For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Summer Date Ideas:ఉక్కపోత నుండి ఉపశమనం కావాలంటే.. పార్ట్నర్ తో ఇలా ట్రై చేయండి...

|

సమ్మర్లో ప్రతి ఒక్కరూ చల్లదనాన్ని కోరుకుంటారు. సూర్యుని వేడి నుండి తప్పించుకోవడానికి నిత్యం ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఏసీలు వాడుతూ ఉంటారు.

అయితే సమ్మర్లో రాత్రి వేళలో వీచే చల్ల గాలిని అందరూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. కొత్తగా ప్రేమలో పడిన కపుల్స్ లేదా కొత్తగా పెళ్లి అయిన జంటలు తామిద్దరూ కలిసి ఏకాంతంగా కలిసి ఎప్పుడెప్పుడు గడుపుదామా అని ఆలోచిస్తుంటారు.

అయితే కపుల్స్ ఏకాంతంగా గడపాలంటే మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది సినిమాలు, పార్కులు, రెస్టారెంట్లు ఇలాంటివే.. అయితే సమ్మర్లో ఇవి కాసేపు మాత్రమే హాయిగా అనిపిస్తాయి. కానీ తర్వాత ఇబ్బందికరంగా మారుతుంది.

ఎందుకంటే ఎండ వేడికి, ఉక్కపోతకు చిరాకు పడుతుంది. అయితే ఇలాంటివి జరగకుండా మీరిద్దరూ స్పెషల్ గా గడిపేందుకు ఈ డేట్ ఐడియాలను ట్రై చేసి చూడండి.. ఎందుకంటే ఇవి చాలా కొత్తగా, ఎక్సయిటింగ్ గా, ఆసక్తిగా అనిపిస్తాయి.. ఇంతకీ అవేంటో మీరూ చూసెయ్యండి..

మీ పార్ట్నర్ రెగ్యులర్ గా అబద్ధాలు చెబుతున్నారా? బహుశా ఇలాంటి కారణాల వల్లేనేమో...!

కరయోకి నైట్స్..

కరయోకి నైట్స్..

సమ్మర్లో మీరిద్దరూ హీరో హీరోయిన్ గా మారిపోయే సందర్భం ఇది. మీ స్వరం ఎంత కఠినంగా ఉన్నా.. మీకు నచ్చిన వ్యక్తితో కలిసి పాటలు పాడుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే మీకు దగ్గర్లో ఉండే కరయోకి బార్ కు వెళ్లండి. ఇద్దరూ కలిసి మీకు నచ్చిన పాటల ట్యూన్లకు గాయకుల మాదిరిగా పాటలు పాడేయండి. ఇలాంటి క్షణాలు మీకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి.

మ్యూజియం లేదా ఆర్ట్ గ్యాలరీ..

మ్యూజియం లేదా ఆర్ట్ గ్యాలరీ..

మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉదయాన్నే మ్యూజియం లేదా ఆర్ట్ గ్యాలరీని చూడటం ప్రారంభిస్తే.. అది సాయంత్రానికి పూర్తవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈలోపు మీరు మ్యూజియంలోని రాజులు, కత్తులు, కటారుల చరిత్ర గురించి తెలుసుకోవడంతో పాటు చక్కని శిల్పకళ, చిత్రకళను చూసే అవకాశం దక్కుతుంది.

బిబిక్యూ నైట్

బిబిక్యూ నైట్

మీకు ఇష్టమైన పార్ట్నర్ తో హ్యాపీగా గడిపేందుకు బిబిక్యూ నైట్ ను సెలెక్ట్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీ ఇంటి బాల్కనీలో లేదా వరండాలో ఓ బిబిక్యూ సెటప్ ను సెట్ చేసేయండి. మీ భాగస్వామిని పిలిచి.. తనతో రాత్రంతా ముచ్చట్లు చెప్పుకుంటూ మీకిష్టమైన రుచులను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేయండి.

సెక్స్‌లో అద్భుతమైన కెమిస్ట్రీ ఉన్న మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలిపే సంకేతాలు మీకు తెలుసా?

సాగర తీరంలో..

సాగర తీరంలో..

మనలో చాలా మంది సాగర తీరంలో సూర్యస్తమయాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే సూర్యోదయం సమయంలో సాగర తీరంలో మీకిష్టమైన వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తే అందులో కలిగే మజా మీరు అనుభవిస్తే కానీ అర్థం కాదు. అలా సూర్యోదయాన్ని చూస్తే.. మీ పార్ట్నర్ తో బీచ్ లో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. హైదరాబాదులో ఉండే వారైతే నెక్లెస్ రోడ్డుకు వెళ్లి సూర్యోదయం చూసేందుకు ప్రయత్నించండి.

స్పెషల్ ఫుడ్..

స్పెషల్ ఫుడ్..

మీ ప్రియురాలు/ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఏదైనా మంచి రెస్టారెంట్లో సమ్మర్లో స్పెషల్ ఫుడ్ డిన్నర్ కోసం ప్లాన్ చేయండి. మీ ఇద్దరికీ ఇష్టమైన వాటిని ఆర్డర్ చేసి, ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ.. కళ్లతో మాట్లాడుకుంటూ రాత్రంతా ఎంజాయ్ చేయండి.

సూర్యాస్తమయంలో..

సూర్యాస్తమయంలో..

సాయంకాలం సమయంలో మీరిద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంచక్కా ఎంజాయ్ చేయండి. అలాగే సాయంకాలం ముగిశాక డ్రైవ్ ఇన్ థియేటర్ ను కూడా ట్రై చేయండి. దీనిపై చాలా మంది ఆసక్తి చూపరు. కానీ రొమాంటిక్ కపుల్ కు మాత్రం ఇది సరిగ్గా సరిపోతుంది.

పర్యాటక ప్రాంతాల్లో..

పర్యాటక ప్రాంతాల్లో..

సమ్మర్లో చల్లదనం కావాలంటే ఏ కులుమనాలికో.. ఊటికో వెళ్లాలి. అయితే మీరు మీకు దగ్గర్లో ఉండే నేచర్ బ్యూటీ ప్రదేశాలకు వెళ్లండి. అక్కడే ఓవర్ నైట్ క్యాంప్ ఫైర్ ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేలా చూసుకోండి. అక్కడైతే ఎవ్వరి డిస్టబెన్స్ ఉండదు. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అక్కడే మీ టెంటు ముందు మంట వేసుకుని నేచర్ ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయండి. విశాఖ దగ్గర్లో ఉండే వారు వనజంగి హిల్స్ కు వెళితే ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

English summary

Summer Date Ideas That You and Your Partner Can Enjoy in Telugu

Here are the summer date ideas that you and your partner can enjoy in Telugu. Have a look
Story first published: Saturday, May 14, 2022, 16:19 [IST]
Desktop Bottom Promotion