For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teddy Day 2022: టెడ్డీ డేకు, అమెరికా మాజీ ప్రెసిడెంటుకు ఉన్న లింకేంటో తెలుసా...

టెడ్డీ డే గురించి కొన్ని ఇంట్రస్టింగ్ మ్యాటర్స్ మీ కోసం...

|

ప్రేమికుల వారోత్సవాల్లో టెడ్డీ డేకు ఓ ప్రత్యేకత ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన వచ్చే ఈ టెడ్డీ డే రోజున అబ్బాయిలు తమకిష్టమైన అమ్మాయిలను ప్రేమలో పడేసి.. వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.

Teddy Day 2021: Date, Ideas, Importance, Why to Celebrate

ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువగా ఈ టెడ్డీలతోనే టైంపాస్ చేస్తుంటారు. అందుకే చాలా మంది మగవారు తమకిష్టమైన వారికి ఈ టెడ్డీ బేర్స్ ను గిఫ్టుగా ఇచ్చి వారి మదిలో చోటు కోసం తెగ తాపత్రయపడుతుంటారు.

Teddy Day 2021: Date, Ideas, Importance, Why to Celebrate

చూడటానికి ఎంతో క్యూట్ గా ఉండే ఈ టెడ్డీ బేర్ బొమ్మలకు సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఈ సందర్భంగా టెడ్డీ డే సందర్భంగా మీ పార్ట్ నర్ కు ఎలాంటి టెడ్డీ ఇవ్వాలి.. అసలు ఈ టెడ్డీ బేర్ నే బహుమతిగా ఎందుకిస్తారు.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Happy Chocolate Day 2021: చాక్లెట్ డే వెనుక ఉన్న వేల ఏళ్ల నాటి చరిత్ర గురించి తెలుసా...!Happy Chocolate Day 2021: చాక్లెట్ డే వెనుక ఉన్న వేల ఏళ్ల నాటి చరిత్ర గురించి తెలుసా...!

ప్రేమను చాటేందుకు..

ప్రేమను చాటేందుకు..

స్త్రీ, పురుషుల మధ్య ప్రేమను వ్యక్తం చేసేందుకు టెడ్డీ డే రోజు చాలా మంది మగవారు తమ ప్రియురాలికి టెడ్డీ బేర్ ను గిఫ్టుగా ఇస్తారు. అరుదైన సందర్భాల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకు గిఫ్టులిస్తుంటారు. మాజీ అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్ వెల్డ్.. కూడా ఇదే రోజున ఓ క్యూట్ టెడ్డీ బేర్ పొందారు. ఎందుకంటే హంటింగ్ ట్రిప్ లో జంతువులను వధించొద్దని ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ఈ బహుమతిని ఇచ్చారు.

అమ్మాయిలకు ఎంతో ఇష్టం..

అమ్మాయిలకు ఎంతో ఇష్టం..

చాలా మందికి టెడ్డీ డే రోజున టెడ్డీ బేర్స్ నే ఎందుకు గిఫ్టుగా ఇస్తారనే సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని గిఫ్టుల్లో టెడ్డీ బేర్ అత్యంత అందంగా.. చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. అమ్మాయిలకు కూడా ఇదంటే ఎంతో ఇష్టం. వారికి టెడ్డీబేర్ ఉంటే.. తమకిష్టమైన వ్యక్తితో కలిసి ఉన్నట్టే ఫీలవుతారట.

ఒంటరితనం లేకుండా..

ఒంటరితనం లేకుండా..

అందుకే చాలా మంది అమ్మాయిలు అనేక సందర్భాల్లో టెడ్డీనే పక్కనే ఉంచుకుంటారు. టెడ్డీ బేర్ తమ వద్ద ఉంటే.. ఒంటరిగా ఉన్నట్టు ఫీలింగే ఉండదట. అందుకే లవర్స్ తన బదులుగా ఓ టెడ్డీని ఇచ్చి పక్కనే తాము ఉన్నట్టు ధైర్యం చెబుతుంటారు.

