For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు మగాళ్లలో ఎక్కువగా ఏం గమనిస్తారో తెలుసా...

|

మన సమజాంలో యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆపోజిట్ జెండర్ విషయంలో ఆకర్షణకు గురవుతూ ఉంటారు. ప్రతి ఒక్క స్త్రీ, పురుషులు తమ ఊహా లోకంలో విహరిస్తూ.. తమ భాగస్వామి గురించి ఏవేవో కలలు కంటూ ఉంటారు.

అయితే మనలో చాలా మంది మగాళ్లకు ఒక అమ్మాయి ఎలా ఉంటే తనకు నచ్చుతుందనే విషయంలో కొంచెం స్పష్టత ఉంటుంది. ఎందుకంటే మగాళ్ల సైకాలజీ దాదాపు ఒకే రకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో చిన్న చిన్న మార్పులు మినహా అమ్మాయిల విషయంలో అబ్బాయిలంతా దాదాపు ఒకేరకంగా ఆలోచిస్తారట. తమకు కాబోయే పార్ట్నర్ అందంగా ఉండాలి..

అందరితోనూ త్వరగా కలిసిపోవాలి.. తమతోనే ఎక్కువగా మాట్లాడాలి. తననే ప్రేమించాలి.. ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే, మగాళ్ల విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి.. వారికి మగాళ్లలో ఎలాంటి విషయాలు నచ్చుతాయి..

ఎలాంటి పురుషులంటే స్త్రీలు ఇష్టపడతారు? ఏ పనులు చేస్తే.. అమ్మాయిలు అబ్బాయిలపై ఇష్టం పెంచుకుంటారు.. ఎలాంటి పనులు చేస్తే అమ్మాయిలకు నచ్చవు.. మిమ్మల్ని ఒక అమ్మాయిలు ఇష్టపడుతుందో లేదో తెలుసుకోవడం ఎలా అనే ఆసక్తికరమైన విషయాలను సైకాలజీ ఆధారంగా తెలుసుకుందాం రండి...

పెద్దలు చేసే పెళ్లిలో ముఖ్య ప్రయోజనాలు.. నష్టాలివే...!

పర్సనాలిటీ..

పర్సనాలిటీ..

ఈ విషయం చాలా మంది మగాళ్లకు తెలుసు. చాలా మంది మహిళలు మగవారి శరీర ధారుడ్యాన్ని బాగా ఇష్టపడతారు. ఎవరైతే ఆరడుగులు హైట్ ఉంటారో.. ఎవరికైతే జిమ్ బాడీ ఉంటుందో.. ఎవరైతే ఫిట్ గా ఉంటారో.. వారిపై మోజు పెంచుకుంటారట. ఇవన్నీ ఆకర్షణీయమైనవే అయినప్పటికీ.. అందరికీ ఇలా ఉండదట. ఇది వారి వ్యక్తిగత లక్షణాలను బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన ఎత్తు, పర్ఫెక్ట్ వెయిట్ ఉండే పురుషులను చూసినప్పుడు చాలా మంది స్త్రీలు ప్రభావితమవుతారట.

అందంగా ఉంటే..

అందంగా ఉంటే..

చాలా మంది మహిళలు అందంగా, హ్యాండ్సమ్ గా ఉండే పురుషులపై ఎక్కువ ఆసక్తి చూపుతారట. అయితే మగాళ్లు అందంగా ఉన్నంత మాత్రాన వారిని ఇష్టపడరట.. అందంగా ఉండే పురుషుల డ్రస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్ తో పాటు ప్రాథమిక పరిశుభ్రతను ఎవరైతే పాటిస్తారో వారికి అమ్మాయిల నుండి కావాల్సినంత మద్దతు లభిస్తుందట. అయితే అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడాలంటే కేవలం ఇవి మాత్రమే కాదు.. మరికొన్ని విషయాల్లో మీరు మెరుగవ్వాలి. అవేంటో చూద్దాం.

చిరునవ్వు..

చిరునవ్వు..

అమ్మాయిలు అబ్బాయిల పర్సనాలిటీ, ఫిట్ నెస్, హెయిర్ స్టైల్, డ్రస్సింగ్ స్టైల్ తో పాటు వారి ప్రవర్తనను కూడా అంచనా వేస్తారట. ముఖ్యంగా మీ ముఖంలో చిరునవ్వును ఎక్కువగా గమనిస్తారట. ఎవరికైతే నవ్వే సామర్యంతో పాటు ఇతరులను నవ్వించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందో.. వారిని అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారట. అయితే అస్తమానం నవ్వితే మాత్రం.. ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ పాట్టర్ వివరించారు. మీరు నవ్వే విధానం ఎదుటివ్యక్తులకు వ్యతిరేక సంకేతం పంపే అవకాశం ఉందని, కాబట్టి మీ చిరునవ్వు సహేతుకంగా మంచిగా కనిపించే దంతాలను ప్రదర్శించాలని సూచిస్తున్నారు. ఇలాంటి వారితో పరిచయం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారట. మరికొందరు అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని జిమ్ కి వెళ్లి సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ వంటివి పెంచుతూ ఉంటారట. ఇలా చేయడం కొందరు మహిళలకు ఇష్టపడరట. చూడటానికి కాస్త బాగుండి, ఆరోగ్యంగా ఉంటే.. అలాంటి త్వరగా దగ్గరవుతారట.

