For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా కాలంలో ఆ కార్యానికి కండోమ్స్ కోరుకోవట్లేదట...!

కరోనా వంటి కాలంలో చాలా మంది కండోమ్స్ వాడటం మానేశారట.

|

ప్రస్తుతం కరోనా మూడో దశ మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. మన దేశంలో వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. దీంతో చాలా మంది కపుల్స్ మళ్లీ శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

The World is Having Far Less sex using condoms during the pandemic

అయితే ఆ కార్యంలో పాల్గొనే వారిలో ప్రస్తుతం చాలా మంది కండోమ్స్ వాడటం మానేశారట. దీంతో తమ కంపెనీలకు తీవ్ర నష్టాలు వచ్చాయని ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ కారెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోహ్ మియా కియాట్ వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.

The World is Having Far Less sex using condoms during the pandemic

వ్యాపారులు ఎన్నో నష్టాలను చవి చూశారు. విద్యార్థులు సైతం తీవ్రంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వీటన్నింటికంటే కరోనా కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద కండోమ్ తయారీదారు సంస్థ కూడా తీవ్రంగా నష్టపోయిందట. గత రెండు సంవత్సరాల్లో కండోమ్స్ ఉత్పత్తి దాదాపు 40 శాతం తగ్గిపోయిందట. అయితే కరోనా తొలి దశలో మాత్రం కరోనా విపరీతంగా డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. అయితే అకస్మాత్తుగా కండోమ్స్ ఉత్పత్తి తగ్గుదల ఎందుకు జరిగింది.. కండోమ్స్ విక్రయాలు ఎందుకు తగ్గిపోయాయనేందుకు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Dhanush Divorce:కపుల్స్ మధ్య విడిపోయేంత దూరం పెరిగేందుకు ప్రధాన కారణాలేంటో తెలుసా...Dhanush Divorce:కపుల్స్ మధ్య విడిపోయేంత దూరం పెరిగేందుకు ప్రధాన కారణాలేంటో తెలుసా...

ప్రధాన కారణాలివే..

ప్రధాన కారణాలివే..

కరోనా మహమ్మారి కాలంలో ఎక్కువ సంఖ్యలో హోటళ్లు, లైంగిక సంరక్షణ కేంద్రాలు, ఇతర క్లీనిక్ లను మూసివేయడం, ఆయా దేశాల్లో ప్రభుత్వాలు కండోమ్ హ్యాండ్ అవుట్ ప్రోగ్రామ్ లను నిలిపేయడం, కొందరు కండోమ్ తో ఇక తమకు అవసరం లేదనుకోవడం.. ఇతర కారణాల వల్ల కారెక్స్ కండోమ్స్ సేల్స్ తగ్గిపోవడానికి ప్రధాన కారణమని గోహ్ వివరించారు.

గతంలో రెట్టింపు..

గతంలో రెట్టింపు..

కరోనా తొలి దశలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో.. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. అప్పుడు కండోమ్ కు బాగా డిమాండ్ పెరిగింది. అంతేకాదు ఆ సమయంలో రెట్టింపు స్థాయిలో కండోమ్ ఉత్పత్తి, అమ్మకాలు జరిగాయి. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు రావచ్చని అంచనా వేశారట. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయట.

ఏడాదిలో ఎన్నంటే..

ఏడాదిలో ఎన్నంటే..

కారెక్స్, డ్యూరెక్స్ వంటి బ్రాండ్లను తమ కంపెనీ ఉత్పత్తి చేస్తుందని గోహ్ చెప్పారు. వీటితో పాటు రుచికరంగా ఉండే డ్యూరెన్ వంటి ప్రత్యేకమైన కండోమ్ లను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. తమ కంపెనీ ఒక ఏడాదికి 5 బిలియన్లకు పైగా కండోమ్స్ ను ఉత్పత్తి చేస్తుందని.. వీటిని 140 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.

పెళ్లికి ముందే మీ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేసుకోండి...!పెళ్లికి ముందే మీ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేసుకోండి...!

18 శాతం తగ్గుదల..

18 శాతం తగ్గుదల..

