Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
స్టడీ : అక్రమ సంబంధాల వైపు అడుగులెందుకు వేస్తున్నారో తెలుసా...!
స్త్రీ, పురుషులిద్దరూ వివాహేతర సంబంధాలకు ఎందుకని మొగ్గు చూపుతారు.
ఏడడుగులు.. మూడు ముళ్లు.. ఎన్నో సంప్రదాయాలు.. ఉండే మన దేశంలో వివాహం అనే బంధం కేవలం ఒకరితోనే ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మంది ఒకరితో పెళ్లి అయినప్పటికీ.. ఇతరుల వైపు ఆకర్షితులవుతున్నారు.

మరి కొంతమంది తమకు నచ్చిన వారి కోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడటం లేదు. ఇలాంటి వివాహేతర సంబంధాల గురించి నిత్యం మనం న్యూస్ ఛానెల్స్ లో.. లేదా ఇతర చోట్ల చూస్తున్నాం.. వింటూ ఉన్నాం కూడా.. ఇలా ఎందుకు చేస్తారనే ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతూ ఉంటాయి.

అయితే ఇలాంటి వివాహేతర సంబంధాలకు అనేక కారణాలుంటాయట. ప్రస్తుతం ఉన్న పార్ట్ నర్ ప్రవర్తన నచ్చకపోవడం.. వారితో హ్యాపీ లైఫ్, లేదా కొత్త పుట్టే కోరికలు, పార్ట్ నర్ ఆ కార్యానికి కోఆపరేట్ చేయకపోవడం వంటి తదితర కారణాల వల్లే వివాహేతర సంబంధాలకు దారి తీస్తుందనే భావన చాలా మందిలో ఉంది.

ఈ నేపథ్యంలోనే వివాహేతర సంబంధాలకు కారణమేంటనే విషయం ఓ సంస్థ సర్వే చేపట్టింది. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ అందం..
వివాహేతర సంబంధాలకు సంబంధించి ఎక్కువగా అందం ఎవరికైతే తక్కువగా ఉంటుందో.. అలాంటి వారే ఎక్కువగా పక్కచూపులు చూస్తారంట. అందులోనూ అమ్మాయిలే అలాంటి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారట.

ఆ కార్యం కోసం..
ఇక మగవారైతే తమ భాగస్వామి అందంగా లేకపోయినా అడ్జస్ట్ అవుతారట. అయితే వారితో ఆ కార్యం జరగకపోతే ఏ మాత్రం తట్టుకోలేరట. అందుకే వీరు తమ కోరికలను తీర్చుకోవడం కోసం.. ముఖ్యంగా ఆ కార్యంలో పాల్గొనేందుకు వివాహేతర సంబంధాల దిశగా అడుగులు వేస్తారట.

అవగాహన లేకుండానే..
అయితే ఈ వివాహేతర సంబంధాల విషయంలో విచిత్రం ఏమిటంటే.. చాలా మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు ఈ విషయాల గురించి పెద్దగా అవగాహన ఉండదట. అసలు తాము ఎందుకు ఇలా చేస్తున్నామని, తాము ఏం చేస్తున్నామనే విషయాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా ఇలా చేస్తున్నట్లు సర్వేకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ జిమ్ మెక్ నుల్టీ వెల్లడించారు.

బ్యాడ్ మెమొరీస్..
వివాహం అయిన వారు పక్కచూపులు చూసేందుకు చిన్ననాటి సంఘటనలు కూడా ఒక కారణమని ప్రొఫెసర్ జిమ్ చెబుతున్నారు. చిన్నప్పుడు తమకు ఎదురైన బ్యాడ్ మెమొరీస్ వల్ల ఇలా జరగొచ్చని వివరించారు.

కొత్తగా పెళ్లైన వారిలో..
ఈ వివాహేతర లేదా అక్రమ సంబంధాల రహస్యాన్ని తెలుసుకునేందుకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ అధ్యయనంలో చాలా మంది తమకు అందంగా కనిపించే ఆడ, మగవారి ఫొటోలను చూపించారు. ఆ తర్వాత సాధారణ ఫొటోలను కూడా చూపించారట.

అట్రాక్ట్..
వీరిలో చాలా మంది తమ కంటికి కాస్త అందంగా.. అట్రాక్టివ్ గా కనబడితే చాలు.. వారిపైనే ద్రుష్టిని మళ్లిస్తున్నారని ఆయన గుర్తించారట. వారిని రొమాంటిక్ యాంగిల్ లో చూసినప్పుడు ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. దీని వల్ల అలాంటి సంబంధాల పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలిసిందని చెప్పారు.

సుఖం లేకపోవడం..
మరికొందరు తమ వైవాహిక జీవితంలో ప్రస్తుతం ఉన్న భాగస్వామితో సుఖం దొరకకపోవడం వంటిది కూడా ఒక కారణం. ఇదిలా ఉండగా.. అక్రమ సంబంధాలకు ఎక్కువగా అబ్బాయిలే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లికి ముందే..
చాలా మంది మగవారు పెళ్లికి ముందు తమకు రిలేషన్ షిప్ ఉన్న వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారట. కానీ అమ్మాయిలు మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారంట.
చూశారు కదా.. వివాహేతర మరియు అక్రమ సంబంధాల కోసం చాలా మంది పక్కచూపులు చూస్తున్నారో.. కాబట్టి మీ లైఫ్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీ రిలేషన్లో ఇలాంటివి జరగకుండా చూసుకోండి.



Click it and Unblock the Notifications