For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ టైమ్ రొమాన్స్ టైంలో మగాళ్లు ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే...!

ఫస్ట్ టైమ్ ఆ కార్యంలో పాల్గొనే పురుషులు ఎలాంటి పనులు చేయాలనుకుంటారో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

శృంగారాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.. వయసులో ఉండే ప్రతి ఒక్క అమ్మాయి.. అబ్బాయి ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదించాలని ఆశపడుతూ ఉంటారు.

Things Men Think of During First Time Romance in Telugu

ఇక మగాళ్లలో చాలా మంది తాము ఎప్పుడెప్పుడు శృంగారంలో పాల్గొందామా అని ఆలోచిస్తుంటారు. చాలా సందర్భాల్లో తమ బాడీ ఒక పని చేస్తుంటే.. మనసులో మాత్రం అవే కోరికలు రగులుతూనే ఉంటాయి.

Things Men Think of During First Time Romance in Telugu

ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్క మగాడికి ఏదో ఒక పరిస్థితిలో ఎదురయ్యే ఉంటుంది. అయితే చాలా మంది అబ్బాయిలు సెక్స్ విషయంలో ఊహించుకునేది ఒకటి.. వాస్తవ జీవితంలో జరిగేది ఒకటి.. ఊహాల్లో తాము రతి మన్మథుడిలా రెచ్చిపోతున్నట్లు కలలు కంటారు. అయితే సరిగ్గా ఆ సమయంలో మాత్రం కంగారు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొదటిసారి శృంగారంలో పాల్గొనే పురుషుల మదిలో ఎలాంటి ఆలోచనలు మెదులుతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'పెళ్లి జరిగి పదిరోజులవుతున్నా.. నన్ను తాకనివ్వడం లేదు...''పెళ్లి జరిగి పదిరోజులవుతున్నా.. నన్ను తాకనివ్వడం లేదు...'

మంచి సువాసన వచ్చేలా..

మంచి సువాసన వచ్చేలా..

వినడానికి వింతగా ఉన్నప్పటికీ.. ఇది వాస్తవమే. ఫస్ట్ టైమ్ శృంగారంలో పాల్గొనే పురుషులు చాలా మంది తమ పడకగదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఆసక్తి చూపుతారట. అంతేకాదు బెడ్ రూమ్ లో ఉండే బాత్ రూమ్ సైతం క్లీన్ గా ఉండేలా చూసుకుంటారట. అలాగే నీటిగా షేవింగ్ చేసుకోవడం వంటివి చేస్తారట. అన్నింటి కంటే ముందుగా తమ పడకగదిలో పార్ట్నర్ అడుగుపెట్టేసరికి మంచి సువాసన వెదజల్లేలా బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ వాడతారట.

ఆ కార్యంపైనే ఫోకస్..

ఆ కార్యంపైనే ఫోకస్..

మొట్టమొదటిసారి శృంగారంలో పాల్గొనే అబ్బాయిలు ఆ కార్యాన్ని బాగా ఆస్వాదించాలని ఆశిస్తారు. అంతేకాదు తమ భాగస్వామిని బాగా సుఖపెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ సమయంలో ఎలాంటి పనులను పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారట. పడకగదిలో ఇద్దరూ కలిసి ఆనందంగా గడపాలని కోరుకుంటారట. అందుకోసం బెడ్రూమ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటారట. అన్నింటి కంటే ముఖ్యంగా సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేయడమో లేదా సైలెంట్లో పెట్టడం వంటివి చేస్తారట.

కండోమ్స్ వాడతారట..

కండోమ్స్ వాడతారట..

ప్రస్తుతం చాలా మంది మగాళ్లకు శృంగారంపై కొంత అవగాహన పెరిగింది. అందుకే తొలిసారి ఆ కార్యంలో పాల్గొనే ముందు పార్ట్నర్ కు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు కండోమ్స్ ను వాడతారట. అందుకోసం ముందుగానే వాటిని తెచ్చుకుంటారట. అయితే కొందరు పురుషులు తమకు కండోమ్స్ అవసరం లేదని భావిస్తారట. ఎందుకంటే తమ భాగస్వామి వీలైనంత త్వరగా గర్భం పొందాలని ఆశిస్తారట.

