Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఈ రాశుల వారు బ్రేకప్ బాధ నుండి బయటపడలేరట...!
ఈ రాశుల వారు విడిపోయిన తర్వాత తమ ఎక్స్ లను విడిచి ముందుకు సాగడం చాలా కష్టమట.
ఈ ప్రపంచంలో ఏ బంధం బలంగా కొనసాగాలన్నా.. కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. అప్పుడే వారి మధ్య రిలేషన్ సంతోషంగా ఉంటుంది. కపుల్స్ మధ్య కమ్యూనికేషన్ తగ్గినా.. కలయికలో వంటి సమస్యలు వచ్చినా.. అంతే వారి బంధానికి బ్రేకులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అలా విడిపోవడం అనేది ఇద్దరికీ ఎంతో బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఒకరితో కలిసి జీవించేందుకు మనం ఎంతగానో సర్దుకుపోతాం.. ఎన్నో త్యాగాలు చేస్తాం.. అలాంటి మనసారా ఎంతో ఇష్టంగా ప్రేమించిన వారితో రిలేషన్ కట్ చేసుకోవాలంటే.. బ్రేకప్ పేరుతో తనకు దూరమవుతుంటే చాలా బాధగా ఉంటుంది కూడా..

అందుకే ప్రేమ చివరిదాకా నిలబడుతుందనే నమ్మకం చాలా మందిలో ఉండదు. బ్రేకప్ తర్వాత కొందరు దేవదాసులుగా మారిపోతారు. మరికొందరు జీవితాంతం గుర్తుంచుకునే పాఠాలను నేర్చుకున్నామని ఫీలవుతారు.

ఇంకా కొందరు మాత్రం బ్రేకప్ వల్ల తాము నష్టపోయిందని చాలని.. ఇకముందు అలాంటి తప్పులు జరగకుండా ఉండాలని, కొత్త విషయాలపై, పనులపై ఫోకస్ పెడతారు. బ్రేకప్ బాధల్ని మరచిపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇంకో రకం వ్యక్తులు మాత్రం బ్రేకప్ తర్వాత కూడా తమ మాజీ లవర్స్ ను పదే పదే గుర్తు చేసుకుంటారట. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అలాంటి వ్యక్తులెవరు? ఏ రాశి చక్రాల వారు ఇలా ప్రవర్తిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమించి, వారితో బ్రేకప్ జరిగినప్పుడు.. వారిని అస్సలు మరచిపోలేరు. ఎందుకంటే వీరు తమ మనసులో వారితో గడిపిన క్షణాలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. గతంలో వారితో హాయిగా గడిపిన సమయం మళ్లీ తిరిగి రావాలని గట్టిగా కోరుకుంటారు. అయితే అలా ఆలోచిస్తూ.. విలువైన తమ సమయాన్ని కోల్పోతూ ఉంటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. వారిని జీవితాంతం మరచిపోలేరు. ఒకవేళ తమ ప్రియుడు లేదా ప్రియురాలితో విడిపోయినా కూడా వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తమ రిలేషన్ ఎందుకు కట్ అయ్యిందా అని తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. బ్రేకప్ బాధను భరించేందుకు చాలా ఇబ్బంది పడతారు.

మిధున రాశి..
ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే, వారితో చాలా సరదాగా, సంతోషంగా గడుపుతారు. అయితే వీరు పొరపాటున తమ భాగస్వామికి బ్రేకప్ చెప్పారంటే.. వారిని మరిచపోవడం అనేది జరగదని ఫీలవుతారు. ఎందుకంటే వీరు తమ పార్ట్ నర్ తో కలిసి ఎన్నో పార్టీలు చేసుకుని ఉంటారు. అందుకే వీరు బ్రేకప్ బాధ నుండి అంత సులభంగా బయటపడలేరు. అనునిత్యం వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు బ్రేకప్ బాధను భరించేందుకు ఆల్కహాల్ అలవాటు చేసుకుంటారు. అంతేకాదు ఆల్కహాల్ కు బానిసగా కూడా మారిపోతారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రిలేషన్ షిప్ లో ఏదైనా సమస్య వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా తాము ప్రేమించిన వ్యక్తితో విడిపోవడం వంటి బాధకరమైన సంఘటనలు జరిగినప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతారు. తమ మాజీ భాగస్వామిని మరచిపోయేందుకు చాలా కష్టపడతారు. వారినే తలచుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. వారితో మళ్లీ కలిసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీరు ఎవరితో అయినా ప్రేమలో పడితే.. వారితో కలకాలం కలిసి జీవించాలని కోరుకుంటారు. అయితే తమ కోరిక నెరవేరనప్పుడు, వీరు చాలా బాధపడతారు. బ్రేకప్ జరిగిన తర్వాత, సింగిల్ గా రూమ్ లోకి వెళ్లి గడుపుతారు. వీరు బ్రేకప్ బాధ నుండి త్వరగా బయటపడలేరు.



Click it and Unblock the Notifications