For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి సంకేతాలుంటే..మీ మ్యారేజ్ లైఫ్ సమస్యల్లేకుండా సాఫీగా సాగిపోతుదంట...!

ఇలాంటి సంకేతాలు కనిపిస్తే.. మీ వివాహ జీవితంలో ఎలాంటి చిక్కులు లేనట్టే..

|

మనలో చాలా మంది పెళ్లి జరిగిన తొలి రోజుల్లో చాలా సంతోషంగా ఉంటారు. ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను పంచుకుంటూ ఉంటారు. అయితే అది కాస్త క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.

Signs Your Marriage Is Not In Trouble in Telugu

ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత భాగస్వామిపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే అనేక కారణాలు ఉంటాయి. దీంతో ఆడవారు, మగావారి మధ్య సంబంధంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. అయితే దీనంతటికి ప్రధాన కారణం అతిగా ఆలోచించడమే అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొగుడు, పెళ్లాం అన్నాక పాలు, నీళ్లలా కలిసిపోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

Signs Your Marriage Is Not In Trouble in Telugu

మనలో చాలా మంది ఒకరితో ఒకరు కలిసి జీవితాంతం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. అందుకే కొందరి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటారు. అయితే ప్రతి బంధంలోనూ కొన్ని ఒడిదుడుకులు అనే సాధారణంగా ఉంటాయి. అయితే అవి మీ వివాహ జీవితాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నదే ముఖ్యం.

Signs Your Marriage Is Not In Trouble in Telugu

ఈ నేపథ్యంలోనే కొందరు పెళ్లయిన కపుల్స్ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం.. విడిపోవటం వంటివి చేస్తూ ఉంటారు. తమ వివాహ బంధానికి మధ్యలోనే గుడ్ బై చెప్పేస్తూ ఉంటారు. ఇదంతా ఓర్పు, సహనం అనేవి లేకపోవడం వల్లే జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు నిశితంగా పరిశీలిస్తే.. కొన్ని సంకేతాలు మీ వైవాహిక జీవితంలో ఉంటే.. మీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగుతుందని చెప్పొచ్చు.. మీరు వివాహ జీవితంలో ఎలాంటి సమస్యా లేవని నిరూపించే కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడే చూసెయ్యండి..

2022లో ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!2022లో ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!

ఇద్దరూ సిద్ధమైతే..

ఇద్దరూ సిద్ధమైతే..

మీ వివాహ జీవితంలో మీరిద్దరూ కలిసి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇద్దరు సిద్ధపడితే.. మీ వివాహాంలో ఎలాంటి ఇబ్బంది లేదని అర్థం. మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని, దీని వల్ల మీ బంధం మరింత బలపడుతుందని అర్థం.

ఒకరికొకరు మద్దతు..

ఒకరికొకరు మద్దతు..

పెళ్లి తర్వాత ఆడవారికైనా.. మగవారికైనా.. ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలోనే కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటే.. మీ వివాహ బంధం కలకాలం హ్యాపీగా కొనసాగుతుంది. అంతేకాదు మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదా సాహాసోపేత యాత్రలు చేయడం లేదా కలిసి ఏవైనా కొత్త పనులు చేయడం వల్ల మీ సంబంధం సాఫీగా సాగిపోతుంది. ఇది మీ వివాహ జీవితానికి ఒక మంచి సంకేతం అని చెప్పొచ్చు. అయితే అతిగా ఆలోచించడం మానుకోవాలి.

భిన్నమైన అభిప్రాయాలు..

భిన్నమైన అభిప్రాయాలు..

మీకు పెళ్లి అయినప్పటికీ.. మీరు సొంత అభిప్రాయాలను కలిగి ఉండటం ఎంతో శ్రేయస్కరం మరియు ఉత్తమం. అదే సమయంలో మీ భాగస్వామి కొంత విభిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటే.. మీరిద్దరూ మీ అభిప్రాయాల గురించి తెలుసుకుంటూ.. విభిన్న విషయాల గురించి అన్వేషిస్తూ ఉంటే.. మీరు మీది, మీ పార్ట్నర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ.. మీ వివాహ బంధంలో మీరు సంతోషంగా ఉన్నారనేందుకు సంకేతం. ఇది మీ ఇద్దరిని జీవితంలో సరైన దిశలో పయనించేలా చేస్తుంది.

2022లో ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!2022లో ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!

వాదనలకు దిగకుండా..

వాదనలకు దిగకుండా..

సంతోషకరమైన సంబంధానికి ఆరోగ్యకరమైన సంభాషణ అనేది చాలా అవసరం. అయితే మీ భాగస్వామితో అనవసరమైన వాదన బంధాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయొచ్చు. ఇలా వాగ్వాదం కొనసాగించడం వల్ల వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే అలాంటి సమయంలో మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటూ.. ఒకే గదిలో ఉండి పనులు మాత్రమే చేసుకుంటూ ఉంటే.. అది చాలా మంచి విషయం. దీని వల్ల మీరు మీ భాగస్వామికి ప్రాముఖ్యతను ఇస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇది కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటే చాలా మంచిది. ఇలా మీ వాదనలు నిలిచిపోతే మీ బంధం మరింత బలపడేందుకు ఒక సంకేతంగా చెప్పొచ్చు.

హెల్దీ విమర్శలు..

హెల్దీ విమర్శలు..

విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలన్నారు. అయితే, కొంచెం నిర్మాణాత్మకమైన విమర్శలు మంచి విషయమే. కానీ మీరు పొగడ్తల కంటే ఎక్కువ విమర్శలను వ్యక్తం చేస్తే, మీరు సంబంధంలో ఇబ్బందుల్లో పడతారు. సంబంధాన్ని మంచిగా ఉంచడానికి, ప్రతి ప్రతికూలతను ఎదుర్కోవడానికి మీకు ఐదు సానుకూల పరస్పర చర్యలు అవసరమని పరిశోధన చూపిస్తుంది.

English summary

Signs Your Marriage Is Not In Trouble in Telugu

Here are the list of signs your marriage is not in trouble in Telugu. Have a look
Story first published:Wednesday, December 29, 2021, 15:27 [IST]
Desktop Bottom Promotion