Just In
- 8 min ago
Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల రవాణా.. ఏయే తేదీల్లో మారనున్నాయంటే...
- 1 hr ago
మాంసాహారం కంటే ఈ పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండొచ్చు... దృఢమైన శరీరానికి ఇవి చాలు!
- 3 hrs ago
రొయ్యలతో చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ ఫ్రైని ప్రయత్నించండి
- 4 hrs ago
Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...
Don't Miss
- News
Vastu tips: నిద్రకూ వాస్తు డైరెక్షన్: ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
- Sports
IPl Qualifier 1 : మనది కాని టైంలో కొన్నిసార్లు మింగేయాలి.. తప్పదు అన్న జోస్ బట్లర్
- Movies
Janaki Kalaganaledu May 25th: జ్ఞానాంబకు తెలియకుండా పెళ్లి ప్లాన్.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మల్లిక!
- Finance
Digit Insurance IPO: విరాట్ కోహ్లీ కంపెనీ పబ్లిక్ ఇష్యూ: 500 మిలియన్ డాలర్లు టార్గెట్
- Automobiles
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- Technology
Spicejet విమానాలపై Ransomware తో హ్యాకర్ల దాడి ! పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2022లో ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!
మరి కొద్ది రోజుల్లో మనమంతా 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం. అదే సమయంలో 2022 కొత్త ఏడాదికి సరికొత్త ఆశలతో స్వాగతం చెప్పనున్నాం.
న్యూ ఇయర్లో అన్ని విషయాలు మంచిగా జరగాలని.. ముఖ్యంగా కరోనా నుండి మనకు విముక్తి కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరికొందరు వార్షిక ప్రణాళికను, రిజల్యుషన్స్ విషయంలో తలమునకలై ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే..
కొత్త ఏడాదిలో మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుంది.. ఈ సంవత్సరమైనా మీ లవ్ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాలను జ్యోతిష్యశాస్త్రం సహాయంతో తెలుసుకోవచ్చట. ద్వాదశ రాశులలోని ఈ రాశుల వారికి ప్రేమ విషయంలో అద్భుతమైన ఫలితాలు రానున్నాయట. ఈ సందర్భంగా ఈ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందా లేదా తెలుసుకునేందుకు ఇక్కడ ఓ లుక్కేయండి...
2022
Yearly
Rasi
Phalalu
:
కొత్త
ఏడాదిలో
ఈ
రాశుల
వారు
అద్భుత
విజయాలు
సాధిస్తారట...!

వృషభ రాశి..
2022 సంవత్సరం కొత్త ఏడాదిలో ఈ రాశి వారు లైఫ్ లో బ్యాలెన్స్ గా ఉండటాన్ని ఇష్టపడతారు. అందుకే నూతన సంవత్సరంలో ఇలాంటి వ్యక్తుల కోసం అన్వేషించే అవకాశం ఉందట. అంతేకాదు.. ఎవరైనా వ్యక్తిని చూడగానే.. వీరు తమకు కరెక్ట్ కాదనే విషయం వెంటనే అర్థమైపోతుందట. వారినే తమ భాగస్వామిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారట.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో తమకు నచ్చిన వ్యక్తిని కనుగొనే అవకాశం ఎక్కువగా ఉందట. అంతేకాదు వీరికి నచ్చిన వ్యక్తులు వారిని బాగా అర్థం చేసుకుంటారట. అందుకే వీరు తమ పార్ట్నర్ నుండి అత్యంత ఎక్కువ ప్రేమను కోరుకుంటారట. వీరు కొత్త ఏడాదిలో తమ పార్ట్నర్ తో కలిసి వీలైనంత ఎక్కువగా గడిపేస్తారట. వీరు ఈ కాలంలో జీవితాంతం గుర్తుండిపోయే జర్నీ, విహారయాత్రలు చేస్తారట.
కొత్త
ఏడాదిలో
ఏ
రాశి
వారు
ఏ
పనులు
చేయాలి..
ఏ
పనులు
చేయకూడదో
తెలుసా...!

కన్య రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో బ్యాలెన్స్ గా ఉంటూ, సెక్యూరిటీ కావాలని కోరుకుంటారు. అందుకే వీరు తమ భాగస్వామిని చాలా విలువైన వారిగా భావిస్తారు. తమ లైఫ్ లోకి ఏ వ్యక్తి వస్తే.. హ్యాపీగా ఉంటారో.. అలాంటి వ్యక్తి కోసం ఎదురుచూస్తారట. అయితే వీరు కోరుకున్న విధంగా అలాంటి వ్యక్తులను కలవడమే కాదు.. వారితో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారట. అంతేకాదు వీరు తమ బంధంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారట.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో తాము నచ్చిన.. మెచ్చిన భాగస్వామిని కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు ఇంతకుముందు కంటే ప్రస్తుతం చాలా ఎక్కువ క్లోజ్ గా ఉండటం.. వారి బంధాన్ని బలంగా మార్చునే ప్రయత్నాలపై ఫోకస్ పెడతారట. వీరి జాతక రీత్యా చాలా సాహసొపేతంగా ఉంటారట. వీరు ఈ మూలకాన్ని వీరి రొమాంటిక్ జీవితంలోకి తీసుకువస్తారట. మొత్తానికి ఈ ఏడాది వీరికి లవ్ మ్యాటర్లో కచ్చితంగా సక్సెస్ దొరుకుతుందట.

మకర రాశి..
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో కొత్త వ్యక్తితో కొత్త సంబంధం ఏర్పరచుకోవడానికి అనేక అవకాశాలను ఏర్పరచుకుంటారు. మరోవైపు వీరు తమ రొమాంటిక్ జీవితాన్ని ఆస్వాదించడానికి చాలా పనులను పెండింగులో పెట్టేస్తారట. అంతేకాదు కొత్త ఏడాదిలో వీరు ప్రేమ విషయంలో పెద్దలను ఒప్పించే అవకాశాన్ని పొందుతారట. అదే ఊపులో ప్రేమ పెళ్లి చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.