Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
సర్వే! చలికాలంలో పురుషులు శృంగారంలో ఎక్కువ మజా పొందుతారట.. ఎందుకో తెలుసా...!
వింటర్లో ఎందుకని శృంగారానికి అద్భుతమైన సమయం అని సైన్స్ చెబుతోంది.
ఈ లోకంలో ప్రతి ఒక్క జీవికి శృంగారం అనేది ఎంతో కీలకం. అందులోనూ మనుషులకు మరీ ఎక్కువ. సాధారణంగా ఎవరైనా వివాహం అయిన తర్వాత శృంగారంలో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.

ఇప్పటికే పెళ్లి చేసుకున్న వారయితే అన్ని సీజన్ల కంటే చలికాలంలో ఎక్కువగా శృంగారంలో పాల్గొనేందుకు ఎందుకు ఆసక్తి చూపుతారో ఇప్పటికే అనుభవించి ఉంటారు.

అయితే చలికాలం వచ్చేసరికి మగాళ్లకు కోరికలు ఎందుకని విపరీతంగా పెరిగిపోతాయి.. ఈ వింటర్లో పురుషులలో చాలా మంది తమ భాగస్వాముల పట్ల ఎందుకని ఎక్కువగా ఆకర్షితులవుతారు..

ఇక నవంబర్ నెలలో పెరిగే చలి గిలిలో కొత్త జంటలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఎందుకని తహతహలాడుతుంటారు.. ఇప్పటికే పెళ్లయిన వారు తమ భార్య లేదా ప్రియురాలి వెచ్చని కౌగిలిలో మునిగిపోయి.. గట్టిగా ఎందుకు హత్తుకుపోతారనే విషయాలపై కొన్ని పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

శృంగారం పట్ల ఆసక్తి..
చలికాలంలో పురుషులకు శృంగారం పట్ల ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. దీనికి కారణం ఎండాకాలంలో బాడీ అంతా చెమటతో తడిసి ముద్దయిపోయి చిరాకుగా ఉంటుంది. దీంతో జంటలు ఆ ఉక్కపోతలో ఎక్కువగా ఆ కార్యంలో పాల్గొనలేరు. ఒకవేళ పాల్గొన్నా కూడా అంతలా ఎంజాయ్ చేయలేరు. అదే చలికాలంలో అయితే ఇలాంటి సమస్యలేవీ ఉండవు. పైగా బయట చలి ఉంటే.. లోపల వెచ్చదనం కోరుకుంటారు. అందుకే భాగస్వామితో కలయికలో పాల్గొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

అత్యంత ఉత్తమం..
ఈ చలికాలంలో మగవారి శరీరమే కాదు.. ఆడవారి శరీరం కూడా వెచ్చదనం కోరుకుంటుందట. అందుకే నిపుణులు చలికాలం శృంగారానికి అత్యంత ఉత్తమ సమయమని చెబుతారు. ఈ కాలంలో బయట చల్లగా.. లోపల వెచ్చగా ఉండటంతో జంటలంతా శృంగార లోకంలో ఆనందంగా విహరిస్తారు. చాలా సేపు తమ తనువులతో ఊగిసలాడుతూ తన్మయత్వం చెందుతారు.

హెల్దీ లైఫ్..
శృంగారం అనేది ప్రతి ఒక్క జంటకు మాంచి కిక్ ఇస్తుంది. అందులోనూ నవంబరు నెలలో చలికాలంలో ఆ కార్యంలో పాల్గొంటే ఆ మజానే వేరని అంటుంటారు అనుభవజ్ణులు. ఎందుకంటే ఇద్దరి మధ్య అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని మరింత పెరిగేలా చేసేది ఈ శృంగారం.

ఒత్తిడి దూరం..
అప్పటిదాకా భార్యభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య ఏవైనా అలకలు, కోపాలు, గొడవలు ఉన్నా వాటినన్నింటినీ దూరం చేస్తుంది. ఇద్దరినీ ఏకాంతంగా గడిపేలా చేస్తుంది. దీని వల్ల వారిద్దరి ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు వీరి భవిష్యత్ కార్యాచరణకు కూడా ఇది నాంది పలుకుతుంది.

బయట చలి.. లోపల వేడి..
వింటర్ సీజన్లో చాలా మంది జంటలు ఎక్కువగా రెచ్చిపోతారు. ఈ సమయంలో బయట చలి పులి చంపుతుంటే.. లోపల మాత్రం బాడీలో నుండి వేడిని పుట్టిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ పెరుగుతుంది..
చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాలు కొత్తేమీ కాదు. అయితే ఇవి శృంగారంపై ఏ మాత్రం పెద్దగా ప్రభావం చూపవు. అదొక్కటే కాదు.. శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరి శరీరంలోనూ ఉద్వేగం పెరుగుతుంది. దీని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకే చలికాలంలో శృంగారంలో మంచిగా ఎంజాయ్ చేస్తారు.

