For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేటుగా పెళ్లి చేసుకుంటే.. లైంగిక సమస్యలు తప్పవా?

లేటుగా పెళ్లి చేసుకుంటే.. లైంగిక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

|

ఒకప్పుడు మన పూర్వీకులు కేవలం 11 లేదా 14 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు చేసుకునేవారు. కాలంలో మార్పుల కారణంగా అది కాస్త 18-21 వయసుకు పెరిగింది. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది పాతికేళ్లు దాటినా.. మూడు పదుల వయసు దాటిని పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి.

The Problem With Marrying Late in Life in Telugu

కొందరేమో పెళ్లి చేసుకోవడానికి ముందు భవిష్యత్తు గురించి ఎన్నో ప్లాన్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఉద్యోగం, పని ఒత్తిడి కారణంగా వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఇంకా కొందరైతే తాము ఇంకా జీవితంలో అసలు సెటిల్ అవ్వలేదని.. పెళ్లికెందుకు తొందరని అని చెబుతున్నారు. ఇవన్నీ ఓకే.. కానీ లేటుగా పెళ్లి చేసుకుంటే మాత్రం లైంగిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

The Problem With Marrying Late in Life in Telugu

ఆ కార్యంలో పాల్గొనే ముందు కొన్ని ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఈ విషయంపై అధ్యయనం చేసిన ఓ సర్వే సంస్థ లేటుగా పెళ్లి చేసుకుంటే శృంగారంలో ఎదురయ్యే సమస్యలు.. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారా లేదా అనే విషయాలపై సర్వే నిర్వహించిందట. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులొకొచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

love signs:ఎవరైనా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారనే సంకేతాలివే...!love signs:ఎవరైనా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారనే సంకేతాలివే...!

ఎంజాయ్ లెవెల్స్ తక్కువ..

ఎంజాయ్ లెవెల్స్ తక్కువ..

సాధారణంగా శృంగారంలో పాల్గొనాలని.. ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదించాలని యవ్వనంలో ప్రతి ఒక్క అమ్మాయి.. అబ్బాయి కోరుకుంటారు. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకుని ఆ కార్యంలో పాల్గొంటే లైంగిక కార్యంలో చురుగ్గా పాల్గొనలేరట. ఎందుకంటే ఈ సమయంలో మీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయట. ముఖ్యంగా సరైన వయసులో మీరు ఆ కార్యంలో పాల్గొనకపోతే చాలా నిరాశకు గురవుతారట. మీరు శృంగారాన్ని ఎంజాయ్ చేసే లెవెల్స్ తగ్గుతాయట.

భావప్రాప్తి సమస్యలు..

భావప్రాప్తి సమస్యలు..

యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ అధ్యయనంలో తేలిన దాని ప్రకారం.. ఆలస్యంగా పెళ్లి చేసుకునేవారు శృంగార జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించలేరట. వీరి బాడీలో న్యూరాన్ పనితీరు సక్రమంగా ఉండదట. అలాగే మెమొరీ లాస్ వంటి సమస్యలు కూడా వస్తాయట. ఇలా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయట. చివరికి భావప్రాప్తి విషయంలోనూ వీరు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందట.

శృంగారానికి దూరమైతే..

శృంగారానికి దూరమైతే..

మన పెద్దలు ఎప్పుడూ ఈ మాట చెబుతూ ఉంటారు. ‘ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి' అని. ఎందుకో తెలుసా.. సరైన వయసులో లైంగికంగా మీరు చాలా చురుగ్గా పాల్గొంటారు. ఆ సమయంలో మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందట. అయితే సరైన వయసులో శృంగారం చేయకపోతే ఆ లెవెల్స్ తక్కువైపోతాయట. ఎందుకంటే వీరు ఏ విషయంలోనూ త్వరగా ముందుకు సాగరట. ప్రతి దానికీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారట. దీంతో వీరు శృంగార జీవితాన్ని ఆనందంగా జీవించలేరట.

కేవలం 30 సెకన్ల పాటు ఈ ట్రిక్‌ని అనుసరించండి, అది భర్త అయినా..ప్రియుడైనా..మీ రిలేషన్ స్ట్రాంగ్!కేవలం 30 సెకన్ల పాటు ఈ ట్రిక్‌ని అనుసరించండి, అది భర్త అయినా..ప్రియుడైనా..మీ రిలేషన్ స్ట్రాంగ్!

అది బలహీనపడటం..

అది బలహీనపడటం..

సరైన సమయంలో శృంగారం చేయడం వల్ల మన శరీరంలోని కండరాలు బలపడతాయి. ఇది మూత్రాశయాన్ని బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఈ పనులు చేయకపోతే.. మీ నడుము కండరాలు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు అకాల మూత్ర విసర్జన వంటి సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు.

నిరంతర శృంగారం..

నిరంతర శృంగారం..

ఎవరైతే నిరంతరం శృంగారం చేస్తుంటారో.. అది వారికి రోగ నిరోధక వ్యవస్థ బూస్టర్ లా పని చేస్తుంది. అంతేకాదు మీరు అనారోగ్యంతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎవరైతే రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొంటారో.. వారిలో యాంటీబాడీస్ యొక్క అధిక సాంద్రతలను కలిగి ఉంటారు. ఎవరైతే సరైన సమయంలో ఆ కార్యంలో పాల్గొనక ఉంటారో.. వారిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది.

ముఖ్యంగా మగాళ్లు..

ముఖ్యంగా మగాళ్లు..

ఇక లైంగిక పరమైన విషయాల్లో.. మగాళ్లు ఎంత రెగ్యులర్ గా, చురుగ్గా ఆ కార్యంలో పాల్గొంటారో.. వారు చాలా చురుగ్గా ఉంటారట. ఎవరైతే ఇలా చేస్తారో.. వారిలో గుండె పోటు, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు తక్కువగా వస్తాయట. అలాగే రక్తపోటు సమస్య అనేదే ఉండదట. అయితే ఎవరైతే ఆ కార్యానికి దూరంగా ఉంటారో.. వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుదట.Don't put on tick mark

FAQ's
  • లేటుగా పెళ్లి చేసుకుంటే వచ్చే ప్రధాన సమస్యలు?

    ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల పురుషులు, మహిళల్లోనూ ఇద్దరిలోనూ సంతానానికి సంబంధించిన సమస్యలు మరియు లైంగిక పరమైన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సరైన వయసులో పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు.

  • ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే అనారోగ్య సమస్యలొస్తాయా?

    యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ అధ్యయనంలో తేలిన దాని ప్రకారం.. ఆలస్యంగా పెళ్లి చేసుకునేవారు శృంగార జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించలేరట. వీరి బాడీలో న్యూరాన్ పనితీరు సక్రమంగా ఉండదట. అలాగే మెమొరీ లాస్ వంటి సమస్యలు కూడా వస్తాయట. ఇలా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయట. చివరికి భావప్రాప్తి విషయంలోనూ వీరు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందట.

English summary

The Problem With Marrying Late in Life in Telugu

Here are the problem with marrying late in life in Telugu. Have a look
Desktop Bottom Promotion