For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కపుల్స్ మధ్య ఈ లక్షణాలుంటే.. కలిసి బతకడం కష్టమే...!

టాక్సిక్ రిలేషన్ షిప్ లో కనిపించే సంకేతాలేంటో తెలుసా..

|

భార్యభర్తలు అన్నాక కలకాలం ఇద్దరు కలిసి సంతోషంగా గడపాలని ప్రతి ఒక్క జంట ఆశిస్తూ ఉంటారు. తమ జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందంగా గడపాలని భావిస్తారు. అయితే ఇలాంటి విషయాల్లో కొందరు విజయం సాధించగా.. మరికొందరు మాత్రం తొలిరోజుల్లోనే విఫలమవుతున్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి.

Signs of a Toxic Relationship and Tips For Fixing It

కొందరికి ఆనందం అంటే ఇద్దరం కలిసి పరిమితికి మించిన కోరికలు నెరవేరడంతోనే అది దక్కుతుందనే భావనలో ఉంటారు. అయితే ఎలాంటి దంపతులైనా తమ ఇద్దరి మధ్య ప్రతి చిన్న క్షణాలను ఆస్వాదించడం తెలుసుకుంటే.. నిత్యం వారి బంధం సాఫీగా సాగిపోతుంది. అయితే పెళ్లయిన వెంటనే ఆలుమగలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు.

Signs of a Toxic Relationship and Tips For Fixing It

అందుకోసం కొంత సమయం పట్టొచ్చు. అయితే కొందరు జంటలకు మాత్రం కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. కనీసం వారి మధ్య సఖ్యత ఉండదు. భాగస్వాములిద్దరిలో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అస్సలు తెలుసుకోలేరు. అలాంటి లక్షణాలుండే కపుల్స్ కలకాలం కలిసి ఉండటం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలేంటి? వారి మధ్య కలహాలు ఉన్నాయనే విషయాలు ఎలా తెలుస్తాయి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Couple Problems:పెళ్లయ్యాక.. పిల్లలు పుట్టాక.. ఆ పని చేద్దామంటే...Couple Problems:పెళ్లయ్యాక.. పిల్లలు పుట్టాక.. ఆ పని చేద్దామంటే...

నీరసంగా ఉంటూ..

నీరసంగా ఉంటూ..

మనలో చాలా మంది జంటలు మంచి ఆహారం తీసుకుంటూ ఉంటారు. అయితే ఎంత తిన్నా కూడా వారు చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటారు. అసలెప్పుడూ ఓపిక లేనట్టు ఫీలవుతారు. ఈ నేపథ్యంలో వారి హెల్త్ కూడా పాడవుతుంది. దీంతో వారి ఫేసు, బాడీ పీక్కుపోయినట్టు కనిపిస్తుంది. దీని కారణమేంటంటే.. వారు తీసుకునే ఆహారం సరిగ్గా బాడీకి సెట్ కావడం లేదనే. అంతేకాదు వారికి మనసులో ఏదో విషయం గురించి చింత ఉంటుందని అర్థం. అందుకే ఎంత తిన్నా నీరసంగా ఉంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే సమస్య ఎక్కడుందో తెలుసుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి.

భయంగా ఉండటం..

భయంగా ఉండటం..

కొందరు పెళ్లికి ముందు పులి లాగా బతుకుతారు. కానీ పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ.. చాలా మంది పిల్లిగా మారిపోతారు. బయటకు గంభీరంగా కనిపించినప్పటికీ.. పడకగదిలో అది కూడా భాగస్వామిని చూస్తే భయపడిపోతారు. అయితే ఇతరులతో ఎక్కువ కోపంగా ఉంారు. దీంతో వారు తీసుకునే డెసిషన్స్ కూడా కోపంలోనే తీసేసుకుంటారు. వాటి నుండి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా భయపడుతూ భాగస్వామితో కలిసి బతకడం కష్టమే. ఎప్పుడైతే భయాన్ని పక్కనబెడతారో.. అప్పుడే మీరు ఫ్రీగా కాపురం, కార్యం రెండూ సాఫీగా చేస్తారు.

గొప్పలు చెప్పుకోవడం..

గొప్పలు చెప్పుకోవడం..

