For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగదిలో ఈ పనులు చేస్తే... రొమాన్స్ లో రెండింతల సంతృప్తి మీ సొంతం...!

|

భార్యభర్తలు లేదా ప్రేమికుల మధ్య ఉండే బంధాన్ని బలపరిచే విషయాలలో రొమాన్స్ కీలకంగా పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రొమాన్స్ మీ వైవాహిక సంబంధాన్ని మరింత సాన్నిహిత్యంగా మారేలా చేస్తుంది.

స్త్రీ, పురుషులు ప్రేమను వ్యక్తీకరించడానికి లైంగిక కలయిక అనేది ఉత్తమ మార్గంగా చెప్పొచ్చు. అయితే దీని కోసం మగవారు కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా రొమాన్స్ సమయంలో స్త్రీల కోరికలు మరియు భావాలపై చాలా మందికి ఐడియా ఉండదు. ఎందుకంటే రతి క్రీడలో పాల్గొనే ప్రతి స్త్రీ లైంగిక ఉద్వేగానికి చాలా తక్కువగా గురవుతుందని గణాంకాలు చెబుతున్నాయి.

కాబట్టి అమ్మాయిలు ఆ కార్యానికి సంబంధించి ఏమి కోరుకుంటున్నారో పురుషులు తెలుసుకోడానికి అబ్బాయిలు ప్రయత్నించరు. మరోవైపు తమ పార్ట్ నర్ ఆ కార్యానికి ఏమి ఆశిస్తుందో అర్థం చేసుకోవడానికి కాస్త గందరగోళ పడతారు.

అయితే ఇదేమీ అంత పెద్ద కష్టమేమీ కాదు.. మీరు మీ భాగస్వామితో పడకగదిలో సాన్నిహిత్యం పెంచుకోవడానికి.. సంభోగంలో పాల్గొనేందుకు కొన్ని పద్ధతులను పాటిస్తే చాలు.. మీరిద్దరూ రతి క్రీడలో సులభంగా రెచ్చిపోతారు. ఈ సందర్భంగా ఆ పద్ధతులేంటో చూసేద్దాం పదండి...

మీ శ్రీవారు మీపై మనసు పడాలంటే.. ఇలా ట్రై చేయండి...

మూడ్ రావాలంటే..

మూడ్ రావాలంటే..

సాధారణంగా అమ్మాయిలకు సంబంధించి రొమాన్స్, ఫీలింగ్స్ వంటివి అన్ని కలిసే ఉంటాయి. అయితే తొలిసారి తను మీతో రొమాన్స్ లో పాల్గొన్నప్పుడు తనకు కాస్త మూడ్ వచ్చినా మీరు చాలా లక్కీనే. ఎందుకంటే చాలా మంది స్త్రీలలో ఆ కార్యం పట్ల భయం, అపొహలు, సిగ్గు వంటి వాటి వల్ల వారికి మూడ్ రావడం కష్టంగా ఉంటుంది. అయితే మీరు ఫోర్ ప్లే ఎంత ఎక్కువగా చేస్తే.. మీరు కలయికలో పాల్గొనేందుకు అంత సులభమవుతుంది.

బోల్డ్ గా మారడం..

బోల్డ్ గా మారడం..

మీరు కలయికలో మరింత మజా పొందాలంటే.. రోల్ ప్లేను ప్రయత్నించాలి. ఇందులో అబ్బాయి దుస్తులు అమ్మాయికి.. అమ్మాయి దుస్తులు అబ్బాయిలు వేసుకుని ఒకరి పాత్రను మరొకరు పోషించాలని కోరుకుంటారు. ఇలా మారిన తర్వాత బోల్డ్ గా వ్యవహరిస్తూ ఎవరైతే లీడ్ తీసుకుంటారో.. ఆ సమయంలో మీకు కచ్చితమైన ఫలితం ఉంటుంది.

పడకగదిలో పవర్ ప్లే..

పడకగదిలో పవర్ ప్లే..

