For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు పదుల వయసులోనే ‘ఆ’విషయాల గురించి అర్థమవుతుందా?

ముప్పై ఏళ్ల వయసులోనూ సింగిల్ గా ఉంటే సర్ ప్రైజింగ్ ఫలితాలొస్తాయట. అవేంటో మీరు చూసెయ్యండి.

|

మన దేశంలో ఒకప్పుడు 18 నుండి 20 ఏళ్లు వచ్చాయంటే చాలు పెళ్లి చేసుకునే వారు. అప్పటితరం వారిలో చాలా మంది 20 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేసుకునేవారు. వ్యవసాయమే జీవనాధరంగా ఉండే ఆ రోజుల్లో అబ్బాయికి 20 ఏళ్ల వయసు వచ్చిందంటే చాలు బతిమాలో.. బలవంతగానో పెళ్లి చేసేవారు.

Surprising Benefits of Being Single at 30

ఎందుకంటే పెళ్లి చేసుకుంటే వారికి జీవితం గురించి తెలుస్తుందని.. లోకం గురించి అవగామన కలుగుతుందని.. అప్పటి పెద్దల అభిప్రాయం. ఎందుకంటే అప్పట్లో చదువుకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఉద్యోగాల ఊసే ఎత్తేవారు కాదు. మరి ఇప్పటితరం వారిలో చాలా మంది కుర్రాళ్లు మూడు పదుల వయసు దాటినా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు.

Surprising Benefits of Being Single at 30

అమ్మాయిలు కూడా పాతికేళ్లు దాటేంత వరకు పెళ్లి ముచ్చటే వద్ధంటున్నారట. చాలా మంది మహిళలు డిగ్రీలు, పిజీలు చేసి ఉద్యోగాలు సంపాదించి, ఒకటి, రెండేళ్లు ఉద్యోగాలు చేసి తర్వాతే పెళ్లి అంటున్నారట. మరికొందరు అమ్మాయిలు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లికి ఎందుకంత తొందరంటున్నారు. ఎందుకంటే మూడు పదుల వయసు వచ్చేసరికి చాలా మందికి నిజమైన ప్రేమ ఏది.. ఆకర్షణ ఏది.. కోరిక ఏది అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే చాలా మంది తమ బంధాన్ని బలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. దీని వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

How to Avoid Divorce:వివాహ జంటలు విడాకుల వరకు వెళ్లకూడదంటే...!How to Avoid Divorce:వివాహ జంటలు విడాకుల వరకు వెళ్లకూడదంటే...!

జీవితం పట్ల అవగాహన..

జీవితం పట్ల అవగాహన..

చాలా మంది మూడు పదుల వయసు దగ్గరికొచ్చేసరికి జీవితం పట్ల ఒక అవగాహన అనేది కచ్చితంగా వస్తుంది. బంధాలు, అనుబంధాల గురించి ఒక అంచనా వస్తుంది. పెళ్లి అంటే కేవలం కోరికలు తీర్చుకోవడం మాత్రమే కాదని.. అంతకుమించిన విషయాలెన్నో ఉన్నాయని అర్థమవుతుంది. అందం, వ్యక్తిత్వం గురించి అనేక లోతులు అర్థం అవుతాయి.

స్నేహితులతో సరదాగా..

స్నేహితులతో సరదాగా..

మూడు పదుల వయసు సమీపిస్తున్నా.. సింగిల్ గా ఉంటే స్నేహితులతో సరదాగా గడిపేందుకు వీలైనంత సమయం లభిస్తుంది. తమ భాగస్వామి గురించి ఎలాంటి బాధ్యత, బరువులు ఉండవు. కాబట్టి ఇంటికి ఎప్పుడైనా రావొచ్చు.. ఎప్పుడైనా వెళ్లొచ్చనే ఫీలింగులో ఉంటారు. ముప్పై లోపే పెళ్లి చేసుకుంటే సింగిల్ లైఫ్ లో ఇంకా ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

చాలా విషయాల్లో మెచ్యూరిటీ..

