For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగాళ్లు చెప్పే ఏ రకమైన అబద్ధాలను అమ్మాయిలు ఎక్కువగా నమ్ముతారో తెలుసా...

మగాళ్లు చెప్పే ఇలాంటి అబద్ధాలను అమ్మాయిలు ఈజీగా నమ్మేస్తారట.

|

మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అబద్ధం అనేది చెబుతూ ఉంటాం. కొందరేమో అబద్ధాన్ని అతికినట్టు చెబుతారు. మరికొందరు అబద్ధం చెప్పడంలో తడబడతారు.

These Common Lies Women Believe About Men In Telugu

అయితే అబద్ధాలు చెప్పే విషయంలో అమ్మాయిల కన్నా అబ్బాయిలే టాపర్లుగా ఉన్నారట. ఇదిలా ఉండగా.. బ్రిటన్లోని పోర్ట్స్ మౌత్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో మహిళల కంటే మగాళ్లే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని తేలిందట.

These Common Lies Women Believe About Men In Telugu

వీరి అధ్యయనం ప్రకారం, అబద్ధాలు చెప్పే వారిలో 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తారట. మిగిలిన 60 శాతం మంది అబద్ధాలు మాత్రమే చెబుతారట. మగాళ్లు ఎక్కువగా చెప్పే అబద్ధాలను అమ్మాయిలు ఎలాగో నమ్మరు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు.. నిజాల గురించి తమకు, తమ భాగస్వామికి తెలిసేంతవరకు అది అబద్ధమని వారు నమ్మరట. ఈ సందర్భంగా మగాళ్లు ఎక్కువగా ఎలాంటి అబద్ధాలు చెప్పి అమ్మాయిలను నమ్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ భర్త చూపు ఇతర స్త్రీల వైపు పోకూడదంటే.. ఇలా చేయండి...మీ భర్త చూపు ఇతర స్త్రీల వైపు పోకూడదంటే.. ఇలా చేయండి...

నువ్వు లేకుండా నేనుండలేను..

నువ్వు లేకుండా నేనుండలేను..

చాలా మంది మగాళ్లు తమ వైవాహిక జీవితంలో ఇలాంటి అబద్ధాన్ని ఎక్కువగా చెబుతారట. ముఖ్యంగా తన భార్య పుట్టింటికి వెళ్లే సమయంలో భర్తలు భార్యపై ప్రేమను వ్యక్తపరుస్తూ ‘నువ్వు లేకుండా నేను ఉండలేను' అని చెబుతూ ఉంటారట. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంటుందట. భార్య ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్తుందా? తమ బ్యాచ్ లర్ లైఫ్ ను మరోసారి ఆనందంగా గడిపేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తారట. భర్తగా భార్య ముందు చేయలేనివన్నీ తమ భాగస్వామి వెళ్లిపోయాక అన్నింటినీ ఎంచక్కా ఎంజాయ్ చేస్తారట.

తనను చూడలేదు..

తనను చూడలేదు..

మగాళ్ల కళ్లు మామూలుగానే కుదురుగానే ఉండవు. అదీ ఎవరైనా అందమైన అమ్మాయి కనబడితే చాలు.. కనురెప్పలు కొట్టకుండా అలానే తదేకంగా చూస్తు ఉంటారు. అదే పెళ్లి జరిగిన తర్వాత కూడా అదే చేసినప్పటికీ, తమ భార్య ముందు మాత్రం ఆ విషయాన్ని అస్సలు ఒప్పుకోరట. నేను ఆ అమ్మాయిని చూడలేదు.. అక్కడ ఏదో డిజైన్ బావుంది లేదా ఇంకా ఏదైనా కారణాన్ని చెబుతారట.

భయాల గురించి..

భయాల గురించి..

సాధారణంగా మగాళ్లందరూ చాలా ధైర్యంగా, బలంగా ఉంటారని చెబుతూ ఉంటారు. ఇలాంటి వారితో తాము సేఫ్ గా ఉన్నామని ప్రతి ఒక్క మహిళ భావిస్తు ఉంటుంది. అయితే వాస్తవానికి, మగాళ్లు కూడా అమ్మాయిల మాదిరిగానే ఎమోషనల్ అవుతారట. వారికి కూడా సెన్సిటివ్ మనసు ఉంటుందని, వారికి కూడా భయమేస్తుందట. అయితే అది వారు బయటపెట్టరట.

పెళ్లయిన వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడనడానికి ఇవే సంకేతాలు... జాగ్రత్త...!పెళ్లయిన వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడనడానికి ఇవే సంకేతాలు... జాగ్రత్త...!

రొమాన్స్ విషయంలో..

రొమాన్స్ విషయంలో..

ప్రతి ఒక్క మగాడికి రొమాన్స్ విషయంలో పూర్తి అవగాహన ఉంటుందని.. తాము ఆ కార్యం పట్ల ఎంతో ఆసక్తితో ఉన్నామని.. తమకంతా తెలుసనే భావనలో ఉంటూ.. అమ్మాయిల ముందు ఫోజులు కొడతారట. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంటుందట. ఎందుకంటే చాలా మంది మగాళ్లకు సెక్స్ గురించి పూర్తిగా తెలియదు. వారిలో కొందరు ఉన్నతంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ విషయంలో అమ్మాయిలు కొన్ని భంగిమల పట్ల అవగాహన పెంచుకోవాలని, రక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

గొప్పలు చెప్పుకోవడం..

గొప్పలు చెప్పుకోవడం..

మనలో చాలా మంది మగవారు గొప్పలు చెప్పుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా కెరీర్ విషయానికొస్తే.. తాము చిన్నప్పటి నుండి కష్టపడి పైకొచ్చామని చెబుతారు. కానీ ఇదంతా నిజం కాదు. చాలా మందికి పేరేంట్స్ బ్యాక్ గ్రౌండ్, ఇతర మద్దతు ఉంటుంది.

FAQ's
  • మగాళ్లు ఎక్కువగా అబద్ధాలు చెబుతారని ఎవరు తేల్చారు?

    మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అబద్ధం అనేది చెబుతూ ఉంటాం. కొందరేమో అబద్ధాన్ని అతికినట్టు చెబుతారు. మరికొందరు అబద్ధం చెప్పడంలో తడబడతారు. అయితే అబద్ధాలు చెప్పే విషయంలో అమ్మాయిల కన్నా అబ్బాయిలే టాపర్లుగా ఉన్నారట. ఇదిలా ఉండగా.. బ్రిటన్లోని పోర్ట్స్ మౌత్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో మహిళల కంటే మగాళ్లే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని తేలిందట. వీరి అధ్యయనం ప్రకారం, అబద్ధాలు చెప్పే వారిలో 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తారట. మిగిలిన 60 శాతం మంది అబద్ధాలు మాత్రమే చెబుతారట.

English summary

These Common Lies Women Believe About Men In Telugu

Here are these common lies women belive about men in Telugu. Take a look
Story first published:Saturday, April 23, 2022, 15:45 [IST]
Desktop Bottom Promotion