నొప్పిగా ఉంటుందా?

నొప్పిగా ఉంటుందా?

సాధారణంగా తొలిసారి శృంగారంలో పాల్గొంటే కాస్త నొప్పిగా ఉంటుంది. అది అమ్మాయిలకైనా.. అబ్బాయిలకైనా సహజంగా వస్తుంది. అయితే అలాంటి నొప్పి కలగకూడదంటే.. మీరు మీ భాగస్వామితో ముందుగా ఫోర్ ప్లే చేయాలి. పార్ట్నర్ ను కిస్ చేయడం.. కౌగిలించుకోవడం.. తనకు మత్తెక్కించే మాటలను చెప్పడం.. చివరగా తనను మూడ్ లోకి తీసుకురావడం వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తక్కువగా ఉంటుంది.

ఇలాంటి వ్యక్తులతో జర భద్రం.. లేదంటే అంతే సంగతులు...!ఇలాంటి వ్యక్తులతో జర భద్రం.. లేదంటే అంతే సంగతులు...!

అన్నింటినీ అబ్జర్వ్ చేస్తారట..

అన్నింటినీ అబ్జర్వ్ చేస్తారట..

తొలిసారి శృంగారంలో పాల్గొనే పురుషులు భాగస్వామి బాడీలోని ప్రతి ఒక్క భాగాన్ని చాలా లోతుగా పరిశీలిస్తారట. ముందుగా పార్ట్నర్ బాడీలో ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయి.. పచ్చబొట్టు.. ఏదైనా కుట్టు వంటి గుర్తులను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారట. అలాగే పార్ట్నర్ ను ఎక్కడ టచ్ చేస్తే మూడ్ వస్తుంది.. తను ఎలా స్పందిస్తుందనే విషయాలను కూడా గమనిస్తారట. అయితే అలాంటి వాటి గురించి భాగస్వామితో మాట్లాడారట.

ప్రతిస్పందన కోసం..

ప్రతిస్పందన కోసం..

చాలా మంది మగాళ్లు తొలిసారి శృంగారంలో పాల్గొనడానికి ముందు చాలా కంట్రోల్ లో ఉంటారట. ముందుగా భాగస్వామికి నచ్చుతుందా లేదా అనే విషయాలను అడుగుతారట. తను ఒప్పుకుంటేనే.. ఆ కార్యంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారట. తొలిసారి శృంగారంలో పాల్గొనేందుకు పెద్దగా బలవంతం చేయరట. అయితే ఒక్కసారి పార్ట్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మాత్రం మన్మథుడిలా రెచ్చిపోవాలని ఆశిస్తారట. ఇందుకోసం తమ భాగస్వామి ప్రతిస్పందన కోసం ఆశగా ఎదురుచూస్తారట.

ఇష్టాలను తెలుసుకుంటారట..

ఇష్టాలను తెలుసుకుంటారట..

తొలిసారి శృంగారంలో పాల్గొనే అబ్బాయిలు తమ భాగస్వామికి ఎలాంటి విషయాలంటే ఇష్టం.. ఏ విషయాలంటే అయిష్టం అనేవి తెలుసుకుంటారట. అలాగే పడకగదిలో ఎలాంటి యాంగిల్స్ ఇష్టం అనే విషయాలను అడిగి తెలుసుకుంటారట. అలాగే తమకు ఎలాంటి భంగిమలు ఇష్టమో చెబుతారట. అక్కడితో ఆ భంగిమలను వారికి చూపించి.. మనం కూడా ఇలా ట్రై చేద్దామా అని వారిని నేరుగా అడగాలనుకుంటారట.

English summary

Things Men Think of During First Time Romance in Telugu

Here are these things men think of during first time romance in Telugu. Have a look
Story first published:Saturday, November 13, 2021, 11:06 [IST]
Desktop Bottom Promotion