Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పడకగదిలో ఈ రాశుల వారు చాలా స్వార్థపూరితంగా ఉంటారట...!
ఈ రాశుల వారు పడకగదిలో చాలా స్వార్థపూరితంగా ఉంటారట.
శృంగారం అనగానే యువతలో ఏదో తెలియని ఉత్సాహం, ఊపు వచ్చేస్తూ ఉంటుంది. తాము ఎప్పుడెప్పుడు ఆ కార్యంలో పాల్గొందామా.. పార్ట్నర్ తో ఆసాంతం ఆస్వాదించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు.

పెళ్లయిన కొత్తలో తాము పడకగదిలో రెచ్చిపోవాలని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే శృంగారం అనేది కపుల్స్ మధ్య దూరాన్ని తగ్గించి.. సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుంది. ఇదంతా జరగాలంటే.. ఆ కార్యంలో ఆడ, మగవారి పాత్ర సమాన స్థాయిలో ఉండాలి.

అప్పుడే ఆలుమగల జీవితం అన్యోన్యంగా సాగుతుంది. అయితే ఇద్దరిలో ఏ ఒక్కరు పార్ట్నర్ ను పట్టించుకోకపోయినా సమస్యలు స్టార్టవుతాయి. ఎందుకంటే పెళ్లయిన వారిలో కొందరు తమ పార్ట్నర్ ను పడకగదిలో పట్టించుకోకుండా తమ పని అయ్యిందా లేదా అని మాత్రమే చూసుకుంటారు. ఇంకా కొందరు ఆ కార్యం విషయంలో చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తారట.

అయితే అలాంటి వ్యక్తులను కనిపెట్టడం కొంచెం కష్టమే. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం పడకగదిలో స్వార్థపూరితంగా ఉండే రాశిచక్రాలేవో తెలుసుకోవచ్చట. ఈ సందర్భంగా ఈ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారు తమ భాగస్వామితో పడకగదిలో శృంగారం చేసే సమయంలో చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తారట. కేవలం తాము మాత్రమే సుఖాన్ని పొందాలని భావిస్తారట. తమ సంతోషం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారట. తమ భాగస్వామి ఆనందంతో వారికి అస్సలు పట్టదట. అందుకే వీరు ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు ఎక్కువ సంతోషాన్ని పొందుతారట. అయితే తమ భాగస్వామి హ్యాపీగా ఉంటున్నారా లేదా అనే విషయాన్ని మరచిపోతారట.

సింహ రాశి..
ఈ రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది.. వీరు చాలా విషయాల్లో జాలి, దయ చూపుతారు. కానీ పడకగదికొచ్చేసరి భాగస్వామి దగ్గర స్వార్థపూరితంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ భాగస్వామితో ఎక్కువ ఆనందాన్ని పొందాలని కోరుకుంటారు. కానీ తమ పార్ట్నర్ ను సంతోషపెట్టాలని మాత్రం ఆలోచించరు.

కన్య రాశి..
ఈ రాశి వారు తమ భాగస్వామితోనే కాకుండా చాలా సందర్భాల్లో స్వార్థపూరితంగా ఉంటారట. అంతేకాదు వీరు స్వార్థంతో ఉన్నందుకు చాలా సంతోషపడతారట. అదే సమయంలో పడకగదిలో పార్ట్నర్ తో సైతం చాలా సెల్ఫీష్ గా ఉంటారట. వీరు ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు కేవలం తమ సంతోషానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఏ విషయంలోనూ నిబద్ధతగా ఉండరట. అందుకే వీరు తమ భాగస్వామి విషయంలో ఎక్కువ ఆసక్తి చూపరట. ఇక ఇదే సమయంలో పడకగదిలో ఆ కార్యంపై కూడా ఎక్కువగా ఇంట్రస్ట్ చూపరట. బెడ్ రూమ్ లో తమ పార్ట్నర్ తో ఆ కార్యంలో పాల్గొన్న తర్వాత చాలా మూడీగా ఉండిపోతారట. శృంగారం తర్వాత తమ భాగస్వామితో తమకెలాంటి సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తారట.

మకర రాశి..
ఈ రాశి వారు తమ లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని భావిస్తారు. అదే సందర్భంలో శృంగారం విషయంలో కూడా తమ భాగస్వామిని ఎక్కువగా కంట్రోల్ చేస్తారట. ఇక పడకగదిలో తమ భాగస్వామి వారంతట వారే వచ్చే తమకు లొంగిపోవాలని కోరుకుంటారట. అంతేకాదు.. వీరు చాలా సందర్భాల్లో తమదే ఆధిపత్యం కావాలని కోరుకుంటారట. శృంగారం విషయంలోనూ, భాగస్వామిపైనా తమదే పైచేయిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ధనస్సు, మకరరాశి, మేషరాశి, కన్య రాశి, సింహ రాశి వారు పడకగదిలో ఎక్కువగా స్వార్థపూరితంగా వ్యవహరిస్తారు.



Click it and Unblock the Notifications