For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలిచూపులో అబ్బాయిలు స్త్రీలలో ఎక్కువగా ఏం గమనిస్తారో తెలుసా...

|

తొలిప్రేమ.. తొలిచూపులో పుట్టే ప్రేమను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేం. మనలో చాలా మందికి తొలి చూపులోనే ప్రేమ పుడుతూ ఉంటుంది. మరి కొందరికి స్నేహం నుండి ప్రేమ మొదలవుతుంది. అసలు మన జీవితంలో ప్రేమ పుట్టిందంటే చాలు.. లైఫ్ మొత్తం హ్యాపీగా అనిపిస్తుంది.

అయితే మగవారిలో ప్రేమ పుట్టేందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా తొలిసారి మనసుకు నచ్చిన మహిళలను చూసినప్పుడు.. వారి హార్ట్ లో ఏదో తెలియని అలజడి రేగుతుంది. అంతేకాదు వారికి కొందరు అమ్మాయిలను చూస్తే వారికి తెలియకుండానే ఆకర్షణ మొదలవుతుంది. అంతే అప్పటి నుండి వారి మాయలో పడిపోతుంటాం.

ఇదిలా ఉండగా చాలా మంది అబ్బాయిలు తొలిసారి అమ్మాయిలను కలిసినప్పుడు.. వారిలో ఏ భాగాన్ని ఎక్కువగా చూస్తారు.. ఎలాంటి విషయాలను ఎక్కువగా గమనిస్తారు.. ఒకవేళ మీపై ఫోకస్ పెట్టిన వ్యక్తిని మీరు కూడా ఇష్టపడితే.. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా.. మీలో తను దేనికి ఫ్లాట్ అయిపోతున్నాడో తెలుసుకుని మరింతగా రెచ్చగొట్టేయండి... ఇంతకీ ఆ విశేషాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

పెళ్లయిన వ్యక్తులనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు...

మీ ఫిగర్..

మీ ఫిగర్..

మనలో చాలా మంది మగాళ్లు.. ఎంత కాదన్నా.. ముందుగా అమ్మాయిల ఫిగర్ ను పై నుండి కిందవరకు ఓసారి పూర్తిగా స్కాన్ చేసేస్తారు. ఇలా చెబుతున్నామని తప్పుగా ఫీలవ్వకండి. వారు మిమ్మల్ని వారి మనసులో బంధించి.. ఆ తర్వాత మీ గురించి కలలు కంటూ ఉంటారట. మీ గురించే ఊహించుకుంటూ ఊహా లోకంలో తేలిపోతూ ఉంటారట.

మీ చూపులు..

మీ చూపులు..

పురాణాల ప్రకారం, ఒకప్పుడు కొందరు రుషులు కళ్లతోనే కడుపు చేసే వారని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందనేది ఎవ్వరికీ తెలియదు. అందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే ప్రస్తుతం కళ్ల ద్వారా చూసే చూపులను బట్టి చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఇది వంద శాతం వాస్తవం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ముందుగా చూసేది మన కళ్లనే అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ ఒక వ్యక్తి చూపులను మీరు గమనిస్తే.. తను మీతో కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలనుకుంటున్నాడని, తను మీపై మనసు పడ్డారని అర్థం చేసుకోవచ్చు.

బ్యూటిఫుల్ స్మైల్..

బ్యూటిఫుల్ స్మైల్..

మనల్ని చూసి ఎవరైనా అమ్మాయి స్మైల్ ఇచ్చిందంటే చాలు వారిని బాగా ఇష్టపడతాం. ఎందుకంటే చాలా మంది పురుషుల్లో గమనించే తొలి విషయంలో బ్యూటిఫుల్ స్మైల్ ఒకటి. అయితే కొందరు తమ పళ్లు వరుస క్రమంలో లేవనో.. తమ చిగుళ్లు కనిపిస్తాయనో భయంతో పూర్తిగా నవ్వలేకపోతారు. ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా సహజంగా స్మైల్ ఇవ్వడాన్ని అబ్బాయిలు బాగా ఇష్టపడతారు. ఇంకా ఆడవారి బ్యూటిఫుల్ స్మైల్ లో బుగ్గల మీద సొట్టలు పడితే.. అలాంటి నవ్వుకి ఎలాంటి పురుషుడైనా ఫిదా అవ్వాల్సిందే.

మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఈ రాశితో చాలా జాగ్రత్తగా ఉండండి ... ఎందుకో తెలుసా?

అందమైన కురులు..

అందమైన కురులు..

మీ కురుల నుండి ఏదైనా దుర్వాసన, క్లీన్ గా లేకపోయినా అలాంటి వారిని ఎవ్వరు ఇష్టపడరు. ఎందుకంటే చాలా మంది పురుషులు పొడవైన కురులు ఉండే అమ్మాయిలను అమితంగా ఇష్టపడతారట. కాబట్టి అమ్మాయిలు మీ కురులను అత్యంత శుభ్రంగా, మెరుస్తూ ఉండేలా చూసుకోండి. మీకు పొడవాటి కురులుంటే, చల్ల గాలికి అలా మీ కురులు ఎగురుతుంటే వాటిని చూసిన ఎలాంటి పురుషుడైనా మీకు దాసోహమవ్వడం ఖాయం.

మీ నడక..

మీ నడక..

మన కవులు అమ్మాయిల నడకను హంస నడకతో ఎందుకు పోల్చారో చాలా మంది పురుషులకు బాగా తెలుసు. అందుకే అబ్బాయిలు తమకు ఇష్టమైన అమ్మాయిలు ఎలా నడుస్తున్నారనే విషయాలను బాగా గమనిస్తారు. నమ్మకమైన నడక అనేది చాలా మంది పురుషులకు గేమ్ ఛేంజర్ అలా అనిపిస్తుంది. మీ నడకలో అలసత్వం, బద్దకం కనిపిస్తే.. కొంత కష్టంగా ఉంటుంది. అందుకే అమ్మాయిలు మీరు ఆత్మవిశ్వాసంతో చాలా స్టైలీష్ గా నడవండి. మీరు తలెత్తుకుని ఆత్మ విశ్వాసంతో నడవండి. అబ్బాయిలను ఫిదా చేసేయ్యండి.

బిహేవియర్..

బిహేవియర్..

చాలా మంది అమ్మాయిల్లో అబ్బాయిలు ఎక్కువగా గమనించే అంశాల్లో బిహేవియర్ ఒకటి. స్త్రీల ప్రవర్తన, ఆటిట్యూడ్ ను బట్టి వారు ఒక అంచనాకు వచ్చేస్తారు. ఎందుకంటే ఇలాంటివే మీ గురించి చాలా విషయాలను తెలియజేస్తాయి. మీరు సున్నితంగా ప్రవర్తిస్తే.. మీరు సులభంగా ఆకర్షితులవుతారు. కానీ మీరు రాంగ్ బిహేవియర్ చేస్తే మీ ఫేస్ ఎంత అందంగా ఉన్నా మిమ్మల్ని పట్టించుకోరు.

English summary

Things Men Notice in a Woman in Their First Meeting in Telugu

Here are these things men notice in a woman in their first meeting in Telugu. Have a look
Story first published: Monday, October 4, 2021, 16:41 [IST]