For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ప్రియురాలిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి చేయక తప్పదు బ్రదర్...!

|

'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే..' అన్నాడో మహాకవి. ఎందుకంటే ఒక మహిళ మనసు గెలుచుకోవడం అంత సులభం కాదు. తన మనసులో మీరు స్థానం పొందాలంటే తనకు ఖరీదైన చీరలు లగ్జరీ గిఫ్టులు ఇవ్వాలని చాలా మంది మగాళ్లు అనుకుంటారు.

అయితే వాస్తవానికి అమ్మాయి మనసు గెలుచుకోవడానికి అంతకుమించిన అద్భుతమైన మార్గాలెన్నో ఉన్నాయి. సాధారణంగా పురుషులు తమ మనసుకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. ఇదంతా తనను ఆకట్టుకోవడానికి మాత్రమే చేస్తున్నారని తను గ్రహిస్తుంది.

అయితే తను ఒక్కసారి దీన్ని గమనించిందంటే. తను ఈ జన్మలో మిమ్మల్ని ఇష్టపడదు. కాబట్టి మీరు తనను ఇంప్రెస్ చేయడానికి పనిగట్టుకుని ప్రయత్నించకుండా తన మనసును గెలిచేందుకు ప్రయత్నిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు తనపై నిజాయితీగా అభిమానం చూపిస్తే చాలు.. తనకు మీపై ప్రేమ కలిగేలా చేస్తుంది. అయితే అందుకోసం ఏమి చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రతిక్రీడలో మహిళలు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు...

శ్రద్ధగా వినాలి..

శ్రద్ధగా వినాలి..

మహిళలు చాలా భావోద్వేగంగా ఉంటారని చెప్పొచ్చు. వారికి ఏ విషయమైన భావోద్వేగంతోనే ముడిపడి ఉంటుంది. వారు ఆలోచించే వాటిలో లేదా మీతో పంచుకునే ప్రతి విషయంలో చాలా సిల్లీగా అనిపించొచ్చు. కానీ తను చెబుతున్న విషయాలు మీకు నచ్చకపోయినా మీరు ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా వినాలి. అవసరమైతే అప్పుడప్పుడు సలహా కూడా ఇవ్వాలి. తాను చెప్పే విషయాలన్నీ వింటున్నందుకు తను చాలా సంతోషిస్తుంది.

స్కాన్ చేయకండి..

స్కాన్ చేయకండి..

మనలో చాలా మంది పురుషులు కాస్త అందంగా ఏ అమ్మాయి కనబడినా.. పై నుండి కింది వరకు స్కాన్ చేసేస్తూ ఉంటారు. అయితే మీకు నచ్చిన మహిళ మనసు గెలుచుకోవాలంటే తనతో అలాంటి పనులు చేయకండి. ఇలా చేయడం వల్ల తనకు మీపై నమ్మకం కుదరదు. అయితే తనతో మీరు కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.

జోక్స్ చెప్పండి..

జోక్స్ చెప్పండి..

చాలా మంది మహిళలకు నవ్వుతూ ఉండటమంటే చాలా ఇష్టం. అందుకే జోక్స్ చెప్పే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీరు కొంచెం ఫన్నీగా ఉండటం మంచిది. అయితే మీ జోక్స్ హద్దు మీరకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు వేసే పంచ్, జోక్స్ కు నవ్వు రావాలి తప్ప చిరాకు కలిగించేలా ఉండొద్దు. కాబట్టి హస్యచతురను కాస్త పెంచుకోండి. ఇందుకోసం మీరు జోక్స్ వీడియోలు.. ఆన్ లైనులో వెతకడం వంటివి చేయాల్సిన పనిలేదు. మీరు బస్సులో వెళ్తున్నప్పుడు లేదా బైక్ పై వెళ్తున్నప్పుడు జరిగిన చిన్న చిన్న ఫన్నీ విషయాలను చెప్పండి చాలు. తన ముఖంలో ఎంత సంతోషం కనిపిస్తుందో మీరే చూడండి.

తొలిచూపులో అబ్బాయిలు స్త్రీలలో ఎక్కువగా ఏం గమనిస్తారో తెలుసా...

సోషల్ మీడియాతో జాగ్రత్త..

సోషల్ మీడియాతో జాగ్రత్త..

ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్ర పోయేంత వరకు తుమ్మినా.. దగ్గినా ఏవేవో పోస్టులు పెట్టేస్తున్నారు. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే.. దాన్ని తగ్గించుకోండి. ఎక్కువగా లైకులు, కామెంట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో పిచ్చి పిచ్చి ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటోలు, జర్నీ టైంలో తీసుకున్న ఫొటోలను అప్ లోడ్ చేస్తే.. తనకు మీపై మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది.

డీప్ హగ్..

డీప్ హగ్..

చాలా మంది అమ్మాయిలు తమ ప్రియుడు లేదా భాగస్వామి యొక్క స్పర్శను ఎక్కువగా కోరుకుంటారు. ముఖ్యంగా మీ నుండి వారు గాఢమైన కౌగిలి(డీప్ హగ్)ని కోరుకుంటారు. మీ కౌగిలిలో బంధి అయ్యేందుకు వారు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వారు ఏదైనా బాధలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడాలని ఆశపడుతూ ఉంటారు.

తమను బుజ్జగించాలని..

తమను బుజ్జగించాలని..

అమ్మాయిలలో చాలా మంది సున్నితంగా ఉంటారు. అందుకే వారు చిన్న విషయాలకే తెగ బాధపడిపోతూ ఉంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా కంట్లో నీళ్లు వస్తుంటాయి. అలాంటి సమయంలో మీరు వారిని బుజ్జగించాలని, వారి తలపై చేతులను నిమురుతూ ఉండాలని, వారి భుజం తట్టి ధైర్యం చెప్పాలని కోరుకుంటారు.

ఆ కార్యం విషయంలో..

ఆ కార్యం విషయంలో..

ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది రతి క్రీడ. మీరు మీ భాగస్వామితో ఆ కార్యంలో పాల్గొనే సమయంలో ఎప్పుడూ ఒకే రకమైన యాంగిల్ లో ప్రయత్నిస్తే వారికి బోర్ కొడుతుందట. అందుకే అప్పుడప్పు కొన్ని యాంగిల్స్ మార్చాలని కోరుకుంటారట. అయితే ఇలాంటి విషయాలను వారు బయటకు చెప్పుకోరట. కాకపోతే కొన్ని హింట్స్ ఇస్తారట. దాన్ని బట్టే మనమే అర్థం చేసుకోవాలట.

తనను అర్థం చేసుకోవాలి..

తనను అర్థం చేసుకోవాలి..

చాలా మంది పురుషులు తమ భాగస్వామితో పడకగదిలో ఆ కార్యంలో పాల్గొన్న వెంటనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. అయితే అలా చేయడాన్ని అమ్మాయిలు ఏ మాత్రం ఇష్టపడరట. ఎందుకంటే వారికి ఒకేసారి కాకుండా క్రమంగా ఆ స్థితిలోకి చేరుకుంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో తనను మీరు బాగా అర్థం చేసుకోవాలి.

English summary

Things that Make Your Girlfriend Happy in Telugu

Here are these things that make your girlfriend happy in Telugu. Have a look
Story first published: Wednesday, October 6, 2021, 18:05 [IST]