Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా’ అని తెలిపే సంకేతాలేంటో చూసెయ్యండి...!
పెళ్లి కళ వచ్చేసిందని తెలిపే సంకేతాలేంటో చూడండి.
పెళ్లి.. అనే బంధం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైనది. ఈ ముఖ్యమైన ఘట్టం ద్వారా మన జీవితంలో కొత్త వ్యక్తి చేరతారు.

దీంతో ప్రతి ఒక్కరికీ బాధ్యతలు, బరువు పెరిగిపోతూ ఉంటాయి. అందుకే చాలా మంది పెళ్లి విషయంలో అనేక విషయాల గురించి ఆలోచిస్తారు. బాధ్యతలు, బరువులకు భయపడి పెళ్లి అంటేనే భయపడి పోతుంటారు.

అందుకే వివాహం గురించి నిర్ణయం తీసుకోవడానికి వెనుకడుగు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో పురుషులు, స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారనే తెలిపే సంకేతాలేంటి? పెళ్లి గురించి నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడే చూసెయ్యండి...

సవాళ్లను ఎదుర్కొంటామని..
బ్యాచ్ లర్ లైఫ్ ఎంతో బెటర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సింగిల్ గా ఉన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇదంతా ఓ ఏజ్ వచ్చే వరకే. సింగిల్ గా ఉండే వారంతా ఎప్పటికైనా మింగిల్ అవ్వాల్సిందే. అయితే పెళ్లికి మీరు సిద్ధమయ్యారని తెలిపే సంకేతాలలో ముఖ్యమైనది ఏంటంటే.. మీరు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామనే ధైర్యం ఉండాలి. అలాగే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తితో ఆనందంగా ఉండగలం అనే నమ్మకం ఉండాలి. అప్పుడే మీరు పెళ్లి వైపు అడుగు వేయాలి.

హ్యాపీగా ఉన్నామని..
మనలో చాలా మంది చిన్నప్పటి నుండి పడిన కష్టాల నుండి విముక్తి లభించిందని.. మంచి జాబ్ వచ్చిందని లేదా బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చి హ్యాపీగా ఉన్నామని.. ఇక జీవితంలో పెళ్లి ఒక్కటే మిగిలిందని.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే.. అది సరైనది కాదట. ఎందుకంటే మీకు నచ్చిన లైఫ్.. మీ భాగస్వామికి గ్యారంటీ ఏమీ లేదు కదా..? నిజంగా వారికి కూడా మీకు నచ్చినవన్నీ నచ్చితే.. అప్పుడు మీరు వివాహ బంధంలోకి ధైర్యంగా అడుగు పెట్టొచ్చు.

భావోద్వేగంలో బలంగా..
మీరు ఎలాంటి భావోద్వేగ విషయాలనైనా బలంగా తట్టుకుంటామని అనిపించినప్పుడు మీరు పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లే. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తికి గతంలో ఏదైనా ప్రేమ బంధం లేదా స్నేహ బంధం ఇంకా ఏదైనా ఉండొచ్చు. అలాంటి వాటి గురించి తెలిసినప్పుడు కూడా మీరు ధైర్యంగా ఉండాలి.

ఆర్థిక పరంగా..
అన్నింటికంటే ముఖ్యంగా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే.. ఆర్థిక పరంగా బలంగా ఉండాలి. ముఖ్యంగా అప్పులు వంటివి లేకుండా ఆస్తులు వెనకేసి ఉంటే.. మీరు వివాహ బంధంలోకి ఆనందంగా అడుగుపెట్టొచ్చు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మాత్రం పెళ్లిళ్లు చేసుకోవడం మంచిది కాదని.. నిపుణులు సూచిస్తున్నారు.

ఇద్దరూ బాధ్యతగా..
ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే.. భార్య భర్త సంపాదనపైనే ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. అప్పటికాలంలో మాదిరిగా మీరు రూల్స్ పెట్టుకోకుండా ఇద్దరూ బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా సంపాదన విషయంలో.. ఖర్చు పెట్టే విషయంతో పాటు ప్రతి విషయంలో మీరు అభిప్రాయాలను షేర్ చేసుకోవాలి.

భయపడొద్దు..
మనలో చాలా మంది తమ స్నేహితులు పెళ్లి చేసుకున్న తర్వాత ఎదురయ్యే సమస్యలు.. గొడవల గురించి విని.. తాము పెళ్లి చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా భార్యలంటే భారంగా భావిస్తారు. అందుకే మీరు భయపడకుండా అలాంటి నిర్ణయాలను తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఇద్దరూ కలిసి..
మీరు ఒకవేళ ప్రేమలో ఉంటే.. మీరిద్దరూ ఇప్పటివరకు కలిసి లోపాలను, ఇష్టయిష్టాలను తెలుసుకుని ఉంటే.. మీరు పెళ్లికి సిద్ధమైనట్టే. ప్రేమలో ఉన్నవారు ముందే గొడవలు, తగాదాలు, ఎదురుచూపులు వంటివి ఉంటే పెళ్లికి ఇద్దరూ మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. అందుకే ఈ ప్రయాణం చాలా బాగుంటుంది అనిపిస్తుందట.

పెద్దలు పదే పదే చెబుతున్నారంటే..
మనలో మగవారికి మూడు పదుల వయసు దగ్గరికొస్తే చాలు.. అందరూ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతుంటారు. ఇక అమ్మాయిలకైతే 20 ఏళ్లు దాటాయంటే చాలు పెళ్లి గురించి ఒత్తిడి పెరిగిపోతుంది. అయితే పెద్దలు చూసే సంబంధాలలో మీకు కాబోయే భాగస్వామిని కలిసి కాసేపు మాట్లాడుకుని ఎదుటి వ్యక్తిని అంచనా వేయడం అనేది అసాధ్యం. అయితే ఆ సమయంలో మీకు ఎలాంటి లోపాలు కనబడకపోతే.. మీ పెళ్లి ఆటోమేటిక్ గా జరిగిపోతుందట.



Click it and Unblock the Notifications