చాలా మంది అమ్మాయిలు కలయికలో పాల్గొన్నప్పుడు భాగస్వామిపై ఆధిపత్యం చూపాలని భావిస్తారు. అయితే కొందరు అబ్బాయిలు తమదే డామినేషన్ కావాలని భావిస్తారు. కానీ మరికొందరు మాత్రం రెండూ కావాలని అనుకుంటారు. కాబట్టి మీరు కూడా ఇలాంటివి ప్రయత్నించి చూడండి.

మీ పార్ట్ నర్ లో ఇలాంటి లక్షణాలుంటే... మీ బంధం బలహీనపడినట్టే...

ఈ గేమ్..

ఈ గేమ్..

మీరు మీ పడకగదిలో కళ్లకు గంతలు కట్టుకుని ఆటలాడొచ్చు. దీన్ని టై అప్ గేమ్ అంటారు. ఇలా కలయికలో పాల్గొంటే.. అందులో వచ్చే మజాయే వేరుగా ఉంటుందట. అయితే ఇది చేసే ముందు మీ ఇద్దరికీ దీనిపై ఆసక్తి ఉండాలని గుర్తుంచుకోండి.

నొప్పి కలగకుండా..

నొప్పి కలగకుండా..

సాధారణంగా తొలిసారి కలయికలో పాల్గొంటే.. స్త్రీలలో కొంత నొప్పి కలగడం కామన్. కాబట్టి ఇలా జరగకుండా ఉండేదుకు మీ పార్ట్ నర్ కు గట్టిగా హత్తుకోవడం, కిస్ చేయడం, మత్తెక్కించే మాటలు మాట్లాడటం చేస్తే మీరిద్దరూ మూడ్ లోకి వచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మాయిలకు నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. వారు పూర్తిగా మూడ్ లోకి వచ్చాక వారి యోనిలోని ద్రవాలు వచ్చిన తర్వాత కలయికలో పాల్గొంటే ఆ ప్రాంతంలోని కండరాలు వదులుగా మారతాయి. కాబట్టి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది.

ముచ్చట్లు..

ముచ్చట్లు..

మీరు మీ భాగస్వామితో కలిసి పడకగదిలో బాగా రెచ్చిపోవాలంటే.. మీరు కొన్ని ముచ్చట్లు చేయాలి. అవి కూడా చాలా బోల్డ్ గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది బెడ్ రూమ్ లో ఓపెన్ గా ఆ కార్యం గురించి మాట్లాడుకోవాలని భావిస్తూ ఉంటారట.

‘తాము ఇంట్లో లేనప్పుడు.. తన ప్రియుడితో ఏకాంతంగా... సరిగ్గా అప్పుడే...'

మూడ్ పెంచే ఫుడ్..

మూడ్ పెంచే ఫుడ్..

మీరు పడకగదిలో ఆ కార్యంలో పాల్గొనాలంటే.. మీ మూడ్ ని పెంచే ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మీ ఒంట్లో శక్తి పెరిగి.. మీరు మరింత ఉత్సాహంగా కలయికలో పాల్గొనవచ్చు. ఇందుకోసం హల్వా, స్ట్రాబెర్రీల వంటి వాటిని ప్రయత్నించండి.

బాడీ డిస్టెన్స్ వద్దు..

బాడీ డిస్టెన్స్ వద్దు..

మీరిద్దరూ రొమాన్స్ లో అనుభూతిని పొందాలంటే.. అనునిత్యం ఆ కార్యంలో పాల్గొనాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ రెగ్యులర్ గా గట్టిగా హత్తుకుని నిద్రించడం లేదా మీ బాడీలు ఎక్కువగా తాకుతూ ఉండేలా చూసుకుంటూ నిద్రపోవడం రాత్రంతా ఇలా ఉండటం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

Things women care about during romance in Telugu

Here are these things women care about during romance in Telugu. Take a look
Story first published: Saturday, March 27, 2021, 14:44 [IST]