Valentine's Day 2021:వాలెంటైన్స్ వీక్ లో ఈ హెల్దీ గిఫ్ట్ ఐడియాలను ట్రై చెయ్యండి...!Valentine's Day 2021:వాలెంటైన్స్ వీక్ లో ఈ హెల్దీ గిఫ్ట్ ఐడియాలను ట్రై చెయ్యండి...!

ఎక్కువసేపు గడుపుతున్నట్టు..

ఎక్కువసేపు గడుపుతున్నట్టు..

మీరు ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నట్టు ఫీలవుతుంటే.. ఆ ఫీలింగును మీ ప్రియురాలికి తెలియజేయాలంటే.. తనకు మీరు ఓ టెడ్డీ బేర్ ను గిఫ్టుగా ఇవ్వొచ్చు. దీని వల్ల వారు మీ ఫీలింగును అర్థం చేసుకుని.. మీతో ఎక్కువసేపు గడిపేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

టెడ్డీనే కాకుండా..

టెడ్డీనే కాకుండా..

టెడ్డీ డే రోజున ప్రతి ఒక్క లవర్ టెడ్డీలనే గిఫ్టులుగా ఇస్తుంటారు. అయితే మీరు కూడా అలాంటి బహుమతిలే ఇవ్వాలని రూలేం లేదు. మీరు టెడ్డీ బేర్ కంటే క్యూట్ గా ఉండే ఏదైనా మంచి బొమ్మను గిఫ్టుగా ఇవ్వొచ్చు. ప్రేమను వ్యక్తం చేయడానికి ఏ గిఫ్టు ఇచ్చామనేది ఇంపార్టెంట్ కాదు.. ఎలా ప్రేమను ప్రెజెంట్ చేశామన్నదే ముఖ్యం.

ఉల్లాసంగా ఉంటుందట..

ఉల్లాసంగా ఉంటుందట..

ఇంగ్లండ్ దేశంలో మూడొంతుల ప్రజలు టెడ్డీ బేర్ ను హత్తుకుని నిద్రపోతారు. వీరిలో అన్ని వయసుల వారు కూడా ఉన్నారట. ఉదయాన్నే లేవగానే టెడ్డీ బేర్ ని హగ్ చేసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉంటుందని కొందరు దీన్ని సెంటిమెంటుగా కూడా భావిస్తారట.

ఒత్తిడి మాయం..

ఒత్తిడి మాయం..

మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. మీరు నిద్రించే బెడ్ పై టెడ్డీ బేర్ ఉంటే ఒత్తిడి అంతా మాయమవుతుందని.. చాలా పరిశోధనల్లో కూడా తేలిందట.

ఇలాంటివి ఇస్తే..

ఇలాంటివి ఇస్తే..

అయితే టెడ్డీ డే సందర్భంగా.. మీరు మీ లవర్ కు టెడ్డీ బేర్ గిఫ్టుగా ఇవ్వాలనుకుంటే.. మీరు మరీ ఎక్కువ ధర పెట్టక్కర్లేదు. రోడ్ సైడ్ షాపుల్లో 100 రూపాయల నుండి చక్కని టెడ్డీలు లభిస్తాయి. ఒకవేళ హై రేంజ్ లో కావాలనుకుంటే.. బోలెడన్నీ టాయ్ షోరూమ్స్ మరియు ఆన్ లైనులో ఆకర్షించే ఆఫర్లు బోలెడన్నీ ఉంటాయి. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ కలర్ ఫుల్ టెడ్డీ బేర్ ను మీ ప్రియురాలికి గిఫ్టుగా ఇచ్చేసి బంధం బలపరచుకోండి.

FAQ's
  • వాలెంటైన్ వీక్ లో టెడ్డీ డేను ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి పదో తేదీన టెడ్డీ డేను జరుపుకుంటారు. టెడ్డీ బేర్ గిఫ్టులు ఇచ్చే సమయంలో రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి నమ్మకం ప్రకారం, రెడ్ కలర్ టెడ్డీ బేర్ స్త్రీ, పురుషుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుంది. అందుకే చాలా మంది రెడ్ కలర్ టెడ్డీ బేర్లను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.

English summary

Teddy Day 2022: Date, Ideas, Importance, Why to Celebrate

Here we are talking about the Teddy Day 2021 : Date, Ideas, Importance, why to celebrate. Read on
Desktop Bottom Promotion