Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
పార్ట్నర్ ను ఇలాంటి ప్రశ్నలు ఎప్పటికీ అడగరాదట...! ఎందుకో తెలుసా...
మీ భాగస్వామిని ఎప్పటికీ అడగకూడని విషయాలేంటో ఇప్పుడే తెలుసుకోండి.
కొత్తగా ప్రేమలో పడిన వారికి ప్రపంచమంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకున్న వారికి పెళ్లైన కొత్తలో అంతా కొత్త కొత్తగా ఉంటుంది.

ఇలాంటి సమయంలో మగవారైనా.. మహిళలైనా తమ గురించి ఒకరినొకరు అన్ని విషయాలను తెలుసుకోవాలని ఆరాటపడతారు. కొందరైతే పెళ్లికి ముందే తమ భాగస్వామి గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. ఎన్నో రకాల ఫాంటసీలను సైతం ఆశిస్తారు.

అయితే మీ ప్రేమ జీవితమైనా.. వివాహ జీవితం ఏదైనా సాఫీగా సాగాలంటే.. మీరు మీ భాగస్వామిని కొన్ని కొశ్చన్స్ ఎప్పటికీ అడగకూడదట. ఇంతకీ ఎలాంటి ప్రశ్నలు పార్ట్నర్ ను అడగకూడదు.. అడిగితే వచ్చే ఇబ్బందులేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సంపద గురించి..
పెళ్లైన కొత్తలో లేదా ప్రేమించిన వ్యక్తి గురించి మొదట్లోనే అన్ని విషయాలు తెలుసుకోవాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. ఇది సహజమే కానీ.. తొలి రోజుల్లో సంపద గురించి అస్సలు అడగకూడదట. మీరు తన శాలరీ, ఆస్తుల గురించి అడిగితే వారికి మీపై చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుదట. మీకు ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేకపోయినా.. మీరు వీటి గురించి అడిగితే.. మీరు డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. తనకు సెకండ్ ప్రియారిటీ ఇస్తున్నారేమో అని భావిస్తారట. కాబట్టి పెళ్లైన కొత్తలో లేదా ప్రేమ ప్రారంభంలో ఉన్న దశలో ఇలాంటి కొశ్చన్స్ అడగకండి.

అర్థం చేసుకోకముందే..
ఆడవారు, మగవారు ఇద్దరూ ఏ రిలేషన్ షిప్ లో ఉన్నా స్టార్టింగులోనే గిఫ్టుల గురించి.. డేట్స్ గురించి ఎప్పటికీ అడగకండి. ఇలా అడగడం వల్ల మీ భాగస్వామికి మీపై చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు తన కంటే బహుమతులకే ప్రాధాన్యత ఇస్తారని.. ఇతర కార్యకలాపాలపైనే ఆసక్తి చూపుతున్నారని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి వాటిని ఎప్పుడు అడుగుతారంటే.. తను మంచి మూడ్ లో ఉన్నప్పుడు.. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అడిగేయండి.

ఎక్కువగా నటించొద్దు..
మనలో చాలా మంది జంటలు బయటకు ఒకలా.. లోపలా మరోలా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలలో ఎవరో ఒకరు లేదా కొత్తగా ప్రేమలో పడ్డవారు తమ పార్ట్నర్ ను ఆకట్టుకోవడానికి తెగ నటించేస్తూ ఉంటారు. అంతవరకు తాము ఎలా ఉన్నారో మరచిపోతారు. అయితే అలా నటించడం వంటివి చేయకండి. మీరు ఎప్పుడూ ఎలా ఉంటారో అలానే ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఎక్కువ కాలం యాక్టింగ్ చేసినా.. ఎప్పుడో ఒకప్పుడు వాస్తవం బయటపడుతుంది.

పాత రిలేషన్ గురించి..
ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ లైఫ్ లోనో.. కాలేజీ లైఫ్ లోనో లేదా జాబ్ చేసే చోట, ఇంకా ఏదైనా ఇతర చోట ఎవరితో మంచి రిలేషన్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రేమ దాకా వెళ్తూ ఉంటుంది. అయితే అనివార్య కారణాల వల్ల మీరు విడిపోవచ్చు. ఇలాంటి విషయాలను మరచిపోయి.. మీరు కొత్త సంబంధంలోకి అడుగుపెట్టంది. అయితే అలా మీరు కొత్త రిలేషన్లో చేరాక.. మీ భాగస్వామిని పాత సంబంధాల గురించి అడగడం వంటివి చేయొద్దు. ఎందుకంటే ఇది కొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు. అంతేకాదు వారు మీతో నిజంగా మంచి రిలేషన్ లో లేరేమో అనే భావనకు వెళ్తారట.

అవకాశం ఇవ్వాలి..
పెళ్లైన కొత్తలో చాలా మంది కపుల్స్ తమ పార్ట్నర్ గురించి ఏవేవో ఊహించుకుంటారు. ముఖ్యంగా తను అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అని కలలు కంటూ ఉంటారు. అయితే రియల్ లైఫ్ లో అదంతా ఈజీ కాదు. కాబట్టి వారిని బలవంతంగా మీకు నచ్చినట్టు మారమని కోరద్దు. మీరు వారిని గౌరవిస్తూ.. వారికి కొంత సమయం ఇస్తే.. వారు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే.. మీకు నచ్చినట్టు మారేందుకు అవకాశం కచ్చితంగా ఉంటుంది. అంతవరకు మీరు వెయిట్ చేయాలి.

ఫ్రెండ్స్ తో పరిచయం..
మీ లవర్ లేదా మీ పార్ట్నర్ స్నేహితులకు వెంటనే పరిచయం చేయమని అడగడం వంటివి చేయకండి. మిమ్మల్ని వారి స్నేహితులకు పరిచయం చేయడం లేదంటే.. అందుకు వేరే కారణాలు ఉండొచ్చు. కాబట్టి కాస్త ఓపిక పట్టండి. వారిని ఫ్రెండ్స్ కు పరిచయం చేయమని మాత్రం అస్సలు తొందరపెట్టకండి.



Click it and Unblock the Notifications