Latest Updates
-
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.!
ఆలుమగల మధ్య జరిగే ‘ఈ’ విషయాల గురించి ఎవ్వరికీ చెప్పొద్దు...!
భార్యభర్తల జరిగే ఈ విషయాల గురించి స్నేహితులతో ఎప్పుడూ చెప్పకండి.
మనలో కొందరు వ్యక్తులు ప్రతి ఒక విషయాన్ని ఓపెన్ గా అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. మరి కొందరేమో తమ పర్సనల్ విషయాలను కూడా స్నేహితులతో లేదా తమకు నమ్మకంగా ఉండే వారితో పంచుకుంటూ ఉంటారు.

మీరు కూడా మీ వివాహానికి సంబంధించిన విషయాలను మీ స్నేహితులతో లేదా ఇతర బంధువులతోనో లేదా కుటుంబసభ్యులతోనూ పంచుకుంటూ ఉంటారా? అయితే మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. జంటల మధ్య జరిగే కొన్ని వ్యక్తిగత విషయాలను మీ స్నేహితులతో పాటు బంధువులతో అస్సలు చర్చించకూడదట.

అలాగే కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకూడదట. ఎందుకంటే స్నేహితులతో ఉండే సంబంధం మరియు మీ భాగస్వామితో ఉండే రిలేషన్ రెండూ చాలా భిన్నంగా ఉంటాయి. మీ స్నేహితులు మిమ్మల్ని ఎంతగా ప్రేమించినా.. వారు మీకు ఎన్ని విషయాల్లో మద్దతు ఇచ్చినా.. ప్రతి దానికి ఓ హద్దు లేదా పరిమితి అనేది కచ్చితంగా ఉంటుంది.

కాబట్టి మీ భాగస్వామితో రిలేషన్ గురించి కొన్ని విషయాల్లో కచ్చితంగా గోప్యత పాటించాలి. ఈ సందర్భంగా మీ వైవాహిక జీవితం గురించి ఎలాంటి విషయాలను స్నేహితులతో లేదా ఇతరులతో షేర్ చేసుకోకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పర్సనల్ ఫొటోలు..
మీరు మీ భాగస్వామితో కలిసి ఏకాంతంగా దిగిన వ్యక్తిగత ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ స్నేహితులతో షేర్ చేసుకోవద్దు. అలాగే సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేయకండి. మీ బాడీపై ఉండే పచ్చబొట్టు లేదా టాటూలను కూడా ఇతరులకు చూపకండి. ఇలాంటి ఫొటోలను మీరు పొరపాటున షేర్ చేసుకుంటే.. వారు వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. గోప్యతను పాటించండి.

ఆర్థిక విషయాలు..
ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఫైనాన్షియల్ వివరాల గురించి ఇతరులతో ఎక్కువగా చర్చించడం మంచిది కాదు. మీ ఆర్థిక సమాచారం గురించి ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీకు సన్నిహితంగా ఉండేవారితో మాత్రం చర్చించొచ్చు. మీకు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే.. సన్నిహితుల సలహాలు, అనుభవం ఉన్న వారి సూచనలు తీసుకోవచ్చు. అలాగే ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

భాగస్వామిలో లోపాలు..
ఈ లోకంలో ఎవ్వరూ పరిపూర్ణం కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం అనేది కచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామిలో ఏవైనా లోపాలుంటే వాటిని మీ స్నేహితులు లేదా ఇతర వ్యక్తులకు చెప్పడం వంటివి చేయొద్దు. ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దీని నుండి వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ భాగస్వామికి మీరు చేయలేని పనులను స్నేహితులకు చెప్పొద్దు. మీ భాగస్వామి నుండి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, ముందుగా మీ పార్ట్నర్ తో షేర్ చేసుకోండి. మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకోండి.

పాత విషయాలు..
మీరు ఒకరితో జీవితం పంచుకున్నందు.. మీరు ఒకరికి భాగస్వామి అయినందున అతని లేదా ఆమె గత జీవితం గురించి మీకు చెబుతుంటారు. దాన్ని ఇతరులతో పంచుకునే హక్కు మీకు లేదు. ఇలా చేస్తే మీరు నమ్మక ద్రోహం చేసినట్టు.. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఎప్పటికీ చేయొద్దు.

లైంగిక జీవితం
ఒక వ్యక్తి యొక్క లైంగిక జీవితం వ్యక్తిగత విషయం. పడక గదిలో కేవలం ఆలుమగల మధ్య జరిగే ఈ విషయం మీ వ్యక్తిగత జీవితం, ఇష్టాలు, కోరికలకు సంబంధించినది. ఇలాంటి భావోద్వేగ బంధాలు, క్షణాల గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో తను మీ మీద ఆధారపడి అతను చాలా విషయాలు చెబుతాడు లేదా చేస్తాడు. ఈ విషయాన్ని ప్రపంచానికి లేదా మీ స్నేహితులకు ఎందుకు చెప్పాలి. కాబట్టి వీటిని రహస్యంగా ఉంచాలి.



Click it and Unblock the Notifications
