For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలి ఏడాదిలో మీ భాగస్వామితో షేర్ చేసుకోవాల్సిన విషయాలెంటో తెలుసా..

మీ కలల ప్రదేశం మీ సంబంధం యొక్క మొాదటి సంవత్సరంలోనే మీ కలల ప్రదేశాల గురించి మీరు మాట్లాడుకూడదని మీరు నిర్ణయించుకున్నప్పటికీ, మీ దీర్ఘకాలిక లక్ష్యాల గురించి మీ భాగస్వామితో మాట్లాడితేనే ఉపయోగముంటుంది.

|

రిలేషన్ షిప్ ప్రారంభంలో తమ గురించి కొన్ని విషయాలను అస్సలు బయటికి చెప్పకూడదు అని చాలా మంది అంటుంటారు. ఇదంతా తమ అనుభవంతో చెబుతున్నామని పదే పదే గుర్తు చేస్తుంటారు. ముందు మీ భాగస్వామి మంచోడా కాదా తెలుసుకున్న తర్వాతనే వారి రహస్యాలు, ఇతర సమాచారాన్ని షేర్ చేసుకోవాలంటున్నారు పెద్దలు.

Partner In The First Year Of Your Relationship

ఒకవేళ మీ భాగస్వామి మీ జీవితమంతా మీతో కలిసి జీవించాలని అన్ని విషయాలు పంచుకుంటున్నారని మీరు భావిస్తే, తొలి సంవత్సరంలో మీరు మీ భాగస్వామితో పంచుకోవాల్సిన కచ్చితమైన కొన్ని విషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1) మీ పాత సంబంధం లేదా సంబంధాలు..

1) మీ పాత సంబంధం లేదా సంబంధాలు..

మీ గతాన్ని గురించి నిజం తెలుసుకునేందుకు మీ భాగస్వామి కచ్చితంగా ప్రయత్నిస్తారు. దానికి వారు అర్హులో కాదో మీరు గమనించాలి.మీ భాగస్వామి మీ పాత సంబంధం మరియు లైంగిక అనుభవాల గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా కూడా మీరు మీ భాగస్వామితో మీ పాత సంబంధాల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. మీ పాత సంబంధంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటి గురించి కూడా మాట్లాడవచ్చు. మీరు పాత సంబంధాన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా అని కూడా మీరు నిర్మోహమాటంగా మీ భాగస్వామిని అడగొచ్చు.

2) మీ కలల ప్రదేశం..

2) మీ కలల ప్రదేశం..

మీ కలల ప్రదేశం మీ సంబంధం యొక్క మొాదటి సంవత్సరంలోనే మీ కలల ప్రదేశాల గురించి మీరు మాట్లాడుకూడదని మీరు నిర్ణయించుకున్నప్పటికీ, మీ దీర్ఘకాలిక లక్ష్యాల గురించి మీ భాగస్వామితో మాట్లాడితేనే ఉపయోగముంటుంది. ఎందుకంటే మీరు పరస్పర ప్రణాళికను రూపొందించుకోవడానికి, అందుకు అనుగుణంగా పని చేయడానికి సహాయపడుతుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు మీ సంబంధాన్ని మరిన్ని సమస్యల నుండి బయట పడేస్తుంది.

3) మీ ఆర్థిక లక్ష్యాలు..

3) మీ ఆర్థిక లక్ష్యాలు..

మొదటి సంవత్సరంలోనే మీ భాగస్వామితో ఆర్థిక సంబంధాలను అంతగా కనెక్ట్ చేయకపోవచ్చని మీరు అర్థం చేసుకోవాలి. కానీ మీ ఫైనాన్స్ మ్యాటర్ కు సంబంధించిన విషయాలను పంచుకోవడం ద్వారా మీ సంబంధం బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మరియు మీ భాగస్వామి ఒకే లెవెల్ లో ఉన్నారో లేదో కూడా తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. అదొక్కటే కాకుండా మీ భాగస్వామి డబ్బును నీళ్లలా ఖర్చు పెడతారా? లేదా సేవింగ్స్ చేస్తారా అనే విషయాలను మీరు తెలుసుకోవచ్చు.

4) భవిష్యత్తులో పిల్లల కోసం ప్లాన్స్..

4) భవిష్యత్తులో పిల్లల కోసం ప్లాన్స్..

