For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్ నర్ లో ఇలాంటి లక్షణాలుంటే... మీ బంధం బలహీనపడినట్టే...

మీ భాగస్వామిలో ఇలాంటి లక్షణాలుంటే.. మీరు మోసపోతున్నట్టే అర్థమట.

|

ఒకప్పుడు ఎవరినైనా ప్రేమిస్తే.. జీవితాంతం వారిపై విశ్వాసం ఉంచేవారు. అందుకే వారి ప్రేమలో నిజాయితీ ఉండేది. వారి ప్రేమలు చరిత్రలో నిలిచిపోయితాయి. ఎందుకంటే మోసం అనేది వారికి తెలియదు.

Signs your partner doesnt deserve you in Telugu

కానీ ప్రస్తుత తరం వ్యక్తులలో అలాంటి ప్రేమ బంధం ఉందా అంటే అవుననే సమాధానం రావడం చాలా కష్టమే. కానీ ఇప్పటికీ చాలా మంది తాము ప్రేమించిన వ్యక్తిని గుడ్డిగా నమ్ముతుంటారు. వారు చాలా విశ్వాసంగా ఉంటారని.. ఎప్పటికీ మనల్ని మోసం చేయరని భావిస్తుంటారు.

Signs your partner doesnt deserve you in Telugu

అందరి లైఫ్ లో ఇదే జరిగితే.. అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పటి తరం వారిలో ఎంతోమంది భాగస్వామి చేతిలో మోసపోతున్నారు.. అయితే అలాంటి వారిని మనం ముందే గుర్తించలేమా? మన భాగస్వామి మోసం చేస్తున్నాడని ముందే గుర్తిస్తే.. మనం అలాంటి బంధం నుండి బయటపడొచ్చు.

Signs your partner doesnt deserve you in Telugu

అయితే మీ భాగస్వామిపై ఏదైనా అనుమానం వచ్చినప్పుడు.. తన ప్రవర్తన మరియు సోషల్ మీడియా అకౌంట్లు ఇతర మార్గాలపై ఓ కన్ను వేయండి. ఇంకా ఎలాంటి విషయాలపై మనం నిఘా పెట్టాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ శ్రీవారు మీపై మనసు పడాలంటే.. ఇలా ట్రై చేయండి...మీ శ్రీవారు మీపై మనసు పడాలంటే.. ఇలా ట్రై చేయండి...

క్రమంగా ఆసక్తి తగ్గితే..

క్రమంగా ఆసక్తి తగ్గితే..

సాధారణంగా ఆరోగ్యకరమైన సంబంధంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే ఎప్పుడైతే మీ భాగస్వామి మీపై ఆసక్తిని తగ్గిస్తూ పోతారో.. మిమ్మల్ని గౌరవించకపోవడం లేదా మీకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదని మీరు భావిస్తే.. మిమ్మల్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నా.. అసభ్యపదజాలంతో మాట్లాడినా మిమ్మల్ని మోసం చేస్తున్నారని భావించొచ్చు.

పరధ్యానంలో ఉండటం..

పరధ్యానంలో ఉండటం..

మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తనతో చర్చించాలనుకున్నప్పుడు.. తను పరధ్యానంలో ఉండటం.. మీరు చెప్పే ఏ విషయాన్ని పట్టించుకోకపోవడం.. మీ మాటలపై ఆసక్తి చూపకపోవడం.. మీరు మాట్లాడుతున్నంత సేపు ఫోన్ చూడటం.. ఫోన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను మీకు దూరమవుతున్నాడని అర్థం చేసుకోవచ్చు.

ఇచ్చిన మాటను..

ఇచ్చిన మాటను..

మీ భాగస్వామి ఏదైనా సందర్భంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం చేస్తే.. కొన్నిసార్లు తనే చేసిన వాగ్దానాలనే మరచిపోవడం.. మీరు ఆ ప్రమాణాల గురించి గుర్తు చేసినా.. వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. మీరు ఫోన్ చేసినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని భావించొచ్చు.

స్వార్థపూరితంగా..

స్వార్థపూరితంగా..

మీతో రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ.. ఎల్లప్పుడూ తన గురించి తన కలలు, ఆశయాలు, లక్ష్యాలు, ఇష్టాలు మరియు అయిష్టాల గురించే మాట్లాడటం.. ఏదైనా తప్పు జరిగితే.. మీపై నిందలు వేయడం.. తన పనికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేసినప్పుడు, మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూడటం.. తప్పుగా మాట్లాడటం వంటివి చేయడమే కాక.. అందరిముందు మిమ్మల్ని ఎగతాళి చేసి.. తను మాత్రం గొప్పలు చెప్పుకోవడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను మీకు ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

రొమాన్స్ లో రతి మన్మథుల్లా రెచ్చిపోయేలా చేసే విషయాలివే...!రొమాన్స్ లో రతి మన్మథుల్లా రెచ్చిపోయేలా చేసే విషయాలివే...!

సారీ చెప్పకపోవడం..

సారీ చెప్పకపోవడం..

ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి తప్పులు చేస్తుంటాడు. అయితే తప్పు జరిగిన ప్రతిసారి క్షమించమని అడుగుతుంటాడు. కానీ తను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా.. దాని నుండి తప్పించుకోడానికి మీపై నిందలు వేయడం.. మిమ్మల్ని విమర్శించడం వంటివి చేయడం.. వారి తప్పులను ఎప్పటికీ అంగీకరించకపోవడం.. తన తప్పు లేదని నిరూపించుకునేందుకు అడ్డదారులు తొక్కడం వంటివి చేస్తుంటే.. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే...

ఆ విషయంలో బలవంతం..

ఆ విషయంలో బలవంతం..

మిమ్మల్ని తమ కోసం మారిపోమని చెప్పడం.. మీ ఇష్టాలను ఎగతాళి చేయడం.. మిమ్మల్ని అనునిత్యం అనుమానించడం వంటివి చేస్తే.. మీ అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం.. మీ వ్యక్తిత్వాన్ని గౌరవించకపోవడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. మీరు ఎప్పటికీ తనతో కలిసి ఉండలేరు.

నలుగురిలో ఎగతాళి చేయడం..

నలుగురిలో ఎగతాళి చేయడం..

మీరు మీ భాగస్వామి కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు నలుగురిలో మిమ్మల్ని ఎగతాళి చేయడం.. మిమ్మల్ని చాలా హీనంగా చూడటం.. మీపై పదే పదే అరవడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను మీకెంత విలువ ఇస్తున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఇతరులను మెచ్చుకోవడం..

ఇతరులను మెచ్చుకోవడం..

సాధారణంగా ఏ అమ్మాయికైనా తన కంటే ఇతరులు అందంగా ఉన్నారని చెబితే అస్సలు తట్టుకోలేరు. అలాంటి తన భర్త తన ముందే ఇతరులను మెచ్చుకోవడం.. అంతటితో ఆగకుండా వారితో పోల్చి మిమ్మల్ని అవమానించడం వంటివి చేస్తే.. తను అనునిత్యం మీ మనసుని బాధపెట్టే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు.

English summary

Signs your partner doesn't deserve you in Telugu

Here are some noticeable signs your partner doesn’t deserve you. Have a look
Story first published:Friday, March 26, 2021, 14:35 [IST]
Desktop Bottom Promotion