మీ వైవాహిక జీవితంలో కలహాలు రావడానికి మరో ప్రధాన కారణం. భాగస్వాముల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం. అది కూడా నలుగురిలో తన భాగస్వామిని తక్కువగా తామే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి తమ సపోర్టు అవసరమని.. తమ అవసరం లేనిదే ఏది సాధ్యం కాదని చెబుతుంటారు. భాగస్వామి మాటలకు ఏ మాత్రం విలువ ఇవ్వరు. దీంతో వారి నిర్లక్ష్యాన్ని, తక్కువ చేసి మాట్లాడటం చూసి వారు నిరుత్సాహానికి గురవుతారు. ఇలాంటి సమయంలో మీరు కూడా ధైర్యంగా నోరు విప్పి మాట్లాడాలి. మీ మాటలు వ్యంగ్యంగా ఉండాలి. ముఖ్యంగా పరోక్షంగా వారికి చురకలు తగిలేలా ఉండాలి.

మగాళ్లకు ‘ఆ'కార్యంపై ఆసక్తి తగ్గుతోందట... కారణాలేంటో తెలుసా...మగాళ్లకు ‘ఆ'కార్యంపై ఆసక్తి తగ్గుతోందట... కారణాలేంటో తెలుసా...

ఆధిపత్యం చెలాయిస్తూ..

ఆధిపత్యం చెలాయిస్తూ..

మరికొందరు జంటలు తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తారు. అది పెళ్లయిన తొలిరోజు నుండే అంతా తాను చెప్పిన నడవాలని ఆర్డర్లు వేస్తుంటారు. భాగస్వామికి అస్సలు స్వేచ్ఛ ఇవ్వరు. ప్రతిదీ తమ కనుసన్నల్లోనే జరగాలని ఆశిస్తారు. ఇలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటమే మంచిది. లేదా ఇలాంటి వ్యక్తులను మీ ప్రయత్నాలతో మార్చుకునేందుకైనా ప్రయత్నించాలి.

రొమాన్స్ ట్రై చేయండి..

రొమాన్స్ ట్రై చేయండి..

మీ భాగస్వామితో రొమాన్స్ ప్రత్యేకంగా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేసే సమయంలోనో లేక బయటకు వెళ్లి వాకింగ్ చేసే సమయంలోనో మీ భాగస్వామితో సరదాగా మాట్లాడండి. లేదా వారికి నచ్చిన టిఫిన్ మీరే స్వయంగా చేయండి. వారు తినే సమయంలో మీ ఒళ్లో కూర్చొని తినమని చెప్పండి.

శ్రద్ధ చూపండి..

శ్రద్ధ చూపండి..

ఆలుమగలిద్దరూ ఆనందంగా ఉండాలంటే కేరింగ్ అనేది చాలా కీలకం. ఎప్పుడైతే ఇది తగ్గుతుందో అప్పుడే కలహాలు, కోపాలు పెరుగుతాయి. కాబట్టి మీరు మీ భాగస్వామి పట్ల సరైన శ్రద్ధ తీసుకోవడం వల్ల వారికి కూడా మీ గురించి అర్థం చేసుకుంటారు. ఇలా మీరిద్దరూ ఒకరికొకరు కేర్ తీసుకుంటే కావాల్సినంత సంతోషం మీ సొంతమవుతుంది.

పడకగదిలో మూడ్ పెరగాలంటే.. ఇలా ట్రై చేయండి..పడకగదిలో మూడ్ పెరగాలంటే.. ఇలా ట్రై చేయండి..

వర్షంలో ఓ కిస్..

వర్షంలో ఓ కిస్..

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వర్షం బాగా కురుస్తోంది కాబట్టి.. ఇలాంటి సమయంలో మీరు బయట తడిచి వస్తే.. వెంటనే మీ భాగస్వామిని కౌగిలించుకుని ఓ కిస్ చేయండి. చిటపట చినుకుల మధ్య మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అద్భుతంగా ఉంటుంది.

నిద్రపోయేటప్పుడు..

నిద్రపోయేటప్పుడు..

ఇక చివరగా మీరు రోజు రాత్రి నిద్రపోయే సమయంలో భార్యభర్తలిద్దరూ కలిసి గడిపేందుకు, ఆ కార్యంలో పాల్గొనడానికి ముందు వారిపై మీకున్న ప్రేమను మాటల్లో చూపెట్టండి. ఇలా చేస్తే వారు మీరు కోరుకున్నదంతా ఇచ్చేస్తారు.

English summary

Signs of a Toxic Relationship and Tips For Fixing It in Telugu

Here are the signs of a toxic relationship and tips for fixing it. Take a look
Desktop Bottom Promotion