లేడీస్ చేసే ఈ పనులతో మగాళ్లకు ఉత్సాహం ఉరకలేస్తుందట...!

ఆత్మవిశ్వాసం..

ఆత్మవిశ్వాసం..

పురుషుల్లో ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందో.. అలాంటి వారిని అమ్మాయిలు ఆకర్షణీయంగా చూస్తారు. న్యూఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో సైక్రియాటీ మరియు సైకో థెరపీ విభాగానికి అధిపతి అయిన డాక్టర్ సమీర్ మల్హోత్రా ప్రకారం, ఎవరైనా అమ్మాయిని కలిసిన నిమిషాల్లోనే కొందరు మగాళ్లలోని విశ్వాసాన్ని కనుగొంటారని, ముఖ్యంగా మీరు ఎలా ఉంటారు, మీరు ఎంత స్పష్టతతో ఉంటారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. పరిస్థితలకు తగ్గట్టు నడుచుకుంటారా లేదా అనే విషయాలను అమ్మాయిలు లోతుగా గమనిస్తారట. అయితే కొందరు పురుషులు ఆత్మవిశ్వాసం కంటే అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఆత్మవిశ్వాసం మరియు అహంకారం రెండూ ఓకేచోట ఉండవు.

మాట్లాడే తీరు..

మాట్లాడే తీరు..

మాటలకు చాలా పవర్ ఉంటుంది. కొందరి మగాళ్ల మాటలు తూటాల్లా పేలుతూ ఉంటాయి. మరికొందరు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అందరినీ నవ్వించడం.. నవ్వుతూ ఉండటం వంటివి చేస్తుంటారు. ఇలాంటి మగాళ్లంటే మహిళలు ఆసక్తి చూపుతారట. కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడినా.. సంబంధం లేని అనవసర విషయాలు మాట్లాడితే మాత్రం మహిళలకు ఏ మాత్రం నచ్చదట. అలాగే ఎవరైతే పురుషులు సైలెంట్ గా ఉంటారో.. తాము మాట్లాడినా కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే.. అలాంటి వారిని అసహ్యించుకుంటారట.

కళ్లను చూసి...

కళ్లను చూసి...

మనలో చాలా మంది అబ్బాయిలు ఎలాంటి వారో.. కళ్లను చూసే అమ్మాయిలు పసిగట్టేస్తారట. వారి చూపులను బట్టి.. వారు చూసే విధానం బట్టి.. అన్ని విషయాలను పరిశీలిస్తారట. ముఖ్యంగా సెన్సాఫ్ హ్యుమర్ కలిగిన పురుషులంటే అమ్మాయిలు బాగా లైక్ చేస్తారట. ఎల్లప్పుడూ సరదాగా, సంతోషంగా, స్పోర్టివ్ గా ఉండే వాళ్లంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారట. ఇక టీనేజ్ అమ్మాయిలైతే ఎవరైతే అబ్బాయిలు ఎక్కువగా కవ్వించే పనులు చేస్తారో.. అలాంటి వారిని ఇష్టపడతారట. అందం, తెలివితో పని లేకపోయినా కాస్త స్టైలీష్ గా ఉంటే వారి వైపు ఇట్టే అట్రాక్ట్ అయిపోతారట.

అలవాట్ల విషయంలో..

అలవాట్ల విషయంలో..

అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు, ఆచరణల విషయానికొస్తే.. అమ్మాయిలు, అబ్బాయిలు భిన్నంగానే ఉంటారు. అయితే కొందరు అబ్బాయిలు ఏం చేసినా.. ఏం చెప్పినా.. అందులో లోపాలు ఎత్తి చూపడం, వారిని ఎగతాళి చేయడం, తమకే అంతా తెలుసనేలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలో ఎదుటివారిని తక్కువ చేసి చూడటమే కాదు.. వారిని నిరుత్సాహానికి గురి చేస్తుంటారు. అలాంటి లక్షణాలు, అలవాట్లు ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఏ మాత్రం ఇష్టపడరట. ఎవరైతే తన అలవాట్లను, అభిరుచుల్ని గౌరవిస్తారో వారికి మాత్రమే ఓకే చెప్తారట.

English summary

These Things Women Notice About Men in Telugu

Here are these things women notice about men in Telugu. Have a look
Story first published: Saturday, October 16, 2021, 14:00 [IST]