చాలా విషయాల్లో మెచ్యూరిటీ..

మూడు పదుల వయసు వచ్చేసరికి మన జీవితంలో ఒక అవగాహన అనేది కచ్చితంగా ఏర్పడుతుంది. మీరు ఎవరితో మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి..ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాలపై దాదాపు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఇది కేవలం అబ్బాయిలకే కాదు... అమ్మాయిలకూ కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తను మీ మదిని ప్రేమిస్తున్నాడా? లేక మీ బాడీనా?తను మీ మదిని ప్రేమిస్తున్నాడా? లేక మీ బాడీనా?

ముందే పెళ్లి చేసుకుంటే..

ముందే పెళ్లి చేసుకుంటే..

అదే మూడు పదుల వయసు కంటే ముందే పెళ్లి చేసుకుంటే రిలేషన్ షిప్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మరచిపోయే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుల్ని కూడా దూరం చేసుకుంటారు. అదే ముప్పై ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలోపు కావాల్సినంత మెచ్యూరిటీ వస్తుంది. మీకు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంపై కచ్చితంగా క్లారిటీ వస్తుంది.

ఎలాంటి భ్రమలు ఉండవు..

ఎలాంటి భ్రమలు ఉండవు..

ముప్పై ఏళ్ల వయసు కంటే ముందే పెళ్లి చేసుకుంటే.. అది ప్రేమ, ఆకర్షణ అనే భ్రమలు ఉంటాయి. అదే మూడు పదుల వయసు వచ్చేసరికి నిజమైన ప్రేమ ఏది.. ఏది నిజమైన ఆకర్షణ అనే విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. దీని వల్ల మీరు మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మీ భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకుంటారు.

బంధం బలంగా..

బంధం బలంగా..

ఈ వయసులో భాగస్వామితో బంధం బలపడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే బంధం గురించి అంతగా క్లారిటీ ఉండదు. రిలేషన్ షిప్ లో ఎదురయ్యే సమస్యలను అంత సులభంగా గ్రహించలేరు. కొన్నిసార్లు తొందరపాటులో తప్పులు కూడా చేస్తుంటారు. అదే 30 తర్వాత ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇవి ఎదురైనా.. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు తెలుసుకుంటారు.

కొత్త ప్రపంచం..

కొత్త ప్రపంచం..

30 ఏళ్ల సమయంలో పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరికంటూ ప్రత్యేక సమయం దొరుకుతుంది. అంతేకాదు మీరు ఒక కొత్త ప్రపంచాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మీకిష్టమైన ప్రాంతాలను సరదాగా చుట్టేయ్యచు. అదే అంతకంటే ముందే పెళ్లి చేసుకుంటే.. ఇలాంటివి చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది.

30 తర్వాత..

30 తర్వాత..

ముప్పై లోపు పెళ్లి చేసుకుంటే.. రిలేషన్ షిప్ విషయంలో తొందరగా కమిట్ అయ్యామా అనే భావన కూడా కలగొచ్చు. అదే ముప్పై మీద పడితే.. మన ఆలోచనా తీరు చాలా వరకూ మారిపోతుంది. కొందరికేమో పెళ్లి చేసుకోవాలన్న కోరిక బలంగా మారొచ్చు. అంతేకాదు.. కొందరికి ఇక పెళ్లైతే చాలురా బాబూ అనిపించొచ్చు. ఆ దశలో జత కలిసే పార్ట్ నర్ పట్ల ప్రేమ, ఆప్యాయతలు గాఢంగా ఉంటాయి.

English summary

Surprising Benefits of Being Single at 30

Here are the surprising benefits of being single at 30. Take a look
Story first published:Thursday, September 9, 2021, 16:22 [IST]
Desktop Bottom Promotion