మీ రిలేషన్ షిప్ తొలి సంవత్సరంలోనే పిల్లల గురించి చర్చించడం ఆత్రుత, లేదా వింతగా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆ విషయం గురించి మాట్లాడటమే మంచిది. మీరు మీ పిల్లలతో కలిసి ఉండేందుకు ఆరాటపడుతుంటే మరియు మీ పిల్లల జీవితంలో మీ భాగస్వామి ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారో మీరు మీ భాగస్వామికి ముందే తెలియజేయవచ్చు. ఒకవేళ మీకు ఇప్పటికే సంతానం ఉంటే, మీరు మీ భాగస్వామికి కూడా ఆ విషయాలను తెలియజేయాలి. మీరు మరియు మీ భాగస్వామి పిల్లల గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉండటమే కాకుండా పిల్లలను ఎలా పెంచాలి. ఎవరు పెంచాలి అనే విషయాలపైనా ఇప్పుడే ఒక క్లారిటీకి రావచ్చు.

5) ఆరోగ్య సమస్యలను చర్చించాలి.

5) ఆరోగ్య సమస్యలను చర్చించాలి.

మీతో మీ భాగస్వామి కొత్త జీవితాన్ని గడపనున్నందున అతను/ఆమె మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. మీరు ఏవైనా కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లయితే లేదా మీరు ప్రస్తుతం అలాంటి సమస్యలను ఏవైనా ఎదుర్కొంటుంటే, మీ భాగస్వామి దీని గురించి తెలుసుకోవాలి. ఇలాంటివి మీ భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి మరియు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుంది.

6) మీ కుటుంబ డైనమిక్స్ గురించి మాట్లాడాలి..

6) మీ కుటుంబ డైనమిక్స్ గురించి మాట్లాడాలి..

మీ కుటుంబ డైనమిక్స్ గురించి మీరు మీ భాగస్వామితో మాట్లాడాలి. మీకు ఎలాంటి కుటుంబం ఉందో.. మీ కుటుంబ నేపథ్యం ఏంటో మీ భాగస్వామికి తెలియజేయవచ్చు. మీరు మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నారా లేదా అంత దగ్గరగా లేరా అనే విషయాలను తెలుసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలను గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే అలాంటి విషయాల్లో సమస్యలను ఎదుర్కొనేందుకు లేదా మీకు సహాయపడేందుకు మీ భాగస్వామి ముందుకు రావచ్చు.

7) కీలకమైన కలయిక గురించి చర్చించాలి..

7) కీలకమైన కలయిక గురించి చర్చించాలి..

మీరు మరియు మీ భాగస్వామి మీ సంబంధాన్ని మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్లేందుకు ముందు మరియు లైంగిక సంబంధం కావాలని నిర్ణయించుకునేందు ముందు, మీరు ఏదైనా లైంగిక సమస్యలతో బాధపడుతుంటే లేదా మీకు ఏవైనా లైంగిక సంబంధ సమస్యలుంటే ముందే వెల్లడించాలి. లేదా ఏదైనా శారీరక సమస్య లేదా లైంగిక ఆరోగ్య సమస్యలుంటే, మీ రిలేషన్ షిప్ తొలి సంవత్సరంలోనే మీ భాగస్వామితో మాట్లాడటం మంచిది. అంతేకాకుండా మీరు మీ కలయిక పట్ల మీకు ఉన్న కోరికలు మరియు అంచనాల గురించి కూడా మాట్లాడొచ్చు. ఇది మీకు మరియు మీ భాగస్వామికి కలహాలు లేకుండా సంతోషకరమైన లైంగిక జీవితాన్ని గడిపేందుకు సహాయపడుతుంది. దీంతో మీ రిలేషన్ షిప్ ప్రారంభరోజులు సంతోషంగా గడిచిపోతాయి. కానీ మీ భాగస్వామితో మీ రహస్యాలు మరియు ఇతర విషయాల గురించి కూడా అంతే ముఖ్యం. ఇది మీ రిలేషన్ షిప్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మరియు దీర్ఘకాలికంగా ఉండేలా చేస్తుంది.

Read more about: relation love romance లవ్
English summary

Things To Disclose To Your Partner In The First Year Of Your Relationship

Your partner will certainly try to find out the truth about your past. You have to see if they deserve it.Even if your partner decides not to talk about your past relationship and sexual experiences, you will still need to talk about your old relationship with your partner. You can also talk about what difficulties you have had in your old relationship. You can also openly ask your partner if you want to maintain an old relationship.
Desktop Bottom Promotion