Latest Updates
-
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
ఈ 5 రాశి చక్రాల వారికి జోడి ఎప్పటికీ కుదరదని మీకు తెలుసా...!
ఈ విశ్వంలో ఎక్కడైనా భూమి, నీరు, గాలి మరియు, అగ్ని వంటి అంశాలు ఉన్నాయి. గాలి మరియు అగ్ని మూలకాలు బాగా కలిసి పని చేస్తాయి
''కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు'' అలాగే కొన్ని సందర్భాలలో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారి మధ్య కెమిస్ట్రీ చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే ఈ విషయం వారిద్దరికీ తప్ప అపరిచితులకు తెలుస్తూ ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే, కొన్ని రాశి చక్ర గుర్తులు కలిసి ఉండేందుకు చాలా అనుకూలంగా ఉంటాయి.

అయితే మరి కొన్ని రాశి చక్రగుర్తుల వారు పాము, ముంగిస లాగా గొడవ పడతారంట. అంతేకాదు వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారట. అయితే రాశి చక్రాలను బట్టి అనుకూలతలు, ప్రతికూలతలు ఎలా గ్రహించాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీని పూర్తిగా చూడండి. జ్యోతిష్య శాస్త్రం, నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఏయే రాశులకు జోడి అనేది అస్సలు కుదరదో తెలుసుకోండి...

పంచభూతాలలో...
ఈ విశ్వంలో ఎక్కడైనా భూమి, నీరు, గాలి మరియు, అగ్ని వంటి అంశాలు ఉన్నాయి. గాలి మరియు అగ్ని మూలకాలు బాగా కలిసి పని చేస్తాయి. అదే విధంగా భూమి మరియు నీటి జతలు అనుకూలంగా పని చేస్తాయి. అయితే అగ్నికి నీటిని జత చేస్తే ఇవి రెండు అంత బాగా కలిసి ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటి వాటినే ఉదాహరణగా చెప్పారు. అలాగే రెండు రాశి చక్రాల సంకేతాల జంట అనేది చాలా ముఖ్యమైనది. వాటికి ప్రేమలో లేదా వివాహ బంధంలో జోడి కుదురుతుందా లేదా చూద్దాం...

కుంభం మరియు మకర రాశులు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభం మరియు మకర రాశులు పక్కపక్కనే ఉంటాయి. అయితే వీటిని జత చేస్తే.. ఈ రాశి చక్ర గుర్తుల యొక్క సహజ లక్షణాల కారణంగా వీరు తరచుగా గొడవ పడే అవకాశాలు ఉన్నాయి.

అసౌకర్యమైన అనుభూతి..
ఈ రెండు రాశి చక్రాలు ఎక్కువగా విడిపోవడానికి ఆసక్తి చూపుతుంటారు. వీరిలో మకర రాశి వారు తరచుగా ఆధిపత్యం చెలాయించేందుకు డిమాండ్ చేయవచ్చు. ఇది కచ్చితంగా కుంభ రాశి వారికి అసౌకర్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే కుంభ రాశి వారు స్వేచ్ఛ భావన అనే దానికి ఎంతో విలువ ఇస్తారు. అందుకే ఈ రెండు రాశుల మధ్య అనుబంధం దాదాపు అసాధ్యమని చెప్పొచ్చు.

సింహ మరియు కర్కాటక రాశులు..
ఈ రెండు రాశుల వారు అనుబంధం మరియు ప్రేమను పొందడానికి చాలా భిన్నమైన మార్గాలను కలిగి ఉంటారు. కర్కాటక రాశి వారు కుటుంబ ఆధారిత వ్యక్తులు. వీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, వీరు భావోద్వేగ స్థిరత్వం కోసం చూస్తారు. దీనిని జీవితకాల వ్యవహారంగా మార్చడానికి రిలేషన్ షిప్ ను పెంచేందుకు ప్రయత్నిస్తారు.

అంతా సులభం కాదు..
అయితే సింహ రాశి వారికి ఇది అంతా సులభం కాదు. వీరు అంత సులభంగా ప్రేమలో పడరు. ఎందుకంటే వీరు తమను తాము ఎంతగానో విలువైన వారుగా భావిస్తారు. అంతేకాదు ఈ రాశి వారు చాలా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఒకవేళ కర్కాటక రాశి వారితో ప్రేమలో పడితే, వీరిదే పైచేయి ఉండాలని భావిస్తారు.

కన్య మరియు ధనస్సు రాశులు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్య మరియు ధనస్సు రాశుల వారిని ‘చదరపు కారకం‘ అని పిలుస్తారు. ఈ మూలకం వీరిని అనుకూల సంకేతాలుగా చేస్తుంది. అయితే ధనస్సు రాశి వారిని సులభంగా కన్య రాశి వారు సులభంగా చికాకు పరుస్తారు. వీరి సహజ ప్రవర్తన, సరసాల వంటి వాటితో సులభంగా గొడవలు ప్రారంభమవుతాయి.

ఆధిపత్య ధోరణి..
ఒకవేళ ఈ రెండు రాశుల వారు సంబంధంలో ఉన్నప్పుడు లేదా ప్రేమలో ఉన్నప్పుడు లేదా కార్యాలయంలో ఒకే చోట పని చేస్తున్నా సరే, ఒకరిపై ఒకరు మరొకరు ఆధిపత్యం చెలాయించే ధోరణిని కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో ఇద్దరికీ ఒకే రకమైన శక్తి మరియు స్థానం ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.

మీన మరియు సింహ రాశులు..
ఈ రెండు రాశుల వారు 150 డిగ్రీల కోణంలో వేరుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరిద్దరిది ‘అసంపూర్తి కారకం‘ అని పిలుస్తారు. మీనం మరియు సింహ రాశుల వారు ఒకరినొకరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ రెండు రాశి చక్రాల సంకేతాలు కూడా విరుద్ధమైనవి..

అగ్ని మరియు నీరు..
ఈ రెండు రాశి చక్రాల గుర్తులు ప్రతికూల మూలకాలకు చెందినవి. సింహ రాశి చక్రం యొక్క సంకేతం అగ్ని అయితే, మీన రాశి చక్రం యొక్క గుర్తు నీరు. అందుకే ఈ రెండు రాశి చక్ర గుర్తులు జీవితం మరియు సంబంధ విషయాలపై భిన్నమైన విధానాలను కలిగి ఉంటారు.



Click it and Unblock the Notifications