Latest Updates
-
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు!
షాకింగ్! ప్రియుడిని పప్పీలా మార్చేసిన ప్రియురాలి గురించి మీకు తెలుసా..
మానవులు అన్నాక మనం కనీస గౌరవం ఇచ్చుకోవాలి. పుచ్చుకోవాలి. అంతేగాని ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు అని హితవు పలుకుతున్నారు.
ఈరోజుల్లో ప్రేమ అన్నాక ఎంతో కొంత పిచ్చి అనేది ఉంటుంది. ఇలాంటి వాటి గురించి మన తత్వవేత్తలు ఎప్పుడో వివరించారు. వారు అనుభవంతో చెప్పారో.. లేక వారికి కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలీదు కానీ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ఉదంతాలను చూస్తుంటే ప్రేమలో పడితే మరి ఇంతలా పిచ్చిగా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది.
ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో తమ ప్రేమను చాటడానికి ఎన్ని రకాల మార్గాలుంటే అన్నింటిని అనుసరిస్తున్నారు. వీరిలో కొందరు సక్సెస్ అవుతుంటే.. చాలా మంది నవ్వులపాలు అవుతున్నారు. ఇంకా కొంత మంది విమర్శలపాలవుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఒక ప్రియురాలు తన ప్రియుడిని ఏకంగా పప్పీలా మార్చేసింది. ఈ విశేషాలు ఏంటో ఈవీడియోలో మీరే చూడండి.

1) పిచ్చి పరాకాష్టకు..
అబ్బాయి కాని అమ్మాయి కాని ఎవరైనా ప్రేమలో పడితే వారు ఈ లోకాన్నే మరచిపోతారు. ఇలాంటివి మనం సినిమాల్లో ఎన్నో చూసుంటాం. మన నిజ జీవితంలోనూ చూస్తున్నాం. మరీ ఎంతలా లోకాన్ని మరచిపోయాడంటే ఒక అబ్బాయి తాను అమ్మాయికి ముగ్ధుడు అయిపోయానని నిరూపించుకునేందుకు ఎవరూ చేయలేని సాహసం చేశాడు..
2) పప్పీలా మారిపోయాడు..
తన ప్రియురాలి కోసం ఏకంగా పప్పీలా మారిపోయాడు. అంతేకాదు ఆమె అతడిని ఒక పెంపుడు జంతువులా భావించి రోడ్డు మీదకు తీసుకొచ్చింది. అంతేకాదు అతని మెడకు ఒక బెల్టు బిగించింది. అందరి ముందు తనని పెంపుడు జంతువులా తిప్పుకోవడమే కాకుండా దాన్ని ఏ మాత్రం భయం లేకుండా వీడియో తీసేసింది.

3) ఈ వీడియోపై భిన్న వాదనలు..
దీన్ని చూసిన వారంతా చాలా ఆశ్చర్యపోయారు. ఇక ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్ అయిపోయింది. అంతే దీనిపై ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఇదే స్థానంలో మహిళలు ఉండి ఉంటే ఈ పాటికే ఏమయ్యేదో అందరికీ తెలుసు అని అన్నారు. ఇంకొందరు ఆమె చేసిన పని సిగ్గుచేటుగా ఉందని ట్వీట్లు చేయడం మొదలెట్టారు.

4) తన పాదాలకు ముద్దాడుతూ..
ఇదంతా ఒక ఎత్తు అయితే అతడు ఆమె మోకాలిపై వెళ్తూ ఆమె ప్రియురాలి పాదాలను ముద్దాడటం విశేషం. దీనిపై అయితే నెటిజన్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మహిళల విషయంలో జరిగి ఉంటే ఈ పాటికే మరో యుద్ధం వచ్చి ఉండేది అని ట్వీట్లు చేస్తున్నారు. కలికాలంలో ఇంకా ఎన్ని ఘోరాలో చూడాలో అని చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.

5) గతంలో జైలుకు వెళ్లిన మహిళ..
కేవలం తన పెంపుడు జంతువును హింస పెట్టిందనే కారణంతో గతంలో ఓ మహిళకు జైలు శిక్ష విధించారు. మరి ఇప్పుడు బహిరంగంగా ఇలా చేసిన దానికి ఆమెకి ఎంత పెద్ద శిక్ష వేయాలి అని చాలా ప్రశ్నిస్తున్నారు.

6) కనీస గౌరవం ఇవ్వాలి..
ఇంకా కొందరు నెటిజన్లు మానవులు అన్నాక మనం కనీస గౌరవం ఇచ్చుకోవాలి. పుచ్చుకోవాలి. అంతేగాని ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు అని హితవు పలుకుతున్నారు. వారు ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఏ దేశం అయినా, ఏ ప్రాంతం అయినా సరే ఒక మానవుడిగా మనం కనీసం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అని సూచిస్తున్నారు.

7) సోషల్ మీడియా వల్లే..
ఇక ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి పలు సోషల్ మీడియాకు సంబంధించిన యాప్ లో అందరికీ అతి చవకగా అందుబాటులోకి రావడంతో ప్రేమికులకు, స్నేహితులకు తమ ప్రేమను చాటుకునేందుకు మార్గం చాలా సులభమైంది. అంతేకాదు చాలా మంది వీటి ద్వారా తామెంత దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్లు ఫీలవుతున్నారు.



Click it and Unblock the Notifications