క్లాత్ సీక్రెట్..
చలికాలంలో చలికి తట్టుకోలేక చాలా మంది ఉన్ని దుస్తులు వేసుకుంటారు. అలాగే మందంగా ఉండే బట్టలను వేసుకుంటారు. ఇలా బాడీ మొత్తం బట్టలతో కప్పబడి ఉంటే భాగస్వామికి ఏదో చేయాలనిపిస్తుందట. అందుకే వారు ఈ సమయంలో రొమాన్స్ చేయాలని ఆలోచిస్తారట. ఈ కారణంగా వారు భాగస్వామి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారట.

కొంత బద్ధకంగా..
చలికాలంలో చాలా మందికి ఒళ్లు బద్ధకంగా మారుతూ ఉంటుంది. దీని వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అందులోనూ పగలు వెలుగు తక్కువ.. త్వరగా చీకటి పడటం వల్ల బాడీలో విటమిన్ డి లోపం ఏర్పడుతుందట. దీంతో చాలా మందికి బద్ధకంగా తయారవుతారట.

బంధం బలపడుతుంది..
చలికాలంలో బద్ధకం తొలగించుకోవడానికి శృంగారం అనేది ఒక అద్భుతమైన సాధనంగా పని చేస్తుంది. మన బాడీలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ లాంటి సంతోషకరమైన హర్మోన్లు విడుదల కావడం వల్ల ఇది ఉత్తమ ఔషధంగా పని చేస్తుందట. అంతేకాదు ఇది జంటల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుందట. అలాగే ఒత్తిడిని చాలా సులభంగా తగ్గిస్తుంది.

సాక్సులు ధరించి..
ఈ చలికాలంలో సాక్సులు ధరించి శృంగారంలో పాల్గొంటే క్లైమాక్స్ చేరుకోవడానికి ఇవి బాగా పనిచేస్తాయని.. ఇవి ధరించి ఆ కార్యంలో పాల్గొంటే, మీరు ఇతరుల కన్నా ఎక్కువ ఆనందం మరియు భావప్రాప్తిని పొందుతారని ఒక పరిశోధనలో తేలింది.

సెలవులు కూడా..
చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం ఒక ఎత్తు అయితే.. కరోనా కారణంగా చాలా మంది ఇళ్ల నుండే ఎక్కువగా పని చేస్తున్నారు. కాబట్టి ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు మంచి అవకాశముంటుంది. అంతేకాదు రోజుకు, రెండు మూడుసార్లు పాల్గొనేందుకు ఛాన్స్ రావొచ్చు. దీని వల్ల కపుల్స్ మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుంది.

ప్రెగ్నెన్సీకి అనువుగా..
చలికాలంలో శృంగారంలో పాల్గొనడం వల్ల మహిళలు కూడా మంచిగా లాభపడతారంట. ముఖ్యంగా ఈ సమయం వారు ప్రెగ్నెన్సీ పొందేందుకు సమయం చాలా అనువుగా ఉంటుంది. అందుకే చాలా మంది పీరియడ్స్ టైమ్ లో హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు.

అలా చేయడం ద్వారా..
ఈ విషయం గురించి సుమారు 2 వేల మంది మహిళలను సర్వే చేయగా అందులో ఎక్కువ శాతం మంది మహిళలు హస్తప్రయోగం చేసుకోవడం ద్వారా తాము అసౌకర్యాన్ని అధిగమిస్తారని తెలిపారట.

హాట్ షవర్ బాత్..
చలికాలంలో పార్ట్ నర్ తో కలిసి షవర్ బాత్ లో వేడి నీటితో స్నానం చేస్తే ఆనందం చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే చలికాలంలో భాగస్వామి వేడిస్నానం చేసేటప్పుడు, అకస్మాత్తుగా మగవారి మానసిక స్థితి మెరుగుపడుతుందట. ఇది ఇద్దరి మధ్య సంబంధాన్ని కూడా బలపరుస్తుందట.

వీర్య ఉత్పత్తి అధికం..
చలికాలంలో వీర్యం ఉత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతుందట. ఎవరైనా ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే, అందుకు చలికాలం ఎంతో అనుకూలమైన సమయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో కంటే చలికాలంలో ఎక్కువ వీర్యం ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications