితే తను ఎలా ఫీలవుతాడు.. ఒక పెళ్లి తర్వాత నేను కన్య కాదని తెలిస్తే తను చాలా బాధపడతాడేమోననిపిస్తోంది. గతంలో ఇంకో వ్యక్తితో నేను శారీరక సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని చెప్పొచ్చా లేదా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నా. నేను ఇప్పుడేం చేయాలి' అని ఓ యువతి నిపుణులను సలహా అడిగింది.

నిజాలు చెప్పడం మంచిదే..

నిజాలు చెప్పడం మంచిదే..

మీరు కొత్త వ్యక్తితో కలిసి జీవితం పంచుకునే ముందు కొన్ని విషయాలు నిజాలు చెప్పాలనుకోవడం మంచిదే. కానీ అన్ని విషయాల్లో మాత్రం ఇది అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నిజం చెప్పకపోవడమే ఉత్తమం. ఇక మీ విషయానికొస్తే.. మీరు పెళ్లికి ముందే గతంలో జరిగిన ఘటన గురించి కాబోయే భర్తకు చెప్పాలనుకోవడం మంచిదే.

అర్థం చేసుకుంటాడా..

అర్థం చేసుకుంటాడా..

ఎందుకంటే మీరు చెప్పే కొన్ని నిజాలు.. మీకు భవిష్యత్తులో ఆటంకాలను తీసుకురావచ్చు. ఇంతకీ తను మీరు చెప్పిన విషయాలను అర్థం చేసుకుంటాడా? తను అంతటి బ్రాడ్ మైండెడేనా? ఎందుకంటే కొందరు తొలిరోజుల్లో ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోమని చెప్పినా.. తర్వాత ఏదో ఒక సందర్భంలో వాటి గురించి మాట్లాడి చులకన చేస్తుంటారు.

ఇలా ట్రై చేయండి..

ఇలా ట్రై చేయండి..

ఇలాంటి రోజుల్లో మీకు కాబోయే భర్తతో ఈ విషయాలను చెప్పడం ద్వారా మీరు చేతులారా గతాన్ని తవ్వుకుని సమస్యలు కొని తెచ్చుున్న వారవుతారు. ఒకవేళ మీరు కచ్చితంగా చెప్పాలనుకుంటే మాత్రం.. ఏదైనా సినిమాలో సీన్ గురించి చెబుతూ.. వారి స్థానంలో మీరుంటే ఏమి చేస్తారని అడగండి. అప్పుడు తను చెప్పే సమాధానాన్ని బట్టి.. తను ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూస్తే.. మీకే ఒక కార్లిటీ వస్తుంది.

English summary

Should I Tell My Future Husband I Am Not a Virgin?

Check out the details, should i tell my future husband iam not a virgin. Read on
Story first published: Tuesday, May 11, 2021, 16:11 [IST]