కండోమ్స్ బిజినెస్ తగ్గిపోవడంతో.. ఉత్పత్తి కూడా సగానికి తగ్గడంతో.. గత రెండు సంవత్సరాల్లో కరెక్స్ షేర్లు దాదాపు 18 శాతం పడిపోయాయి. ఈ సమయంలో మలేషియా బెంచ్ మార్క్ స్టాక్ ఇండెక్స్ 3.1% కోల్పోయినట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐదు కండోమ్ లను తయారు చేసే మలేషియాకు చెందిన ఈ కంపెనీ.. ఇప్పుడు వేగంగా డెవలప్ అవుతున్న మెడికల్ గ్లోవ్స్ తయారీ వ్యాపారంలోకి వెళ్తోందని.. ఈ ఏడాది థాయ్ లాండ్ లో ప్రొడక్షన్ ను ప్రారంభించాలని, అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గోహ్ నివేదికలో తెలిపారు.

మన దేశంలో..

మన దేశంలో..

గతంలో ఎక్కడ కరోనా సోకుతుందనే భయంతో చాలా మంది లాక్ డౌన్ సమయంలో కండోమ్ లను విపరీతంగా వాడేవారు. మెట్రో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా మంది ఆ కార్యానికి కండోమ్స్ కచ్చితంగా వాడేవారు. తమ పనులన్నీ ఆన్ లైనులోనే ఎక్కువగా జరుగుతుండటంతో.. కండోమ్ కంపెనీలన్నీ ఈ మార్పును గమనించాయి. దీంతో తమకు డిమాండ్ పెరుగుతుందని ఊహించి.. విపరీతంగా కండోమ్స్ ఉత్పత్తి చేశాయి. అంతేకాదు ధరలను సైతం పెంచేశాయి. అయినా కూడా ఆ సమయంలో కండోమ్స్ విక్రయాలకు ఎలాంటి బ్రేకులు పడలేదు. అయితే దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయడంతో.. మెట్రో నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, ఇతర వ్యవస్థలన్నీ అందుబాటులోకి రావడంతో చాలా మంది కండోమ్స్ వాడకాన్ని దాదాపు తగ్గించేశారు.

శృంగార కార్యం..

శృంగార కార్యం..

2020 సంవత్సరంలో మూడు రెట్లు కండోమ్స్ వాడకం పెరిగాయి. అయితే 2021 సంవత్సరంలో శృంగారంలో పాల్గొనే వారు మాత్రం కండోమ్స్ వాడకాన్ని దాదాపుగా తగ్గించేశారట. గతంలో మన హైదరాబాదీలు కండోమ్ వాడకంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు డాంజో యాప్ ప్రకటించింది. దీంతో అక్కడ ఏ స్థాయిలో శృంగార కార్యకలాపాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతి స్థానం చెన్నై, జైపూర్ లో ఎక్కువగా జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

FAQ's
  • కరోనా కాలంలో కండోమ్స్ అమ్మకాలు తగ్గిపోవడానికి కారణాలేంటి?

    కరోనా మహమ్మారి కాలంలో ఎక్కువ సంఖ్యలో హోటళ్లు, లైంగిక సంరక్షణ కేంద్రాలు, ఇతర క్లీనిక్ లను మూసివేయడం, ఆయా దేశాల్లో ప్రభుత్వాలు కండోమ్ హ్యాండ్ అవుట్ ప్రోగ్రామ్ లను నిలిపేయడం, కొందరు కండోమ్ తో ఇక తమకు అవసరం లేదనుకోవడం.. ఇతర కారణాల వల్ల కారెక్స్ కండోమ్స్ సేల్స్ తగ్గిపోవడానికి ప్రధాన కారణమని గోహ్ వివరించారు.కరోనా తొలి దశలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో.. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. అప్పుడు కండోమ్ కు బాగా డిమాండ్ పెరిగింది. అంతేకాదు ఆ సమయంలో రెట్టింపు స్థాయిలో కండోమ్ ఉత్పత్తి, అమ్మకాలు జరిగాయి. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు రావచ్చని అంచనా వేశారట. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయట.

English summary

The World is Having Far Less sex using condoms during the pandemic

Here are the world is having far less sex using condoms during the pandemic. Have a look
Story first published:Friday, January 21, 2022, 11:16 [IST]
Desktop Bottom Promotion