Latest Updates
-
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
2020లో ఈ టాలీవుడ్ స్టార్ల ఇంట్లో పెళ్లి బాజాలు మోగొచ్చు...
2020 సంవత్సరంలో పెళ్లీ పీటలెక్కనున్న టాప్ టాలీవుడ్ స్టార్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ సినీ స్టార్ల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తు ఉంటారు. అయితే ఆ టాలీవుడ్ స్టార్ల వివాహాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను తెగ వైరల్ చేస్తుంటారు.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సంగతిని పక్కనబెడితే టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగానే మోగే అవకాశాలున్నాయి. కరెక్టుగా పెళ్లిళ్ల సీజన్లలో కరోనా మహమ్మారి రావడంతో చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణాలను వాయిదా వేసుకున్నారు.

ఇప్పటికే ఫిక్స్ చేసిన ముహుర్తాలను వాయిదా వేయలేక, ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా కొందరు లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ పెళ్లి తంతుని ముగించేశారు.

వారిలో హీరో నిఖిల్, నిర్మాత దిల్ రాజు(రెండో వివాహం), జబర్దస్త్ మహేష్ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. అయితే నితిన్ నిశ్చితార్థం చేసుకోగా.. బాహుబలి విలన్ రానా రోకా ఫంక్షన్ చేసుకున్నారు.

పెళ్లి తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వీరి సంగతి ఇలా ఉంటే ప్రభాస్, వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాదిలోనే పెళ్లిళ్లు చేసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో పాటు విజయ్ దేవరకొండ ఇతర స్టార్ల పెళ్ళిళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రానా-బజాజ్
భళ్లాలదేవుడు మే నెలలో మిహీకా బజాజ్ తో వివాహానికి రెడీ అయినట్లు ‘ఇట్స్ అఫీషియల్' అంటూ మే నెలలో సడన్ గా అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాదు నిశ్చితార్థానికి ముందు జరిగే రోకా ఫంక్షన్ ను కూడా అతి తక్కువ మంది అతిథులతో సింపుల్ గా ముగించాడు. ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తామని చెప్పాడు. అది కూడా 2020లోపే పెళ్లి చేసుకుంటానని కన్ఫార్మ్ చేశాడు.

డార్లింగ్ ప్రభాస్..
డార్లింగ్ ప్రభాస్ వివాహం గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. తనకు అనుష్కతో పెళ్లి అవుతున్నట్లు ఎక్కువ రుమార్లు వచ్చాయి. అయితే వీటిని ప్రభాస్, అనుష్క చాలాసార్లు బహిరంగంగా కొట్టి పారేశారు. అయితే ఈ ఏడాది పెళ్లి కన్ఫార్మ్ అని క్రిష్ణం రాజు ఓ కార్యక్రమంలో చెప్పారు. కానీ అంతలోనే కరోనా రావడంతోనే ప్రభాస్ పెళ్లి కూడా ఆగిపోయింది.

నితిన్ నిశ్చితార్థం..
టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ కూడా ఇదే ఏడాది ఫిబ్రవరిలో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న తను కుటుంబసభ్యులను ఒప్పించి మరీ పెళ్లికి రెఢీ అయ్యాడు. ఏప్రిల్ లో విదేశాల్లో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే అంతలోనే కరోనా వచ్చి తన కళ్యాణాన్ని వాయిదా వేసింది. త్వరలోనే తన పెళ్లి తేదీలను ప్రకటిస్తానని చెప్పాడు.

అక్కినేని అఖిల్
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఇది వరకే నిశ్చితార్థం పూర్తి చేసుకున్నాడు. డిజైనర్ శ్రియా భూపాలత్ గత ఏడాదే గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల వారి మ్యారెజ్ క్యాన్సిల్ అయ్యింది. అయితే త్వరలోనే అఖిల్ కూడా పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

క్లారిటీ ఇవ్వని ఇస్మార్ట్ శంకర్..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని పెళ్లి విషయం వచ్చేసరికి క్లారిటీ ఇవ్వడం లేదు. పెళ్లి గురించి ఎప్పడు అడిగినా ఇంకా ఏమి అనుకోలేదు అనే సమాధానాలే ఎక్కువగా చెబుతున్నాడు.

శర్వానంద్
టాలీవుడ్ లో విలక్షణమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే శర్వానంద్ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తన నిజ జీవితంలో ఎలాంటి ప్రేమ కథలు లేవని, కానీ తనకు ‘మజిలి'లో సమంత లాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మరి తనకు అలాంటి అమ్మాయి ఎప్పుడో దొరుకుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

వరుణ్ తేజ్..
మెగా ఫ్యామిలీలో ఈ ఏడాదిలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు ప్రకటించాడు. వరుణ్ తేజ్ గుంటూరుకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి కూతురిని పెళ్లాడనున్నట్లు క్లారిటీ వచ్చింది.అంతేకాదు వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీరి వివాహం 2020లోనే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో వరుణ్ చెల్లి నిహారిక వివాహం కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ దేవర కొండ వివాహం?
‘పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి'తో బాగా పాపులర్ అయ్యాడు. అయితే అదే సమయంలో వివాహం గురించి ప్రశ్నించగా.. తాను కెరీర్ లో ఇంకా సెటిల్ అవ్వాల్సింది చాలా ఉందని, జీవితంలో సాధించాల్సింది చాల ఉందని, అందుకే ఇప్పటివరకు నా మనసులో పెళ్లి అన్న విషయాన్ని పక్కన పెట్టినట్టు చెప్పుకొచ్చాడు.

సాయి ధరమ్ తేజ్..
మెగా కుటుంబంలో మరో బ్యాచ్ లర్ సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి కూడా పుకార్లు బాగా ఉన్నాయి. ఈ హీరో రెజీనానే వివాహం చేసుకుంటారని బాగా ప్రచారం జరిగింది. అయితే తాను మాత్రం పెళ్లి గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

రాజ్ తరుణ్ ..
తెలుగు సినిమా రంగంలో వరుస విజయాలతో ఒక వెలుగు వెలిగిన టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్. ఇంతకుముందే తాను ప్రేమలో ఉన్నానని చెప్పిన రాజ్ తరుణ్ పెళ్లి విషయాన్ని కూడా కన్ఫార్మ్ చేశాడు. తాను విజయవాడకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని, తాను సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి అని క్లారిటీ ఇచ్చాడు. అయితే పెళ్లి తేదీలను మాత్రం చెప్పలేదు.



Click it and Unblock the Notifications











