For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగదిలో మీ మూడ్ పెంచే స్టెప్స్ ఏంటో చూసెయ్యండి...

|

మనలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క జంట రతి క్రీడను ఆస్వాదించాలని కోరుకుంటారు. ముఖ్యంగా నవ దంపతులు రతి, మన్మథుడిలా రెచ్చిపోదామని భావిస్తారు. చాలా మందికి ఆ కార్యం తర్వాత అన్నీ విషయాలు తెలుసనే భ్రమలో కూడా ఉంటారు. కానీ శృంగారం గురించి ఎంత తెలుసుకున్నా.. తెలుసుకోవాల్సిన విషయాలు బోలెడన్నీ ఉంటాయట.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈరోజుల్లో చాలా మంది యువత ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదించలేకపోతున్నారట. ఇందుకు మానసిక ఒత్తిడి, పని ఒత్తిడితో పాటు ఇతర కారణాలు ఎన్నో ఉన్నాయి. కొందరు వ్యక్తులేమో.. సినిమాల్లో చూపించిన విధంగా ప్రయత్నించి విఫలమవుతున్నారు. మరికొందరు పెళ్లికి ముందే ఏవేవో ఊహించుకుని.. వాస్తవ జీవితంలో డీలా పడిపోతున్నారట. ఇంకా కొందరు శృంగారం గురించి ఫాంటసీలు ఉన్నా.. వాటిని పార్ట్నర్ తో షేర్ చేసుకోలేకపోతున్నారట. ఇలాంటి ఇబ్బందులను ఈజీగా అధిగమించి.. ఆ కార్యంలో రతి మన్మథుల్లా రెచ్చిపోవాలంటే ఏమి చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మగాళ్ల బాడీలోనూ సెన్సిటివ్ ప్లేసులుంటాయని తెలుసా.. వారిని అక్కడ తాకితే...!

పవర్ ఎక్కువ..

పవర్ ఎక్కువ..

సాధారణంగా మనం పెరిగిన కుటుంబం, వాతావరణం, సమాజం కారణంగా శృంగారం గురించి మాట్లాడటానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. సొసైటీలో అన్ని విషయాల గురించి స్వేచ్ఛగా మాట్లాడే మనం.. దీని గురించి మాట్లాడటానికి వెనుకబడిపోతున్నాం. అందుకే నవ దంపతుల మధ్య సమస్యలొస్తున్నాయట. అందుకే పడకగదిలో పార్ట్నర్ తో సిగ్గు విడిచి ఫ్రీగా మాట్లాడుకోవాలట.

కలయిక సమయంలో..

కలయిక సమయంలో..

ఓ మహిళ యోని రెండు నుండి మూడు అంగుళాల వరకు ఉంటుంది. అయితే దీనికి 200 శాతం వరకూ సాగిపోయే గుణం, శక్తి ఉంటుంది. కలయిక సమయంలో, ప్రసవం అవుతున్నప్పుడు ఈ యోని మరింత వెడల్పుగా మారుతుంది. అదే విధంగా పురుషుడి అంగం 4 నుండి 6 అంగుళాల వరకు పొడవు ఉంటుంది. దీనికి స్తంభించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు లేదా ఏదైనా భావోద్వేగం కలిగినప్పుడు మగవారిలో ఆటోమేటిక్ అంగం అనేది స్తంబిస్తుందట. అంతేకాదు కొన్నిసార్లు వీర్యస్కలనం కూడా జరుగుతుంది.

పడకగదిలో ఈ రహస్యాల గురించి మీకు తెలుసా...

శృంగారం అంటే..

శృంగారం అంటే..

మనలో చాలా శృంగారం అంటే కేవలం రెండు శరీరాల కలయిక అని అనుకుంటూ ఉంటారు. అయితే భాగస్వాములిద్దరూ తనివి తీరా ఆనందం, సుఖం పొందాలంటే.. మాత్రం ఇద్దరి మధ్య ముందుగా ప్రేమ, రొమాన్స్ కూడా పెరగాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా రొమాన్స్ తో స్టార్ట్ చేసి.. ఆ కార్యంలోకి అడుగు పెట్టాలని.. అప్పుడే స్వర్గపు అంచుల దాకా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

సున్నితమైన భాగాలు..

సున్నితమైన భాగాలు..

ఆ కార్యంలో పాల్గొనడానికి ముందు భాగస్వామిని రెచ్చగొట్టేందు లేదా తనను ఉద్రేక పరిచేందుకు మీ పార్ట్నర్ బాడీలోని సున్నితమైన భాగాలను సుకుమారంగా తాకితే చాలట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రఫ్ గా తాకడం వంటివి చేయొద్దని చెబుతున్నారు. ప్రేమగా మీ పార్ట్నర్ భాగాలను తాకితే వారికి ఆటోమేటిక్ గా మూడ్ వచ్చేస్తుందట. అందులో మొదటి మెడ వెనుక భాగంలో.. చెవుల వద్ద.. నడుము వద్ద.. యద భాగంలో.. తొడల ప్రాంతంలో టచ్ చేయడం వల్ల హార్మోన్లు ఉత్తేజితమవుతాయట.

ఒత్తిడి తగ్గుదల..

ఒత్తిడి తగ్గుదల..

మీరు రెగ్యులర్ గా ఆ కార్యంలో పాల్గొనడం వల్ల జంటలిద్దరిలోనూ ఒత్తిడి తగ్గుతుందట. ముఖ్యంగా మీరిద్దరూ ఆరోగ్యకరంగా ఉంటారట. మీ గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించి నెలసరి సమయంలో నొప్పి రాకుండా చేస్తుందట. అలాగే అమ్మాయిల్లో యాంగ్జైటీ సమస్యలు తగ్గించి.. ఎండార్ఫిన్లు విడుదల చేయడంలో సహాయపడుతుంది.

మూడ్ రావడానికి..

మూడ్ రావడానికి..

మీకు పడకగదిలో అడుగు పెట్టగానే మూడ్ రావాలంటే.. మల్లెపూలను తీసుకెళ్లండి. అందులో నుండి వచ్చే సువాసన మీకు మత్తెక్కిస్తుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే గుమ్మడికాయ కూడా మనలో మూడ్ తెప్పించడంలో సహాయపడుతుందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది జననాంగాలకు రక్త ప్రసరణను పెంచి మాంచి మూడ్ పెరిగేలా చేస్తుందట.

English summary

Steps to save romance in your relationship in Telugu

Here are the steps to save romance in your relationship in Telugu. Have a look
Story first published: Monday, October 25, 2021, 18:01 [IST]